కృష్ణుడి గా కనిపిస్తున్న ఈ పాన్ ఇండియా స్టార్ డైరెక్టర్ ఎవరో తెలుసా..? ఫోటోలు వైరల్!

First Published | Nov 4, 2024, 11:02 PM IST

ఇప్పటి వరకు ఒక్క ఫ్లాప్ సినిమా కూడా లేని స్టార్ డైరెక్టర్  చిన్నప్పుడు కృష్ణుడిగా నటించిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇంతకీ ఎవరా స్టార్ డైరెక్టర్. 

రాజమౌళి

ప్రపంచ సినిమాని తెలుగు  సినీ పరిశ్రమ వైపు తిప్పుకునేలా చేసిన స్టార్ డైరెక్టర్ రాజమౌళి. అపజయం ఎదరుగని ఈ  దర్శకుడు. చైల్డ్ ఆర్టిస్ట్ గా ఓ సినిమా చేశాడు.  బాలనటుడిగా కృష్ణుడి పాత్రలో నటించి పాపులర్ అయ్యారు. 

Also Read: సమంతతో కలిసి నాగార్జునను మోసం చేసిన నాగచైతన్య

రాజమౌళి తొలి సినిమా

ప్రముఖ రచయిత విజయేంద్ర ప్రసాద్ కుమారుడు రాజమౌళి, జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటించిన స్టూడెంట్ నెంబర్ 1 సినిమాతో దర్శకుడిగా పరిచయం అయ్యారు. ఈ సినిమా జూనియర్ ఎన్టీఆర్ కు మొదటి మెగాహిట్ విజయం సాధించి పెట్టింది. ఈ సినిమాని తమిళంలో కూడా స్టూడెంట్ నెంబర్ 1 పేరుతోనే రీమేక్ చేశారు. అందులో శిబిరాజ్ హీరోగా నటించారు. కానీ తెలుగులో జూనియర్ ఎన్టీఆర్ కు కలిసొచ్చిన ఈ సినిమా తమిళంలో శిబిరాజ్ కు కలిసి రాలేదు.

Also Read:  రోజుకు 100 సిగరెట్లు తాగిన హీరో.. సడెన్ గా సంచలన నిర్ణయం


బాహుబలి దర్శకుడు రాజమౌళి

తెలుగు సినీ పరిశ్రమలో నిలదొక్కుకున్న రాజమౌళి, తన తొలి సినిమా విజయం తర్వాత సింహాద్రి, సై,  మగధీర, ఈగ, బాహుబలి వంటి సినిమాలతో వందల కోట్ల వసూళ్లు సాధించారు. స్టార్ డైరెక్టర్ గా వెలుగు వెలిగారు. 

Also Read: విజయ్ దేవరకొండకు గాయాలు, షూటింగ్ స్పాటో ప్రమాదం

RRR సినిమా

బాహుబలి సినిమా దాదాపు 1000 కోట్ల వసూళ్లు సాధించగా, RRR సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద భారీ విజయం సాధించడమే కాకుండా ఆస్కార్ అవార్డు కూడా గెలుచుకుంది. ఈ సినిమాలోని నాటు నాటు పాటకు సంగీత దర్శకుడు కీరవాణికి గోల్డెన్ గ్లోబ్, ఆస్కార్ అవార్డులు లభించాయి.

Also Read: రజినీకాంత్ ముందు మోహన్ బాబు పరువు తీసిన చిరంజీవి,

ఎన్టీఆర్-రాజమౌళి

దక్షిణాది సినీ అభిమానులకు పాన్ ఇండియా దర్శకుడిగా పేరు తెచ్చుకున్న రాజమౌళి, దర్శకుడిగానే కాకుండా చిన్నప్పుడు బాలనటుడిగా కూడా నటించారు. తన 10వ ఏట ఒక సినిమాలో నటించానని రాజమౌళి 'ఆర్ఆర్ఆర్' సినిమా ప్రమోషన్ కార్యక్రమంలో చెప్పారు. కానీ ఆ సినిమా రిలీజ్ కాలేదు.

Also Read: 

రాజమౌళి చిన్ననాటి ఫోటోలు

రాజమౌళి బాలనటుడిగా నటించిన సినిమా పేరు 'పిల్లనగ్రోవి'. ఈ సినిమాలో ఆయన బాలకృష్ణుడిగా నటించారు. 1983లో ఈ సినిమా షూటింగ్ జరిగింది. అప్పుడు రాజమౌళికి 10 ఏళ్లు. కానీ ఆ సినిమా రిలీజ్ కాలేదు. రాజమౌళి బాలనటుడిగా నటించారనే విషయం అభిమానులను ఆశ్చర్యపరిచింది. ఇప్పటివరకు 13 సినిమాలు తీసిన ఆయన ఒక్క ఫ్లాప్ కూడా ఫేస్ చేయలేదు. 

Latest Videos

click me!