ఆ వంశంలో 63వ తరం వీరుడిగా మహేష్.. రాజమౌళి మూవీ టైటిల్ లీక్, స్టోరీ కూడా వైరల్ ?

Published : Aug 10, 2025, 10:40 AM IST

రాజమౌళి చిత్రంలో మహేష్ బాబు ఒక వంశానికి చెందిన వీరుడిగా కనిపిస్తారని సమాచారం. SSMB 29 చిత్ర టైటిల్, కథకి సంబంధించిన వివరాలు ఈ కథనంలో తెలుసుకోండి. 

PREV
15
నవంబర్ లో SSMB 29 ఫస్ట్ రివీల్ 

సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శకధీరుడు రాజమౌళి కాంబినేషన్ లో రూపొందుతున్న చిత్రం SSMB 29(వర్కింగ్ టైటిల్). ఇది గ్లోబ్ ట్రోట్టర్ మూవీ అని రాజమౌళి కన్ఫర్మ్ చేశారు. అంటే ప్రపంచాన్ని మొత్తం తిరిగే వీరుడు అనే అర్థం వస్తుంది. రాజమౌళి ఇంతవరకు ఈ చిత్రానికి సంబంధించిన ఎలాంటి విషయాలు బయటపెట్టలేదు. శనివారం రోజు మహేష్ బాబు పుట్టిన రోజు సందర్భంగా ముఖం కనిపించకుండా ప్రీ లుక్ రిలీజ్ చేసి ఫస్ట్ రివీల్ నవంబర్ లో ఉంటుంది అని ప్రకటించారు. 

DID YOU KNOW ?
మహేష్ బాబు రెమ్యునరేషన్
మహేష్ బాబు, రాజమౌళి తొలి కాంబినేషన్ లో వస్తున్న చిత్రం SSMB 29. ఈ చిత్రం కోసం మహేష్ 125 కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.
25
వైరల్ అవుతున్న ప్రీ లుక్ 

మహేష్ బాబు ప్రీ లుక్ క్షణాల్లో వైరల్ గా మారింది. గుండెలపై రక్తం కారుతూ, మెడలో రుద్రాక్ష మాల.. మహా శివుడికి సంబంధించిన త్రిశూలం, నంది ఉన్న ప్రీ లుక్ అందరినీ ఆకర్షించింది. అంటే ఈ చిత్రంలో డివోషనల్ ఎలిమెంట్స్ ఉంటాయని రాజమౌళి చెప్పకనే చెప్పారు. ప్రీ లుక్ రిలీజ్ అయిన తర్వాత ఈ చిత్ర కథ, టైటిల్ గురించి ఆసక్తికర విషయాలు బయటకి వస్తున్నాయి. 

35
టైటిల్, స్టోరీ లీక్ ?

రాజమౌళి అండ్ టీం ఈ చిత్రానికి 'జెన్ 63' అనే టైటిల్ పరిశీలిస్తున్నారట. వినగానే హాలీవుడ్ స్టైల్ లో ఉన్నట్లు అనిపిస్తోంది. ఇలాంటి టైటిల్ పెట్టడానికి కారణం కథ ఆ విధంగా ఉంటుందని అంటున్నారు. జెన్ 63 అంటే 63వ జనరేషన్. ఈ చిత్రంలో మహేష్ బాబు ఒక కీలకమైన వంశంలో 63వ తరం వీరుడిగా కనిపిస్తారట. ఈ చిత్ర కథలో, మహేష్ బాబు పాత్రలో హిందూ పురాణాలకి సంబంధించిన అంశాలు ఉంటాయని అంటున్నారు. 

45
పురాణాలతో కథకి లింక్ 

63వ తరం అంటే ఆ వంశం ప్రారంభమై వేల ఏళ్ళు గడచి ఉంటుంది. ఆ విధంగా త్రేతా యుగం లేదా ద్వాపర యుగాలతో రాజమౌళి ఈ కథని కనెక్ట్ చేయబోతున్నారా అనేది క్లారిటీ లేదు. అందుతున్న సమాచారం మేరకు ఈ కథకి రామాయణానికి లింక్ ఉన్నట్లు తెలుస్తోంది. రామాయణంలో ఉండే కొన్ని పవర్ ఫుల్ వస్తువుల కోసం సాగే అన్వేషణగా ఈ కథ ఉంటుందని అంటున్నారు. ఈ కథలో కాశీ నగరానికి ప్రాముఖ్యత ఉంటుందని తెలుస్తోంది. 

55
గతంలో చూడని విధంగా ఫస్ట్ రివీల్ 

మొత్తంగా మహేష్, రాజమౌళి చిత్రానికి సంబంధించిన విషయాలు ఇప్పుడిప్పుడే వెలుగులోకి వస్తున్నాయి. నవంబర్ లో రిలీజ్ అయ్యే ఫస్ట్ రివీల్ తో ఈ చిత్రంపై అందరికీ ఓ క్లారిటీ వస్తుందని రాజమౌళి ప్రకటించారు. మునుపెన్నడూ చూడని విధంగా ఆ రివీల్ ఉండబోతోందట. 

Read more Photos on
click me!

Recommended Stories