`కూలీ` మూవీ క్రిటిక్‌ రివ్యూ, వామ్మో పూనకాలు తెప్పించే సర్‌ప్రైజ్‌ ఉందట.. రజనీ, నాగ్‌ వెండితెరపై రచ్చే

Published : Aug 10, 2025, 09:21 AM IST

రజనీకాంత్‌, నాగార్జున, అమీర్‌ ఖాన్‌, ఉపేంద్ర వంటి భారీ కాస్టింగ్‌తో రూపొందిన `కూలీ` మూవీకి సంబంధించిన క్రిటిక్‌ రివ్యూ వచ్చింది. పూనకాలు తెప్పించే సర్‌ప్రైజ్‌ ఉందట. 

PREV
15
`కూలీ`సినిమాపై భారీ అంచనాలు

ప్రస్తుతం సినీ లవర్స్ అంతా ఈగర్‌ గా వెయిట్‌ చేస్తోన్న మూవీ `కూలీ`. భారీ కాస్టింగ్‌తో వస్తోన్న సినిమా కావడంతో దీనిపై భారీ అంచనాలున్నాయి. పైగా మొదటిసారి రజనీకాంత్‌, లోకేష్‌ కనగరాజ్‌ కాంబినేషన్‌లో వస్తోన్న మూవీ కావడంతో అంచనాలు మరింత పెరిగాయి. నాగార్జున, అమీర్‌ ఖాన్‌, ఉపేంద్ర వంటి స్టార్‌ కాస్ట్ సినిమాపై క్యూరియాసిటీని పెంచుతున్నాయి. అలాగే ఇందులో నాగార్జున విలన్‌ రోల్‌ చేయడం మరింత క్రేజీగా మారింది. తన కెరీర్‌లోనే మొదటిసారి ఆయన విలన్‌ రోల్‌ చేస్తున్నారు. అది కూడా రజనీకాంత్‌ వంటి సూపర్‌ స్టార్‌కి విలన్‌గా, ఆయనతో పోటీ పడే పాత్రలో నాగ్‌ కనిపిస్తారనే వార్త తెలుగు ఆడియెన్స్ కి మతిపోయేలా చేస్తోంది.

DID YOU KNOW ?
నాగార్జున మొదటిసారి
నాగార్జున మొదటిసారి విలన్‌గా నటిస్తున్నారు. `కూలీ`లో ఆయనది నెగటివ్‌ షేడ్‌ ఉన్న పాత్ర అని టీమ్‌ తెలిపిన విషయం తెలిసిందే. ఆడియెన్స్ ఆయన పాత్రని ఎలా రిసీవ్‌ చేసుకుంటారో చూడాలి.
25
`కూలీ` సినిమాకి సెన్సార్‌ `ఏ` సర్టిఫికేట్‌

ఇప్పటికే విడుదలైన ట్రైలర్‌ ఆకట్టుకుంది. అయితే ఆశించిన స్థాయిలో లేదు, కానీ క్యూరియాసిటీని క్రియేట్‌ చేస్తోంది. ఎక్కువగా పాత్రలను పరిచయం చేయడానికే ప్రయారిటీ ఇచ్చినట్టు తెలుస్తోంది. ఎమోషనల్‌గానూ కనెక్ట్ చేసే ప్రయత్నం చేశారు. ఇవన్నీ సినిమాలో ఏదో ఉండబోతుందనే ఆశలను రేపుతుంది. పైగా పలు ఇంటర్వ్యూస్‌లో సినిమాకి సంబంధించిన పలు క్రేజీ విషయాలు వెల్లడించారు దర్శకుడు లోకేష్‌ కనగరాజ్‌. యాక్షన్‌ విషయంలో రాజీపడలేదని, రజనీకాంత్‌ సార్‌ని వేరే లెవల్‌లో చూపించినట్టు చెప్పారు. దీంతో సెన్సార్‌ ఏకంగా `ఏ`సర్టిఫికేట్‌ వచ్చింది. దాదాపు ముప్పై ఏళ్ల తర్వాత రజనీ మూవీకి ఏ సర్టిఫికేట్‌ రావడంతోనే ఇందులో హింస ఏ రేంజ్‌లో ఉండబోతుందనేది అర్థం చేసుకోవచ్చు.

35
`కూలీ` మూవీ క్రిటిక్‌ రివ్యూ

ఇంకోవైపు తాజాగా క్రిటిక్‌ రివ్యూ వచ్చిది. ఓవర్సీస్‌ క్రిటిక్‌గా పిలవబడే ఉమైర్‌ సందు ఈ మూవీకి సంబంధించిన రివ్యూ ఇచ్చారు. ఆయన సెన్సార్‌ సభ్యుడిగా చెప్పుకుంటున్న విషయం తెలిసిందే. ఆయన `కూలీ` రివ్యూని వెల్లడించారు. పూనకాలు తెప్పించే విషయాలు బయటపెట్టాడు. రజనీకాంత్‌ వన్‌ మ్యాన్‌ షో అని, ఆయన అందరి చూపు తనవైపు తిప్పుకుంటాడని తెలిపారు. ఆయనది పవర్‌ ప్యాక్డ్ పర్‌ఫెర్మెన్స్ అని చెప్పారు. కథ, స్క్రీన్‌ప్లే యావరేజ్‌గా ఉంటాయట. రజనీతోపాటు సపోర్టింగ్‌ యాక్టర్స్ నాగార్జున, అమీర్‌ ఖాన్‌, ఉపేంద్ర, శృతి హాసన్‌ అదరగొట్టారని, వీరి నటనే సినిమాకి హైలైట్‌గా నిలుస్తుందన్నారు.

45
`కూలీ`లో బిగ్‌ సర్‌ప్రైజ్‌

ముఖ్యంగా క్లైమాక్స్ లో లాస్ట్ 20 నిమిషాలు సినిమా వేరే లెవల్‌లో ఉంటుందట. అదే సినిమాకి మెయిన్‌ అని, అందులో బిజీఎం, యాక్షన్‌ వేరే లెవల్‌ అన్నారు. అంతటితో ఆగలేదు, ఇందులో ఒక బిగ్గెస్ట్ సర్‌ప్రైజ్‌ ఉందట. దాన్ని చూసి అంతా షాక్‌ అవుతారని తెలిపారు. పూనకాలు తెప్పించేలా ఆ సర్‌ప్రైజ్‌ ఉంటుందన్నారు. మరోవైపు రజనీ, నాగ్‌ మధ్య వచ్చే సీన్లు పిచ్చెక్కించేలా ఉంటాయని అంటున్నారు. మొత్తంగా పైసా వసూల్‌ మూవీ అని, రజనీ ఫ్యాన్స్ ఎంజాయ్‌ చేసేలా ఉంటుందన్నారు. ఓవరాల్‌గా మూవీకి బ్లాక్‌ బస్టర్‌ రేటింగ్‌ ఇచ్చాడు. ఇదే ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. రజనీకాంత్‌ మూవీకి, ఇంతటి భారీ కాస్టింగ్‌ ఉన్న సినిమాకి గొప్ప కథ అవసరం లేదు. జస్ట్ యావరేజ్‌ నుంచి, ఎబౌ యావరేజ్‌ ఉన్నా చాలు, దుమ్ములేపుతుంది. మరి `కూలీ` ఆ మ్యాజిక్‌ చేస్తుందా? అనేది చూడాలి.

55
`కూలీ`లో విక్రమ్‌ ఎంట్రీ ఉంటుందా?

ఇదిలా ఉంటే ఉమైర్‌ సందు చెప్పినట్టు ఇందులో ఉన్న పెద్ద సర్‌ప్రైజ్‌ ఏంటనేది ఆసక్తికరంగా మారింది. మరో హీరో ఎంట్రీ ఇస్తారా? అనే ఆసక్తిని క్రియేట్‌ చేస్తుంది. అయితే కోలీవుడ్‌లో మాత్రం `విక్రమ్‌(కమల్‌ హాసన్‌) ఎంట్రీ ఉంటుందనే ప్రచారం జరుగుతోంది. ట్రైలర్‌ని డీ కోడ్‌ చేస్తూ `విక్రమ్‌` సినిమాకి లింక్‌ పెట్టి చూస్తూ కమల్‌ ఎంట్రీ ఉండే అవకాశం ఉందని, ఇది లోకేష్‌ `ఎల్‌సీయూ`లో భాగంగా వస్తోన్న మూవీనే అని అంటున్నారు. కాకపోతే ఇది `ఎల్‌సీయూ` మూవీ కాదని లోకేష్‌ ఓ ఇంటర్వ్యూలో చెప్పడం గమనార్హం.  భారీ కాస్టింగ్‌తో రూపొందిన ఈ సినిమాకి అనిరుధ్‌ రవిచందర్‌ సంగీతం అందించారు. సర్‌పిక్చర్స్ నిర్మించింది. సుమారు రూ.400కోట్ల బడ్జెట్‌తో ఈ చిత్రం తెరకెక్కింది. ఆగస్ట్ 14న స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని సినిమా విడుదల కాబోతుంది.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories