జీవితంలో ఈ అమ్మాయిని కోడలుగా అంగీకరించను. పస్తులైన ఉంటాను గాని దాని చేతి వంట తినను అంటూ కోపంగా అక్కడ నుంచి వెళ్ళిపోతుంది అపర్ణ. కష్టపడి చేసింది కాస్త తిను అని భర్త, అత్తగారు ఎంత చెప్పినా వినిపించుకోదు. కావ్య వంట చేసిందని అప్పుడే తెలుసుకున్న రాజ్ కూడా కోపంతో అక్కడి నుంచి వెళ్ళిపోతే మీ అమ్మకి పట్టిన ముహూర్తమే మీకు కూడా పట్టిందా పిచ్చి వేషాలు వేయకుండా తిను అని తండ్రి చెప్పటంతో బలవంతంగా తింటాడు రాజ్.