అఖిల్ ‘ఏజెంట్’ తెలుగు మూవీ రివ్యూ

First Published | Apr 28, 2023, 12:20 PM IST


పఠాన్ వంటి సూపర్ హిట్  స్పై థ్రిల్లర్ రీసెంట్ గానే  చూసాక మరో సినిమా అదే జానర్ లో వస్తే ..దాన్ని దాటి ఉండాలి. లేదా ప్రక్కనే నిలబడేలా ఉండాలి. లేకపోతే దాన్ని భరించగలమా
 

Agent Movie Review


అఖిల్ కు మొదటి నుంచి మాస్ ఇమేజ్ తెచ్చుకోవాలనే ఆసక్తి ఎక్కువ.  మొదటి సినిమానే  మాస్‌ డైరెక్టర్‌ వి.వి. వినాయక్‌ తో  భారీ బడ్జెట్‌తో ‘అఖిల్‌’అని చేశాడు.అయితే ఆ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద దారుణంగా బోల్తా పడింది. దీంతో తన పంథాని మార్చి లవర్‌ బాయ్‌గా మారాడు. అయినా కూడా పెద్ద సెక్సెస్‌ని అందుకోలేకపోయాడు. చివరి మూవీ `మోస్ట్ ఎలిజిబుల్‌ బ్యాచ్‌లర్‌` ఓ మోస్తరు విజయం సాధించింది. ఈ ఊపులో మరోసారి మాస్ హీరో గా తనను తాను చూసుకోవాలని ‘ఏజెంట్‌’గా  మన  ముందుకు వచ్చాడు. అయితే ఈ సారి అయినా అతని మాస్ మంత్రం ఫలించిందా... ‘ఏజెంట్‌’కథేంటి? ఎలా ఉంది? హిట్ అతని ఖాతాలో పడిందా వంటి విషయాలు చూద్దాం.


స్టోరీ లైన్ :

RAW(ఇంటిలిజెన్స్)  చీఫ్ మహదేవ్ (ముమ్మట్టి)కు డెవిల్ అని మరో పేరు. ఆయన ఎలాంటి ఎసైన్మెంట్ అయినా ఈజీగా టాకిల్ చేసి సక్సెస్ అవుతూంటాడు. ఆయన ఇప్పుడు ఓ ప్రత్యేకమైన ఎసైన్మెంట్ మీద ఉన్నారు. భారతదేశాన్ని అన్ని విధాలుగా దెబ్బకొట్టి, గుప్పిట్లో పెట్టుకోవాలని  పరితపిస్తున్న గాడ్ (డినో మారియా)ని పట్టుకోవాలని టార్గెట్. గాడ్ కు ఇంటర్నేషనల్ గా కొంతమందితో కలిసి సిండికేట్ ఏర్పాటు చేసి ఉన్నాడు. అతన్ని పట్టుకోవటానికి పంపిన ప్రతీ స్పైని పైకి పంపేస్తున్నాడు. అప్పుడు డెవిల్ దృష్టిలో రామకృష్ణ అలియాస్ రిక్కీ అలియాస్ వైల్డ్ (అఖిల్) పడతాడు. సారీ..... వైల్డే తను స్పై అయ్యిపోవాలనే జీవితాశయంతో తనకు వచ్చిన ఎథికల్ హ్యాకింగ్ టెక్నిక్ లతో డెవిల్ ని తనవైపుకు తిప్పుకుంటాడు. గాడ్ ని లేపేయటానికి ఓ వ్యక్తికోసం వెతుకుతున్న డెవిల్ కు ఈ వైల్డ్ ఫెరఫెక్ట్ ఛాయిస్ అనిపిస్తాడు. దాంతో ఆ ఇంటర్నేషనల్ డాన్ పైకి తెలివైన వాడు,  అల్లరి చిల్లరి కుర్రాడు అయిన వైల్డ్ ని ప్రయోగిస్తాడు. గాడ్ ని వెతుక్కుంటూ వెళ్లిన వైల్డ్ కు ఎలాంటి అనుభవాలు అయ్యాయి. అసలు వైల్డ్ కు ఈ స్పై అవ్వాలనే పిచ్చి పుట్టడం వెనుక కథేంటి వంటి విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే. 

Latest Videos


  
విశ్లేషణ:

సినిమా ఎలా ఉందీ అంటే రకరకాలుగా ఉందని చెప్పాలి.  స్టోరీ లైన్ రీసెంట్ గా వచ్చిన షారూఖ్ పఠాన్, హృతిక్ వార్ సినిమాలు గుర్తు చేస్తుంది. రా లో పనిచేసే ఓ వ్యక్తి బయిటకు వచ్చి అదే రా కు వ్యతిరేకంగా తయారు అయితే అనేది దాకా సినిమాలర్ దాకా ఉంటుంది. అయితే  వాటి అంత గొప్పగా సినిమా ఉండదు.  కోతి లాంటి ఒక అల్లరి కుర్రాడు స్పై అవతారం ఎత్తి ఇంటర్నేషనల్ మాఫియా డాన్ ని అంతమొందించే ప్రయత్నం చేస్తున్నాడంటే ఇదేదో యాక్షన్ కామెడీ కథ అనిపిస్తుంది. కానీ దాన్ని సీరియస్ గా సాగ తీస్తూ వెళ్లిపోయారు. ఫస్టాఫ్ మొత్తాన్ని హీరో, విలన్, ముమ్మట్టి పాత్రలు ఇంట్రడక్షన్ లు, సెటప్ కే సరిపెట్టేసారు. ఇంటర్వెల్ కు కానీ హీరో యాక్షన్ లోకి వచ్చే అవకాసం ఇవ్వరు. ఈ మధ్యలో గ్యాప్ ఎక్కువ ఉందని,  లవ్ స్టోరీ కూడా పెట్టారు. అయితే అదీ అతికినట్లు..ఇంకాస్త అతిగానూ అనిపిస్తుంది. సర్లే అప్పుడే జడ్జిమెంట్ కువచ్చేయటమెందుకు...ఇంకా సెకండాఫ్ ఉందిగా... అయినా ఇంటర్వెల్ దాకా కథలోకి రావపోవటం మనకు కొత్త కాదు కాబట్టి సెకండాఫ్ లో భూమి బ్రద్దలయ్యే సీన్ ఉంటుందనుకుంటాం. అయితే అది మరీ దారుణం. సెకండాఫ్ పూర్తయ్యాక..ఫస్టాఫే వెయ్యి రెట్లు బెస్ట్ అనిపిస్తుంది. ఎందుకంటే సెకండాఫ్ అంతకు మించి అన్నట్లు కన్ఫూజన్ గా ఉంటుంది. 


హీరో ముమ్మట్టీనో, అఖిలో ఓ టైమ్ లో అర్దం కాదు...ఎవరో ఒకరు ...అని అనుకున్నా ఈ కన్ఫూజన్ విలన్ కీ వచ్చిందేమో అనిపిస్తుంది. దాంతో సినిమా మొత్తం మీద విలన్ ఏమీ చెయ్యడు. చేస్తాను..చేస్తాను అని మన పొలిటీషన్స్ లా ఆశపెడుతూంటాడు. అది ఎప్పటికీ జరగదు. అయినా అతను ఏం చేస్తాడో..చేస్తే దేశానికి ఏం నష్టమో అర్దమే కాదు. మధ్యలో ఈ కన్ఫూజన్ చాలదన్నట్లు కొత్త క్యారక్టర్స్ వస్తూంటాయి. ఇవే దేకలేకపోతున్నాం...మళ్లీ వాళ్ళంతా ఎందుకు అనిపిస్తుంది. మాట్లాడితే హీరో తనను తాను వైల్డ్ సాలా అని చెప్పుకుంటూ, అవకాసం దొరికినప్పుడు అదే పాటగా  పాడుకుంటూంటాడు. ఇదంతా ఒకెత్తు అయితే హీరో స్పై అవ్వాలనుకోవటానికి ఓ ప్లాష్ బ్యాక్ పెట్టారు. అది చూస్తే మనకు బ్రహ్మానందం స్పూఫ్ చూస్తున్నామా అని సందేహం వస్తుంది. అంత సిల్లీగా ఉంటుంది. స్పైగా అఖిల్ డాన్స్ లు చేస్తూ కాలుస్తూంటే..ఆ బుల్లెట్ ఏదో మనకూ తగిలితే మిగతా సినిమా చూసే బాథ తప్పుతుంది కదా అనిపిస్తుంది. ఏదైమైనా హీరో ప్యాసివ్ గా ఉన్నప్పుడు ఎంతలా మిషన్  గన్ లు రాంబోలా కాల్చినా బుల్లెట్లు వేస్ట్ అవ్వటం తప్ప ఒరిగేదేమీ ఉండదు. 
 

ప్లస్ లు 
అఖిల్ సిక్స్ ప్యాక్ బాడీ
ఇంట్రవెల్ బ్లాక్
యాక్షన్ సీన్స్
ప్రొడక్షన్ వాల్యూస్

మైనస్ లు
కన్ఫూజన్ గా మారిన సెకండాఫ్
ఎడిటింగ్
లాజిక్ లేని కథ,కథనం 
పాటలు

 
టెక్నికల్ గా...

సురేంద్రరెడ్డి సినిమాల్లో ఇంత దారుణమైన సంగీతం ఇదేనేమో. ఒక్కటీ గుర్తుండే పాట కాదు. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కొన్ని చోట్ల బాగుంది. మరికొన్ని చోట్ల అతనూ చేతులెత్తేసారు. అయితే బాగా లౌడ్ గా ఉంది. రసూల్ ఎల్లోర్ కెమెరా వర్క్ మాత్రం చాలా బాగుంది. ఈ సినిమాకు కీలకమైన స్టోరీ లైన్ లోనే కన్ఫూజన్ ఉంది. దాంతో స్క్రీన్ ప్లేనూ విసుగెత్తించింది. డైలాగులు జస్ట్ ఓకే అన్నట్లున్నాయి. సాంగ్స్  ప్లేస్ మెంట్ దారుణం. వైల్డ్ సాలా ఐటం సాంగ్ వచ్చినప్పుడు అయితే జనం లేచి వెళ్లిపోయే పరిస్దితి. ఇక ద‌ర్శ‌కుడు సురేంద‌ర్ రెడ్డి మూవీని చూసి మెచ్చుకునేలా మ‌ల‌చ‌డంతో విఫ‌ల‌మ‌య్యాడ‌నే చెప్పాలి. 

 
ఫెరఫార్మెన్స్ ల విషయానికి వస్తే...

ఈ సినిమా కోసం అఖిల్ సిక్స్ ప్యాక్ లు గట్రా చేసి  చాలా కష్టపడ్డాడని  అర్ధ‌మ‌వుతుంది.  యాక్ష‌న్ సన్నివేశాల‌ు బాగా చేసాడు.. అయితే అవసరమైన న‌ట‌న‌లో  తేలిపోయాడు. ఫలితం ఏముంది. కండలతో నటించటం ఇంకా పూర్తిగా రాలేదు. అప్పుడు ఎక్సప్రెషన్స్ తో పని ఉండదు. ఇక హీరోయిన్ సాక్షి వైద్య త‌న న‌ట‌న‌తో ప‌ర్వాలేద‌నిపించింది. అయితే సినిమాలో హీరోయిన్ లేకపోయినా వచ్చే నష్టమేమీ లేదు. అస్సలేమాత్రం ప్రాధాన్యత లేని పాత్రని సినిమాలో పెట్టారు.  దానికి తోడు పట్టి పట్టి మాట్లాడుతునట్లు తెలంగాణా స్లాంగ్ లో ఆమె డైలాగులు. మమ్ముట్టి అనుభవం ఎందుకుపనికిరాలేదు.  విలన్ గా డినోమోరియా ని చూస్తే జాలి వేస్తుంది. వరలక్ష్మి శరత్ కుమార్ అయితే అలా వెనక నిలబడి ఏంటిరా నన్ను ఎందుకు తీసుకున్నారురా ఈ సినిమా కి అని అడుగుదామనుకుని ఎందుకలే అని ఆగిపోయినట్లు కనిపిస్తుంది. . మురళీ శర్మ, సంపత్ రాజ్, పోసాని కృష్ణమురళీ, భరత్ రెడ్డి తదితరులకు నటించే అవకాశం రాలేదు. 

Wild Saala Video Song agent movie telugu 2023 mammootty akhil akkineni nsn

ఫైనల్ థాట్

విగ్రహం పుష్టి విషయం నష్టి అన్నట్లుంది. హీరో కండల చూపటం మీద పెట్టిన శ్రద్ధలో పదో వంతు కథ, కథనాల మీద పెట్టి వుంటే బెటర్ రిజల్ట్ వచ్చి వుండేదేమో.!

----సూర్య ప్రకాష్ జోశ్యుల
Rating:2

agent new trailer with mammootty voice akhil akkineni nsn


నటీనటులు : అఖిల్ అక్కినేని, మమ్ముట్టి, డినో మోరియా, సాక్షి వైద్య, మురళీ శర్మ, పోసాని కృష్ణమురళి, భరత్ రెడ్డి, వరలక్ష్మీ శరత్ కుమార్, సంపత్ రాజ్ తదితరులు 
కథ : వక్కంతం వంశీ 
మాటలు : భార్గవ్ కార్తీక్
ఛాయాగ్రహణం : రసూల్ ఎల్లోర్
సంగీతం : హిప్ హాప్ తమిళ, భీమ్స్ (వైల్డ్ సాలా సాంగ్)
నిర్మాత : రామబ్రహ్మాం సుంకర 
స్క్రీన్ ప్లే, దర్శకత్వం : సురేందర్ రెడ్డి
విడుదల తేదీ: ఏప్రిల్ 28, 2023

click me!