Brahmamudi: రాహుల్ లో మరో కోణాన్ని చూసిన రాజ్.. కిడ్నాప్ కి గురైన కావ్య, శృతి!

First Published May 27, 2023, 11:46 AM IST

Brahmamudi: స్టార్ మా లో ప్రసారమవుతున్న బ్రహ్మముడి సీరియల్ ప్రేక్షకుల హృదయాలని గెలుచుకొని మంచి రేటింగ్ ని సంపాదించుకుంటుంది. తన భర్త పెట్టిన గడువులోగా తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవాలని ప్రయత్నిస్తున్న ఒక భార్య కథ ఈ సీరియల్. ఇక ఈరోజు మే 27 ఎపిసోడ్ లో ఏం జరిగిందో చూద్దాం.
 

 ఎపిసోడ్ ప్రారంభంలో రేపు ఎట్టి పరిస్థితుల్లోని  నిశ్చితార్థం జరిగి తీరాలి అంటుంది రుద్రాణి. పంతులుగారు మళ్లీ పంచాంగం చూసి రేపు పొద్దున్న వినాయకుని పూజా నవగ్రహ పూజ చేస్తే దోషం పోతుంది అప్పుడు సాయంత్రం నిశ్చితార్థం చేసుకోవచ్చు అంటారు. ఆ మాటలకి సంతోషపడుతుంది రుద్రాణి. అదే విషయాన్ని అరుంధతికి ఫోన్ చేసి చెప్తుంది. అదే సమయంలో అప్పు, కళ్యాణ్ కి ఫోన్ చేస్తుంది.

కళ్యాణ్ ఫోన్ తీసుకెళ్లి కావ్యకి ఇస్తాడు. స్వప్నకి నిశ్చితార్థం జరుగుతుంది అని చెప్తుంది అప్పు. అమ్మ ఏం చేసినా మన మంచి కోసమే చేస్తుంది తనని ఆ పెళ్లి చేసుకొనివ్వు అంటుంది కావ్య.మరి రాహుల్ సంగతి ఏం చేద్దాము అంటుంది అప్పు. వాడు ఒక లోఫర్ వాడి గురించి వదిలేయ్. నీకు అసలు ఏమీ తెలియనట్లే ఉండు అని చెప్పి ఫోన్ పెట్టేస్తుంది కావ్య. వెనక్కి తిరిగేసరికి రాహుల్ ఉంటాడు.

 ఏంటి స్వప్నకి నిశ్చితార్థమా అదంతా నా ప్లాన్ ప్రకారమే జరుగుతుంది అంటాడు రాహుల్. నువ్వు బెదిరిస్తే బెదిరిపోవటానికి నేను శృతిని కాదు అంటుంది కావ్య. ఒక్కసారిగా షాక్ అవుతాడు రాహుల్. ఈసారి కి నువ్వే గెలిచావు  కానీ నేను కూడా గెలవాలి కదా. గేమ్ నువ్వు స్టార్ట్ చేసావు విన్నింగ్ షాట్ నేను కొడతాను అని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది కావ్య.

ఏం చేస్తుందో అని కంగారు పడతాడు రాహుల్. మరోవైపు రాజ్  దగ్గరికి కూకట్ పల్లి బ్రాంచ్ మేనేజర్ వస్తాడు. ఈ టైం లో వచ్చారేంటి అంటాడు రాజ్. నేనే రమ్మన్నాను మీరు కూకట్ పల్లి బ్రాంచ్ కి మన పెళ్లి అయిన దగ్గర్నుంచి వెళ్లట్లేదు కదా అంటుంది కావ్య. అవును ఆ బ్రాంచ్ సంగతి రాహుల్ చూస్తానన్నాడు అందుకే వెళ్ళలేదు అంటాడు రాజ్. ఆ విషయమే మేనేజర్ గారు మీకు స్వయంగా చెప్తే బాగుంటుందని రమ్మన్నాను అంటుంది కావ్య.

రాహుల్ గారు అసలు బ్రాంచ్ కి రావట్లేదు వర్కర్స్ కి ఇవ్వాల్సిన బోనస్  డబ్బులు కూడా ఇవ్వలేదు. ఏమైనా అంటే అన్ని రాజ్  గారికి చెప్పే చేస్తున్నాను అంటున్నారు. ఇప్పుడు వర్కర్స్ స్ట్రైక్ చేస్తున్నారు అందుకే మీ వరకు వచ్చాను అంటాడు మేనేజర్. రేపు హెడ్ ఆఫీస్ కి వచ్చి అమౌంట్ తీసుకొని వర్కర్స్ కి సెటిల్ చేయండి అని చెప్పటంతో మేనేజర్ అక్కడ నుంచి వెళ్ళిపోతాడు.

మీకు తెలిసిన రాహుల్ వేరు అసలు రాహుల్ వేరు ఇప్పటికైనా మీ చుట్టూ ఉన్న వాళ్ళ గురించి తెలుసుకోండి అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది కావ్య. రాహుల్ ని నిలదీద్దాం అనుకుంటాడు రాజ్. కానీ వాళ్ళ అత్త కోసం ఆలోచించి ఆగిపోతాడు. మరోవైపు శృతి, కావ్యకి ఫోన్ చేసి రాహుల్ ని పట్టుకోవడానికి సాక్షాల గురించి ఏదో మాట్లాడుతుంది. అలాగే నువ్వు చెప్పినట్లే చేద్దాం అంటూ ఫోన్ పెట్టేస్తుంది కావ్య.

మరోవైపు భర్తకి టిఫిన్ తీసుకువచ్చి రాహుల్ ఎంగేజ్మెంట్ హడావుడిలో మీరు టిఫిన్ చేయడం మర్చిపోయారు అని చెప్తుంది కావ్య. ఈ హడావిడిలో పడి నువ్వు కూడా ఒక విషయం మర్చిపోయావు అంటాడు రాజ్. మీరు పెట్టిన గడువు ఈరోజుతో ముగుస్తుంది ఆ విషయం నాకు గుర్తుంది అంటుంది కావ్య. నిజం నిరూపించకపోతే ఇంట్లోంచి వెళ్లిపోవాలని గుర్తు ఉంది కదా అంటాడు రాజ్. నిరూపిస్తాను అని కాన్ఫిడెంట్గా చెప్తుంది కావ్య.

ఆ తరువాత ఒక లెటర్ కళ్యాణ్ కి ఇచ్చి మా అమ్మకు తెలియకుండా మా అక్కకి అందేలాగా చేయండి అని చెప్తుంది. ఇంతలో శృతి ఫోన్ చేసి నా దగ్గర సాక్షాలు ఏమీ దొరకలేదు కానీ ఒక దగ్గరికి వెళ్తే సాక్షాలు దొరకొచ్చు అంటుంది. రాహుల్ ని పట్టుకోవడం కోసం నేను ఎంత దూరమైనా వెళ్తాను అని చెప్పి ఫోన్ పెట్టేసి నేను ముందు వెళ్తాను మీరు తర్వాత రండి అలా అయితేనే ఇంట్లో ఎవరికీ అనుమానం రాదు అని కళ్యాణ్ కి చెప్పి బయలుదేరుతుంది కావ్య. మరోవైపు నిశ్చితార్థానికి అన్ని ఏర్పాట్లు చేస్తూ కంగారుపడుతుంది కనకం. ఏమైంది అంటుంది మీనాక్షి. స్వప్న ఏ నిమిషంలో ఏం చేస్తుందో అని కంగారుగా ఉంది అంటుంది కనకం. 

వెళ్లి మీ అక్కకి కాపలాగా ఉండు అని అప్పుని పంపిస్తుంది మీనాక్షి. అప్పు, స్వప్న దగ్గరికి వెళ్లేసరికి తను ఏడుస్తూ కూర్చుంటుంది. ఆఖరికి నీకు ఆ ఏడుపే మిగిలింది అంటూ చివాట్లు పెడుతుంది అప్పు. తరువాయి భాగంలో తల్లి మాటల్లో రాహుల్ కి నిశ్చితార్థమని తెలుసుకొని షాక్ అవుతుంది స్వప్న. మరోవైపు శృతిని, కావ్యని కిడ్నాప్ చేస్తారు రాహుల్ మనుషులు. మరోవైపు రాహుల్ నిశ్చితార్థం జరిగిపోతూ ఉంటుంది.

click me!