`వీడీ 14` స్టోరీ ఇదే.. విశ్వరూపం చూపించబోతున్న విజయ్‌ దేవరకొండ

Published : Oct 16, 2025, 02:51 PM IST

విజయ్‌ దేవరకొండ చేతిలో రెండు సినిమాలున్నాయి. వాటిలో రాహుల్‌ సాంక్రిత్యాన్‌ డైరెక్షన్‌లో రూపొందుతున్న చిత్రంలో విజయ్‌ రోల్‌, మూవీ స్టోరీ గూస్‌ బంమ్స్ తెప్పించేలా ఉంటాయట. 

PREV
14
రెండు క్రేజీ మూవీస్‌తో బిజీగా ఉన్న విజయ్ దేవరకొండ

రౌడీ బాయ్‌ విజయ్‌ దేవరకొండ చివరగా `కింగ్‌డమ్‌` అనే మూవీతో ఆడియెన్స్ ముందుకు వచ్చాడు. వరుస పరాజయాల్లో ఉన్న విజయ్‌కిది పెద్ద రిలీఫ్‌నిచ్చింది. అయితే ఈ మూవీకి క్రిటిక్స్ పరంగా పాజిటివ్‌ టాక్‌ వచ్చినా, కమర్షియల్‌గా ఆశించిన స్థాయిలో సత్తా చాటలేకపోయింది. గౌతమ్‌ తిన్ననూరి దర్శకత్వంలో ఈ మూవీ రూపొందిన విషయం తెలిసిందే. నాగవంశీ నిర్మించారు. అనంతరం ఇప్పుడు రెండు క్రేజీ సినిమాలతో విజయ్‌ బిజీగా ఉన్నారు. ఓ వైపు సాహుల్‌ సాంక్రిత్యాన్‌ దర్శకత్వంలో ఓ మూవీ చేస్తున్నారు. దీంతోపాటు రవికిరణ్‌ కోలా దర్శకత్వంలో మరో మూవీ రూపొందుతుంది. ఇది ఇటీవలే ప్రారంభమైంది.

24
రాహుల్‌ సాంక్రిత్యాన్‌ చిత్రంలో రష్మికతో రొమాన్స్

ఇదిలా ఉంటే రాహుల్‌ సాంక్రిత్యాన్‌ దర్శకత్వంలో `వీడి 14` పేరుతో ఓ మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే. చాలా రోజుల క్రితమే ఇది ప్రారంభమైంది. ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉంది. ఇందులో రష్మిక మందన్నా హీరోయిన్‌గా నటిస్తోంది. `గీతా గోవిందం`, `డియర్‌ కామ్రేడ్‌` తర్వాత మరోసారి విజయ్‌, రష్మిక ఇందులో కలిసి నటిస్తున్నారు. ఇప్పటికే రహస్యంగా ఎంగేజ్‌మెంట్‌ చేసుకున్న ఈ జంట త్వరలో ఒక్కటి కాబోతున్నారు. మరోవైపు రాహుల్‌ సాంక్రిత్యాన్‌ మూవీలో కలిసి నటిస్తుండటం విశేషం. దీంతో ఇదే ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ పై ఆసక్తిని పెంచింది. ఈ నేపథ్యంలో ఇప్పుడు మరో ఆసక్తికర విషయాన్ని వెల్లడించారు దర్శకుడు రాహుల్‌. ఇందులో విజయ్‌ దేవరకొండ రోల్‌ ఎలా ఉండబోతుందనేది వెల్లడించారు.

34
వీడీ 14లో విజయ్‌ విశ్వరూపం

రాహుల్‌ సాంక్రిత్యాన్‌ తాజాగా `డ్యూడ్‌` ఈవెంట్‌లో పాల్గొన్నారు. ప్రదీప్‌ రంగనాథన్‌ హీరోగా నటించిన చిత్రమిది. ఈ నెల 17న తెలుగులో విడుదల కానుంది. బుధవారం రాత్రి ఈ మూవీ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ జరిగింది. ఇందులో గెస్ట్ గా పాల్గొన్న రాహుల్‌ సాంక్రిత్యాన్‌ మాట్లాడుతూ విజయ్‌ దేవరకొండ సినిమా అప్‌ డేట్‌ ఇచ్చారు. మూవీపై హైప్‌ని పెంచారు. మొదట ఇప్పుడే ఏం చెప్పలేమని, ఇంకా చాలా ఉందని తెలిపిన ఆయన `వీడీ14`లో విజయ్‌ నటన చూస్తే షాక్‌ అవుతారని చెప్పారు. అంతేకాదు ఇందులో విజయ్‌ దేవరకొండ విశ్వరూపం చూస్తారని వెల్లడించడం విశేషం. ఇలా ఒక్క మాటతో మూవీపై హైప్‌ని పెంచేశారు.

44
వీడీ 14 అసలు స్టోరీ లైన్‌ ఇదే

విజయ్‌, రాహుల్‌ కాంబినేషన్‌లో వస్తోన్న ఈ మూవీ పీరియాడికల్ యాక్షన్‌ ఫిల్మ్ డ్రామాగా తెరకెక్కుతుందట. బ్రిటీష్‌ కాలం నేపథ్యంలో  సినిమా సాగుతుందని సమాచారం. 19వ శతాబ్దంలో 1854 నుంచి 1878 వరకు జరిగిన యదార్థ కథని ఆధారంగా చేసుకుని ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారట దర్శకుడు రాహుల్‌. విజయ్‌ పాత్ర కూడా రియల్‌ లైఫ్‌ రోల్‌ని రిఫ్లెక్ట్ చేస్తుందట. ఇప్పటి వరకు చూడని కథని వెండితెరపై ఆవిష్కరించబోతున్నారట. సినిమా వేరే లెవల్ లో ఉంటుందని అంటున్నారు. విజయ్‌ పీరియడ్‌ కథలో నటిస్తున్నాడంటేనే అది మామూలుగా ఉండదు, పైగా రాహుల్‌ తెరకెక్కిస్తే అది వేరే లెవల్‌ అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. మరి అది ఏ స్థాయిలో ఉంటుందో చూడాలి. అన్ని అనుకున్నట్టు జరిగితే ఈ మూవీని వచ్చే ఏడాది చూడొచ్చు. ఇక సినిమాని మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ యెర్నేని, వై రవిశంకర్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories