
సిద్ధు జొన్నలగడ్డ `టిల్లు` సినిమాలతో తెలుగు ఆడియెన్స్‌కి దగ్గరయ్యాడు. `డీజే టిల్లు`, `టిల్లు స్వ్కేర్` మూవీస్ తో బ్యాక్ టూ బ్యాక్ హిట్ కొట్టాడు. డైలాగ్ కామెడీతో, సిచ్చ్యూవేషన్ కామెడీతో నవ్వులు పూయించాడు. ముఖ్యంగా సిద్ధు క్యారెక్టరైజేషన్ ఆద్యంతం ఆకట్టుకుంది. సినిమా సక్సెస్ లో భాగమయ్యింది. సిద్ధు కూడా టిల్లుగా రెచ్చిపోయి చేశారు. ఇలాంటి క్యారెక్టర్ తెలుగు ఆడియెన్స్ కి కొత్త కావడంతో బాగా ఆదరించారు. రెండు సినిమాలను పెద్ద హిట్ చేశారు. ఈ క్రమంలో మధ్యలో `జాక్` అంటూ మరో మూవీ చేశాడు సిద్ధు. కానీ ఇది ఆడియెన్స్ ని ఆకట్టుకోలేకపోయింది. ఇప్పుడు `తెలుసు కదా` చిత్రంతో రాబోతున్నాడు.
సిద్ధు జొన్నలగడ్డ హీరోగా రాశీఖన్నా, శ్రీనిధి శెట్టి హీరోయిన్లుగా నటించిన `తెలుసు కదా` మూవీకి లేడీ డైరెక్టర్ నీరజ కోన దర్శకత్వం వహించారు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వ ప్రసాద్, ఆమె కూతురు కలిసి నిర్మించారు. దీపావళి పండగ సీజన్‌ని పురస్కరించుకుని శుక్రవారం(అక్టోబర్ 17)న ఈ చిత్రం విడుదల కానుంది. ఈ క్రమంలో మూవీ ఎలా ఉండబోతుందనేది ఆసక్తికరంగా మారింది. సెన్సార్ రిపోర్ట్ కూడా వచ్చింది. అయితే ఇండస్ట్రీలో చూసిన కొందరి అభిప్రాయం ప్రకారం ఈ మూవీకి సంబంధించిన ఫస్ట్ రిపోర్ట్ వచ్చింది. మూవీ ఎలా ఉండబోతుందనేది తెలుస్తోంది.
`తెలుసు కదా` మూవీ ఇప్పటికే సెన్సార్ పూర్తి చేసుకుంది. యూ/ఏ సర్టిఫికేట్ పొందింది. సినిమా రెండు గంటల 16 నిమిషాల నిడివి ఉండబోతుందని సెన్సార్ బోర్డ్ తెలిపింది. నిడివి పరంగా డీసెంట్‌గానే ఉంది. ఇంకా చెప్పాలంటే ఇటీవల కాలంలో సుమారు మూడు గంటలు ఉంటున్న నేపథ్యంలో వాటితో పోల్చితే తక్కువే అని చెప్పొచ్చు. అయితే సినిమా ట్రయాంగిల్ లవ్ స్టోరీగా రూపొందిందని ట్రైలర్‌ని బట్టి అర్థమవుతుంది. హీరో సిద్ధు, హీరోయిన్లు రాశీఖన్నా, శ్రీనిధి శెట్టిల మధ్య లవ్ ట్రాక్‌ని బలంగా చూపించబోతున్నారట. సినిమా చాలా బోల్డ్ గా, రొమాంటిక్‌గా ఉంటుందని తెలుస్తోంది. రొమాంటిక్ కామెడీ ఇందులో హైలైట్‌గా ఉంటుందని, లవ్ ట్రాక్ విషయాలు చాలా కొత్తగా, ట్రెండీగా ఉండబోతున్నాయని సమాచారం.
ఈ నేపథ్యంలో కథ ఎలా ఉండబోతుందనేది ఆసక్తికరంగా మారింది. ఇందులో హీరో అమ్మాయిల విషయంలో రొమాంటిక్‌గా ఉంటాడని, తన వెంటపడేలా చేసుకుంటాడని, అలా రాశీని, శ్రీనిధిని ఒకేసారి ప్రేమిస్తాడట. ఇద్దరికీ ఈ విషయం తెలుస్తోంది. ఇద్దరితోనే ఒకేసారి రొమాన్స్ చేయడం ఇందులో హైలైట్‌గా, క్రేజీగా ఉంటుందట. ఏ ప్రేమైలో అయినా ఒక దశలో కాన్ల్ఫిక్ట్ స్టార్ట్ అవుతుంది. గొడవ అవుతుంది. బ్రేకప్‌ల వరకు వెళ్తాయి. అలా ఇందులోనూ గొడవ వల్ల వారి మధ్య గ్యాప్ వస్తుందని, మళ్లీ కొంత టైమ్ తర్వాత కలుస్తారని అప్పటి వరకు చోటు చేసుకున్న పరిణామాలే ఆసక్తికరంగా ఉంటాయని సమాచారం. అంతేకాదు ఫెర్టిలిటీ సెంటర్లకి సంబంధించిన అంశం కూడా ఇందులో చర్చించబోతున్నారట. చాలా సెన్సిటివ్ అంశాలను ఇందులో చూపించబోతున్నట్టు తెలుస్తోంది.
ట్రైలర్‌లో చూపించినంత బోల్డ్ గా సినిమా ఉండదని, అది కేవలం ట్రైలర్ కోసం కట్ చేసిన ఎలిమెంట్లు అని సమాచారం. ఏ క్లాస్ ఆడియెన్స్ కి కనెక్ట్ అయ్యేలా ఉంటుందని, చాలా కూల్‌గా సాగే మూవీ అని సమాచారం. అయితే మ్యూజిక్ సినిమాకి పెద్ద అసెట్ అవుతుందని, అదే ఎంగేజ్ చేస్తుందని, అది ఆడియెన్స్ ని ఎంగేజ్ చేసే స్థాయిని బట్టి మూవీ ఫలితం ఆధారపడి ఉంటుందని తెలుస్తోంది. సినిమాలో హీరో సిద్ధు జొన్నలగడ్డ ఇన్ వాల్వ్ అయ్యారు. ఆయన మార్క్ డైలాగ్‌లుంటాయట. అవి నవ్వులు పూయిస్తాయని సమాచారం. అవే సినిమాకి అసెట్‌గా నిలుస్తాయని అంటున్నారు. అయితే సినిమాలో కేవలం బోల్డ్ అంశాలే కాదు, ఎమోషనల్ అంశాలతో సాగుతుందట. అది మూవీకి మరో హైలైట్ పాయింట్ అని టాక్. ఈ ఎమోషన్స్, లవ్ ట్రాక్, సిద్ధు పాత్ర కనెక్ట్ అయ్యేదాన్ని బట్టి మూవీ ఫలితం ఆధారపడి ఉంటుందని చెప్పొచ్చు. మరి ఎంత వరకు ఆకట్టుకుంటుందో చూడాలి.