హైదరాబాద్‌లో 10 డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ ఉన్న కమెడియన్, అలీ వార్నింగ్ ఇచ్చినా వినకపోవడంతో ఇండస్ట్రీకి దూరం

Published : Oct 16, 2025, 12:30 PM IST

కమెడియన్ వేణు మాధవ్ ఇండస్ట్రీకి దూరం కావడానికి గల కారణాలని అలీ ఓ ఇంటర్వ్యూలో బయటపెట్టారు. వేణు మాధవ్ కి హైదరాబాద్ లో ఉన్న ఆస్తుల వివరాలు కూడా ఈ కథనంలో ఉన్నాయి. 

PREV
15
కమెడియన్ అలీ సినిమాలు 

కమెడియన్ అలీ వెయ్యికి పైగా సినిమాల్లో నటించారు. తన అనుభవంతో చాలా మంది నటీనటులకు అలీ సలహాలు ఇచ్చారు. అలీకి టాలీవుడ్ అగ్ర హీరోలతో పాటు బ్రహ్మానందం లాంటి కమెడియన్లతో కూడా మంచి రిలేషన్ ఉంది. అలీతో సన్నిహితంగా ఉండే కమెడియన్స్ లో వేణు మాధవ్ ఒకరు. వేణు మాధవ్ 2019లో అనారోగ్యంతో మరణించిన సంగతి తెలిసిందే. 

25
వేణు మాధవ్, అలీ బాండింగ్ 

వేణు మాధవ్ దాదాపు 700 చిత్రాల్లో నటించారు. అలీతో కలసి హీరోగా కూడా నటించారు. కెరీర్ మంచి జోరు మీద ఉన్న సమయంలో వేణు మాధవ్ సడెన్ గా ఇండస్ట్రీకి దూరమయ్యారు. వేణు మాధవ్ చేజేతులా చేసుకున్న కొన్ని తప్పిదాలు, పొగరు వల్లే ఇండస్ట్రీ అతడిని దూరం పెట్టింది అనే రూమర్స్ వచ్చాయి. అయితే వేణు మాధవ్ ఇండస్ట్రీకి దూరం కావడం వెనుక ఉన్న మరో కారణాన్ని అలీ  ఓ ఇంటర్వ్యూలో బయటపెట్టే ప్రయత్నం చేశారు. 

35
అలాంటి పాత్రలు చేయడం ఇష్టం లేకే ఇండస్ట్రీకి దూరం 

అలీతో సరదాగా ప్రోగ్రాంలో.. ఇండస్ట్రీకి సడెన్ గా ఎందుకు దూరమయ్యావు అని అలీ వేణు మాధవ్ ని ప్రశ్నించారు. నువ్వు ఇండస్ట్రీకి దూరమయ్యావా ? ఇండస్ట్రీ నిన్ను దూరం పెట్టిందా ? అని అడిగారు. వేణు మాధవ్ సమాధానం ఇస్తూ ఇండస్ట్రీ ఎప్పుడూ నన్ను దూరం పెట్టలేదు. ఇండస్ట్రీ నాకు చాలా మేలు చేసింది. కాకపోతే అసభ్యకరమైన డైలాగులు ఉన్న పాత్రలు చేయడం నాకు ఇష్టం లేదు. అందుకే తప్పుకున్నట్లు వేణు మాధవ్ తెలిపారు. 

45
వేణు మాధవ్ ప్రేమాభిషేకం మూవీ 

అలీ స్పందిస్తూ.. నువ్వు ఇండస్ట్రీ నుంచి తప్పుకోవడం వెనుక మరో కారణం కూడా ఉన్నట్లు వార్తలు వచ్చాయి. భూకైలాస్ తర్వాత మరో సినిమాలో నీకు హీరోగా అవకాశం వచ్చింది. ఒక నిర్మాత నీ దగ్గరకు వచ్చి 'ప్రేమాభిషేకం' అనే టైటిల్ తో సినిమా చేద్దామని చెప్పాడు. దానికి క్యాప్షన్ 'వీడికి క్యాన్సర్ లేదు'. ఆ నిర్మాత 70 శాతం వాటా అయితే నీది 30 శాతం వాటా. ఒకరోజు నువ్వు నా దగ్గరకి వచ్చి ఈ విధంగా ప్రేమాభిషేకం అనే సినిమా చేస్తున్నాను. అందులో నేను కూడా నిర్మాతని అని చెప్పావ్. నేను వెంటనే.. ప్రొడక్షన్ మనకెందుకు, హ్యాపీగా నటిస్తే చాలు కదా అని వార్నింగ్ ఇచ్చాను. అయినా నువ్వు వినలేదు.. లేదు అన్నా ఇందులో నాది 30 శాతం వాటా మాత్రమే. రిస్క్ లేదు అని చెప్పావ్. 

55
వేణు మాధవ్ ఆస్తులు ఇవే 

కానీ షూటింగ్ ప్రారంభమైన 4 రోజులకు ఆ ప్రొడ్యూసర్ చేతులెత్తేసి సినిమా నుంచి తప్పుకున్నాడు. దీనితో సినిమా నిర్మాణం భారం మొత్తం నీ మీద పడింది. ఆ మూవీ ని అక్కడితో ఆపేయకుండా నీ సొంత ఖర్చుతో పూర్తి చేశావ్. కానీ సినిమా బాగా ఆడలేదు. నీకు భారీగా నష్టం వచ్చింది. అందుకే ఇండస్ట్రీ నుంచి తప్పుకున్నావ్ కదా అని అలీ.. వేణు మాధవ్ ని ప్రశ్నించారు. వేణు మాధవ్ బదులిస్తూ నేను ఇండస్ట్రీ నుంచి తప్పుకోవడానికి, ప్రేమాభిషేకం చిత్రానికి సంబంధం లేదు. మరో విషయం ఏంటంటే ఆ సినిమాతో నాకు ఎలాంటి నష్టం రాలేదు అని వేణు మాధవ్ అన్నారు. ప్రేమాభిషేకం అనే టైటిల్ ని అక్కినేని నాగేశ్వర రావు, దాసరి నారాయణరావు ల అనుమతి తీసుకునే పెట్టినట్లు వేణు మాధవ్ తెలిపారు.  ప్రేమాభిషేకం సినిమా వల్ల నేను ఆస్తులు కోల్పోయాను అనేది అవాస్తవం. నాకు హైదరాబాద్ లో ఇప్పటికే 10 డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ ఉన్నాయి. అదే విధంగా 15 ఎకరాల పొలం ఉంది. ఇదంతా నా కష్టార్జితం.. నేను గర్వంగా చెప్పుకుంటాను. ఇప్పటికీ నేను వ్యవసాయం చేస్తున్నా అని ఆ ఇంటర్వ్యూలో వేణు మాధవ్ రివీల్ చేశారు. 

Read more Photos on
click me!

Recommended Stories