కెరీర్ మొత్తం అలాంటి సినిమాలు చేసి ఇప్పుడు నీతులు చెబుతున్న బాలయ్య హీరోయిన్.. సూపర్ హిట్ మూవీపై విమర్శలు

Published : Dec 13, 2025, 03:05 PM IST

రాధికా ఆప్టే తాజాగా సినిమాల్లో హింసపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆమె కామెంట్స్ వైరల్ అవుతుంది. అయితే నెటిజన్లు మాత్రమే రాధికాని తిరిగి విమర్శిస్తూ ట్రోల్ చేస్తున్నారు. 

PREV
15
హీరోయిన్ రాధికా ఆప్టే 

హీరోయిన్ రాధికా ఆప్టే పేరు చెప్పగానే ఆమె చుట్టూ గతంలో నెలకొన్న వివాదాలు గుర్తుకు వస్తాయి. బోల్డ్ స్టేట్మెంట్స్ తో రాధికా ఆప్టే నిత్యం వార్తల్లో ఉండడం చూస్తూనే ఉన్నాం. తెలుగులో కూడా రాధికా ఆప్టే కొన్ని సినిమాల్లో నటించింది. లెజెండ్, లయన్, రక్త చరిత్ర లాంటి సినిమాలతో రాధికా ఆప్టే తెలుగు ప్రేక్షకులకు సుపరిచయమే. అయితే ఇటీవల ఆమెకి సౌత్ లో పూర్తిగా అవకాశాలు తగ్గిపోయాయి. బాలీవుడ్ లో కూడా కొన్ని చిత్రాల్లో మాత్రమే నటిస్తోంది. 

25
వినోదం పేరుతో హింసని అమ్ముతున్నారు 

 రీసెంట్ గా రాధికా ఆప్టే సాలి మొహబ్బత్ అనే చిత్రంలో నటించింది. ఈ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా రాధికా ఆప్టే చేసిన వ్యాఖ్యలు అందరిని ఆశ్చర్యంలో ముంచేలా ఉన్నాయి. ఓ సినిమాని టార్గెట్ చేస్తూ రాధికా ఈ వ్యాఖ్యలు చేసింది. ఇప్పుడు సినిమాలలో ఎంటర్టైన్మెంట్ పేరుతో హింసని అమ్ముకుంటున్నారు అంటూ రాధికా విమర్శలు చేసింది. ఆమె మాట్లాడుతూ.. నేను నా చిన్నతనంలో ఇలాంటి భయంకర పరిస్థితుల మధ్య పెరగలేదు. ఈ వయలెన్స్ ట్రెండ్ చాలా డిస్ట్రబ్ చేసే విధంగా ఉంది అంటూ విమర్శలు చేసింది. 

35
ధురంధర్ పై పరోక్ష విమర్శలు 

రాధికా ఆప్టే పరోక్షంగా చేసిన ఈ వ్యాఖ్యలు లేటెస్ట్ బాలీవుడ్ సూపర్ హిట్ మూవీ ధురంధర్ గురించే అని అంతా భావిస్తున్నారు. రాధికా ఆప్టే చేసిన ఈ వ్యాఖ్యలు నెటిజన్లకు షాకింగ్ గా ఉన్నాయి. ఎందుకంటే రాధికా ఆప్టే తన కెరీర్ బిగినింగ్ లోనే ఎక్కువగా స్కిన్ షో, ఇంటిమేట్ సీన్లు ఎక్కువగా ఉన్న చిత్రాల్లో నటించింది. కొన్ని చిత్రాల్లో తీవ్ర వివాదం అయ్యేలా గ్లామర్ షో చేసింది. 

45
రాధికాపై నెటిజన్ల ట్రోలింగ్ 

అదే విధంగా ఆమె హింస ఎక్కువ ఉన్న చిత్రాల్లో కూడా నటించింది. ఇప్పుడు అవకాశాలు బాగా తగ్గిపోయాయి. కమర్షియల్ సినిమాల్లో ఛాన్సులు రావడం లేదు. అందుకే సెలెక్టివ్ గా కంటెంట్ బేస్డ్ సినిమాలు, సిరీస్ లు మాత్రమే చేస్తోంది. అలాంటి రాధికా ఆప్టే హింస ఉన్న సినిమాల గురించి మాట్లాడడం ఏంటి ? ఆమె కూడా అలాంటి సినిమాల్లోనే నటించింది కదా ? ఆమె చిన్నప్పుడు పరిస్థితులు యాక్షన్ మూవీస్ లో నటించేటప్పుడు గుర్తుకు రాలేదా అంటూ నెటిజన్లు దుమ్మెత్తి పోస్తున్నారు. 

55
రణ్వీర్ సింగ్ మూవీ 

బాలీవుడ్ లో చాలా మంది ధురంధర్ సక్సెస్ ని జీర్ణించుకోలేకపోతున్నారు అనే కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి. ధురంధర్ చిత్రం రణ్వీర్ సింగ్ ప్రధాన పాత్రలో తెరకెక్కింది. డైరెక్టర్ ఆదిత్య ధార్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. 

Read more Photos on
click me!

Recommended Stories