Rajamouli : రాజమౌళితో సినిమా అంటే ఎంత పెద్ద హీరో అయినా ఎగిరి గంతేయాల్సిందే. జక్కన్న ఆఫర్ ఇచ్చాడంటే అదృష్టంగా భావించే వారు చాలామంది ఉన్నారు. కానీ స్టార్ డైరెక్టర్ ఇచ్చిన ఆఫర్ ను రెండు సార్లు మిస్ అయిన అన్ లక్కీ హీరో ఎవరో తెలుసా?
ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో సంచలన దర్శకుడిగా ఎస్.ఎస్. రాజమౌళి కి పేరుంది. ముఖ్యంగా తెలుగు పరిశ్రమను హాలీవుడ్ రేంజ్ కు తీసుకెళ్లిన డైరెక్టర్ జక్కన్న. బాలీవుడ్, కోలీవుడ్ లాంటి పరిశ్రమలు తెలుగు ఇండస్ట్రీని చిన్న చూపు చూస్తున్న టైమ్ లో.. వారిని మించిన సినిమాలతో రాజమౌళి టాలీవుడ్ ను నిలబెట్టాడు. తెలుగు ఇండస్ట్రీకి మొదటి ఆస్కార్ ను సాధించిన ఘనత కూడా రాజమౌళి కే దక్కుతుంది. ‘బాహుబలి’ చిత్రంతో తెలుగు సినిమా సత్తాను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లి, పాన్ ఇండియా మార్కెట్‌కు డోర్లు తెరిచిన దర్శకుడు రాజమౌళి.
26
రాజమౌళి తో సినిమా అంటే పండగే..
రాజమౌళి తో సినిమా అంటే ఎంత పెద్ద స్టార్స్ అయినా.. అదృష్టంగా ఫీల్ అవుతుంటారు. జక్కన్నతో సినిమా చేయడం జీవిత కలగా భావించే నటీనటులు దేశ వ్యాప్తంగా ఉన్నారు. అలాంటి రాజమౌళి కెరీర్‌లో కీలక మలుపు తీసుకొచ్చిన రెండు సినిమాల గురించి ఓ ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది. ఎవరైనా రాజమౌళి సినిమాలో చిన్న అవకాశం వస్తే చాలు అనుకుంటారు. కానీ రాజమౌళి స్వయంగా ఆఫర్ ఇస్తే రెండు సార్లు రిజెక్ట్ చేసిన హీరో గురించి మీకు తెలుసా? ఆయన ఎవరో కాదు కోలీవుడ్ స్టార్ హీరో సూర్య. ఈ స్టార్ హీరోతో జక్కన్న చేయాలి అనుకున్న రెండు సినిమాలు ఏవో తెలుసా?
36
సూర్యతో మిస్ అయిన రాజమౌళి సినిమాలు
విశ్వసనీయ సమాచారం ప్రకారం, రవితేజ హీరోగా తెరకెక్కిన బ్లాక్‌బస్టర్ సినిమా విక్రమార్కుడు, అలాగే రామ్ చరణ్ హీరోగా రూపొందిన ఇండస్ట్రీ హిట్ ‘మగధీర’ కథలను ఎస్.ఎస్. రాజమౌళి ముందుగా తమిళ స్టార్ హీరో సూర్యకు వినిపించినట్లు తెలుస్తోంది. ఈ రెండు కథల్నీ సూర్యతోనే తెరకెక్కించాలని రాజమౌళి బలంగా అనుకున్నారట. కానీ ఎందుకో తెలియదు ఈ రెండు సినిమాల విషయంలో కొన్ని అడ్డంకులు ఎదురవ్వడంతో.. సూర్యతో సినిమా చేయలేకపోయాడట జక్కన్న. అప్పటి పరిస్థితులలో కొన్ని అనివార్య కారణాల వల్ల... ఈ రెండు సినిమాలకు తెలుగు హీరోలను తీసుకోవలసి వచ్చిందని సమాచారం.
కొన్ని పరిస్థుతుల కారణంగా తెలుగు హీరోలతో ఈ సినిమాలు చేయడమే సరైన నిర్ణయమని భావించిన రాజమౌళి, ఆ తర్వాత రవితేజతో ‘విక్రమార్కుడు’, రామ్ చరణ్‌తో ‘మగధీర’ సినిమాలను తెరకెక్కించారు. రిలీజ్ తరువాత ఈ సినిమాలు బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయ్యాయి. మగధీర అయితే ఇండస్ట్రీ హిట్ అయ్యింది. రామ్ చరణ్ కెరీర్ కు బ్రేక్ వచ్చింది. స్టార్ హీరోల సరసన నిలబెట్టింది. మరో వైపు రాజమౌళి స్థాయిని కూడా ఈ రెండు సినిమాలు మార్చేశాయి.
56
సూర్య రాజమౌళి సినిమాలు చేసి ఉంటే..?
ఒకవేళ ఈ రెండు సినిమాలు సూర్య చేసి ఉంటే, ఆయన కెరీర్ ఓ రేంజ్ లో ఉండేది. తమిళంతో పాటు తెలుగులో కూడా సూర్య స్టార్ హీరోగా వెలుగు వెలిగేవారు. ఈ విషయాన్నిసూర్య కూడా పలు సందర్భాల్లో పరోక్షంగా ప్రస్తావించారు. రాజమౌళి దర్శకత్వంలో ఒక చిన్న పాత్రలో అయినా నటించడానికి తాను సిద్ధంగా ఉన్నానని ఆయన అనేక ఇంటర్వ్యూల్లో వెల్లడించిన సంగతి తెలిసిందే.
66
మహేష్ బాబు సినిమాతో జక్కన్న బిజీ..
ప్రస్తుతం రాజమౌళి పాన్ వరల్డ్ సినిమా వారణాసితో బిజీగా ఉన్నాడు. ఈసినిమాతో ఇండియన్ ఫిల్మ్ హిస్టరీలో సరికొత్త రికార్డులను క్రియేట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు. టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు, గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా కాంబినేషన్ లో, భారీ అడ్వెంచర్ మూవీగా వారణాసి తెరకెక్కుతోంది. పృథ్వీరాజ్ సుకుమార్ కీలక పాత్రలో నటిస్తోన్న ఈసినిమాకు ఆస్కార్ విన్నర్ కీరవాణి మ్యూజిక్ అందిస్తున్నారు. 2027 సమ్మర్ లో వారణాసి రిలీజ్ చేయాలని ప్రయత్నాలు చేస్తున్నారు. ఈసినిమాతో రాజమౌళి రేంజ్ ఎక్కడికి వెళ్తుందో చూడాలి.