ఈరోజు ఎపిసోడ్ లో మాధవ(madhava) ట్రోపిని తీసుకొని ఇంట్లోకి వెళ్లడంతో రామ్మూర్తి దంపతులు అది చూసి సంతోష పడుతూ ఉంటారు. దేవి గెలిచింది అని ఆనందపడుతూ ఉంటారు. అప్పుడు దేవి, రాధ వాళ్ళు ఎక్కడ ఉన్నారు అని అడగగా వాళ్ళు కొంచెం షాక్ లో ఉన్నారు అని అంటాడు మాధవ. మరొకవైపు దేవుడమ్మ,దేవి(devi) రాకపోవడంతో ఆదిత్యను ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తూ వేస్తూ ఉండగా ఆదిత్య మాత్రం ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉంటాడు.