Guppedantha Manasu: మళ్లీ వసుధారకు రోజ్ ఇచ్చిన రిషీ.. రొమాంటిక్ సీన్ అదిరిపోయిందిగా!

Published : Jul 21, 2022, 09:57 AM IST

Guppedantha Manasu: బుల్లితెరపై ప్రసారమవుతున్న గుప్పెడంత మనసు (Guppedantha Manasu) సీరియల్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. పైగా మంచి ప్రేమ కథతో కొనసాగుతుంది. ఇక ఈరోజు జులై 21 వ తేదీ ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం.  

PREV
16
Guppedantha Manasu: మళ్లీ వసుధారకు రోజ్ ఇచ్చిన రిషీ.. రొమాంటిక్ సీన్ అదిరిపోయిందిగా!

ఈరోజు ఎపిసోడ్ లో గౌతమ్(gautham)అసలు కిచెన్ లో ఏమి వస్తువులు లేవు వసు 15,20 నిమిషాల పాటు పోరాడింది కానీ ఏమి చేయలేకపోయింది అనడంతో సాక్షి, వసు పరువు పోతుంది అని ఆనందపడుతూ ఉంటుంది. అప్పుడు సాక్షి (sakshi)నేను చెప్పాను కదా రిషి ఆర్డర్ పెట్టింటే ఈపాటికి వచ్చేది అని అంటుంది. ఇంతలోనే వసు అక్కడికి డల్ గా వస్తుంది. అప్పుడు సాక్షి అందరి ముందు వసు ని అవమానించే విధంగా మాట్లాడుతూ ఉంటుంది.
 

26

అప్పుడు గౌతమ్, వసు(vasu)ఇద్దరు ఒకరిపై ఒకరు చూసుకుని నవ్వుతూ ఉంటారు. తర్వాత గౌతమ్, వసు వంటలు చేసిన విధానాన్ని గొప్పగా చెప్పడంతో సాక్షి షాక్ అవుతుంది. అప్పుడు అందరూ వసు చేసిన పనికి సంతోషపడుతూ ఉంటారు. అప్పుడు రిషి(rishi),వసు ని పొగుడుతాడు. ఆ తర్వాత అందరూ కూర్చుని భోజనం చేస్తూ ఉంటారు. అప్పుడు అందరు వసు చేసిన భోజనాలు తిని పొగుడుతూ ఉండగా సాక్షి కోపంతో రగిలిపోతూ ఉంటుంది.
 

36

 అప్పుడు సాక్షి(sakshi)కావాలనే వసు చేసిన చేసిన వంటలను తప్పు పట్టే ప్రయత్నం చేయగా వెంటనే రిషి సాక్షికి తగిన విధంగా కౌంటర్ ఇస్తాడు. అప్పుడు వసు, రిషి పక్కపక్కనే కూర్చొని తింటూ ఉండటం చూసి సాక్షి కోపంతో రగిలిపోతూ ఉంటుంది. ఆ తరువాత రిషి, వసు ని కారులో ఎక్కించుకొని వెళ్తూ ఉంటాడు. అప్పుడు వసు(vasu), సార్ సాక్షి మీద మీ అభిప్రాయం ఏంటి అని అడగగా అప్పుడు రిషి తన మీద నాకేమీ అభిప్రాయం ఉంటుంది అని అనగా వెంటనే వసు తన చెప్పిన వాటన్నింటికీ మీరు ఓకే అంటున్నారు కదా సార్ అని అంటుంది.
 

46

 అప్పుడు సాక్షి(sakshi)పిలిస్తే సినిమాకు వెళ్తారు,డిన్నర్ కి వెళ్తారు అని వసు ఫీల్ అవుతూ ఉంటుంది. అవును డిన్నర్ కి వెళ్ళినా అక్కడ నువ్వే కదా వంట చేసింది నీ ప్రాబ్లం ఏంటి చెప్పు అని అడుగుతాడు రిషి. అప్పుడు వసు లైబ్రరీని జరిగిన విషయాలు అన్నింటి గురించి విషయంలో ప్రశ్నిస్తుంది. అప్పుడు రిషి(rishi), నా సంగతి పక్కన పెట్టు అని చెప్పి ల్యాబ్ లో వసు మాట్లాడిన మాటలు నా మెడలో ఎందుకు వేశావు అని ప్రశ్నిస్తాడు రిషి.
 

56

 అప్పుడు వసు(vasu)తన మనసులో చెప్పబోతూ ఉండగా నన్ను నువ్వు గౌరవిస్తున్నాను అంటావు అంతే కదా వసు అని రిషి తప్పుగా అర్థం చేసుకుంటాడు. తర్వాత రిషి మాటలకు వసుధార మౌనంగా ఉంటుంది. అప్పుడు రిషి నేను చెప్పే విషయాలను నువ్వు కాదు అనకు నేను నమ్మను అని అంటాడు. అప్పుడు రిషి(rishi) సాక్షి గురించి ఎక్కువ ఆలోచించొద్దు అని అంటాడు. ఆ తరువాత వసు చేసిన వంటల గురించి పొగుడుతాడు.
 

66

 ఆ తరువాత స్టూడెంట్స్ అందరూ నోటీసు బోర్డులో వేసిన చదువుల పండుగ గురించి చదువి అక్కడినుంచి వెళ్ళిపోతారు. ఆ తర్వాత పుష్ప(pushpa),వసు ఇద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంతలోనే గౌతం అక్కడికి వచ్చి వసు పొగుడుతూ ఉంటాడు. ఆ తర్వాత వసు గౌతమ్ (Gautham)కి పని చెప్పి అక్కడ నుంచి పంపింస్తుంది. ఆ తర్వాత వసు నేను టీం అసిస్టెంట్ గా పనికిరానా అని అనగా ఇంతలోనే రిషి అక్కడికి వస్తాడు. అది గమనించని వసు పుష్పతో రిషి గురించి మాట్లాడుతూ ఉంటుంది. అప్పుడు రిషి చదువుల పండుగ గురించి ఒకదానికి ఎక్స్ప్లెయిన్ చేసి ఆ తర్వాత పువ్వు ఇస్తాడు. అది చూసి వసుధార సంతోష పడుతూ ఉంటుంది.

click me!

Recommended Stories