Devatha: సత్యకు పిల్లలు పుట్టే అవకాశం.. ఆదిత్యకు మళ్లీ దూరం కానున్న రుక్మిణి?

Published : Jun 25, 2022, 10:43 AM IST

Devatha: బుల్లితెరపై ప్రసారమవుతున్న దేవత (Devatha) సీరియల్ కుటుంబ కథా నేపథ్యంలో కొనసాగుతూ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. ఇక ఈ రోజు జూన్ 25 వ ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం.  

PREV
16
Devatha: సత్యకు పిల్లలు పుట్టే అవకాశం.. ఆదిత్యకు మళ్లీ దూరం కానున్న రుక్మిణి?

 ఈరోజు ఎపిసోడ్ లో సత్య (sathya)పూజారి ఇంటికి పిలిపించుకుని అప్పుడు దేవుడమ్మ ఎందుకు పూజారిని పిలిపించావు అని అడగడంతో వెంటనే సత్య మీరు ఉపవాసం ఉంటున్నారు కదా ఆంటీ ఉపవాసం కాకుండా మరేదైనా మార్గం ఉంటుందేమో అని పిలిచాను అని అంటుంది సత్య. అప్పుడు దేవుడమ్మ(devudamma)నా ఆరోగ్యం బాగానే ఉంది నాకు ఏమీ జరగదు అని అనగా అప్పుడు పూజారి మరొక మార్గం కూడా ఉంది పిండివంటలు, చీరలను మీ కోడలు వయస్సున్న వారికి వాయనంగా ఇస్తే మంచి జరుగుతుంది అని అనడంతో అందుకు దేవుడమ్మ సంతోష పడుతూ ఉంటుంది.
 

26

మరొక వైపు రాధ (radha)వంటగదిలో పని చేస్తూ ఉండగా ఇంతలో మాధవ అక్కడికి వచ్చి తాగడానికి మంచినీరు ఇవ్వమని అడగడంతో అప్పుడు రాధామాధవ తో మాట్లాడడానికి ఇష్టపడదు. కానీ మాధవ మాత్రం రాధ తో ఏదో ఒకటి మాట్లాడే ప్రయత్నం చేస్తూ ఉండగా ఇంతలోనే రాధకు ఆదిత్య ఫోన్ చేయడంతో కావాలనే రాధ ఆ ఫోన్ లిఫ్ట్ చేయకుండా మాధవ(madhavalతో ఫోన్ లిఫ్ట్ చేయించాని అని చివరికి ఫోన్ మాధవ ఫోన్ లిఫ్ట్ చేసే విధంగా చేస్తుంది. అప్పుడు మాధవ కోపంతో అక్కడనుంచి వెళ్ళి పోతాడు.
 

36

 అప్పుడు రాధ ఆదిత్య(adithya)తో ఫోన్లో మాట్లాడుతూ ఉంటుంది. అప్పుడు ఆదిత్య తన తల్లి దేవుడమ్మ ఉపవాసం మానేసిందని చెబుతూ ఇంట్లో జరిగిన విషయం చెప్పడంతో రాధ సంతోష పడుతూ ఉంటుంది. అప్పుడు రాదా ఎలా అయినా దేవుడమ్మను చూడాలి అని గుడికి బయలుదేరుతుంది. ఒక గుడిలో దేవుడమ్మ కుటుంబాన్ని చూసిన రాధ(radha) సంతోష పడుతూ ఉంటుంది.
 

46

తనకోసం దేవుడమ్మ (devudamma)ఉపవాసాలు వాయినాలు ఇస్తుండడంతో అది చూసి రాధ  ఎమోషనల్ అవుతుంది. ఆ తర్వాత దేవుడమ్మ కుటుంబం అమ్మవారికి ప్రదక్షిణలు చేసి అనంతరం పూజల్లో పాల్గొంటారు. ఆ తరువాత పూజారి చెప్పిన విధంగా దేవుడమ్మా అందరికీ వాయినాలు ఇస్తూ ఉంటుంది. ఇక అక్కడికి వచ్చిన ముత్తైదువులకు ఒక్కొక్కరు దేవుడమ్మ చేత్తో వాయినాలను తీసుకుంటూ ఉంటారు.
 

56

చివరగా ఒక్క వాయనం మిగలడం తో దూరంలో వెనుక వైపు నుంచి రుక్మిణి (rukmini)చూస్తూ రుక్మిణి దగ్గరికి వెళుతుంది. తీరా దేవుడమ్మ రుక్మిణి దగ్గరకు వెళ్లగా అప్పుడే కమల(kamala)కు కళ్ళు తిరగడంతో వెంటనే అక్కడికి వెళ్లి పోతుంది. అప్పుడు అది చూసిన రుక్మిని పక్కకు వెళ్లి దాక్కుంటుంది. ఇక దేవుడమ్మ కుటుంబం ఇంటికి వెళ్ళాలి అనుకోగా చివరి వాయనం ఒకటి మిగిలిపోతుంది.
 

66

ఆ వాయనం ఎవరికైనా ఇచ్చి వెళ్ళాలి అని అనుకుంటూ ఉండగా ఆ సమయంలో ఎవరూ లేకపోవడంతో ఆ పూజారి ఆ వాయనం అమ్మవారి చేతిలో పెడతాను ఆమె ఎవరికి దక్కుతుందో వాళ్ళకే చేరుతుంది అని అనడంతో దేవుడమ్మ(devudamma) పూజారి చెప్పిన విధంగా అమ్మవారికి వాయనం ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అప్పుడు రాధ (radha) కూడా ఇంటికి వెళుతూ ఉండగా ఆ పూజారి రాధ ని పిలిచి అమ్మవారికి ఇచ్చిన ఆ వాయనం రాధకు ఇస్తాడు. అప్పుడు రాధ సంతోషపడుతూ ఉంటుంది. ఆ తర్వాత సత్య అమెరికా లో పిల్లలు పుట్టే ట్రీట్మెంట్ వుంది అని చెప్పడంతో అందరూ సంతోష పడతారు.

click me!

Recommended Stories