సినిమా హాళ్లలో మద్యం అమ్మకాలు, మందు బాబులకు త్వరలో డబుల్ ధమాకా

Published : Apr 09, 2025, 11:32 AM ISTUpdated : Apr 10, 2025, 11:09 AM IST

మందు బాబులకు  గుడ్ న్యూస్, త్వరలో  సినిమా హాళ్లలో మద్యం అమ్మకాలు స్టార్ట్ అయ్యే  పరిస్థితి రాబోతోంది. అందుకోసం పర్మీషన్ కూడా అడిగినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ విషయం వివాదం అవుతోంది. మరి థియేటర్లలో మధ్యం అమ్మకాలకు అనుమతి వస్తుందా? అసలు విషయం ఏంటి? 

PREV
14
సినిమా హాళ్లలో మద్యం అమ్మకాలు, మందు బాబులకు త్వరలో డబుల్ ధమాకా

PVR INOX Seeks Liquor License : కొత్త సినిమాలు చూడాలంటే థియేటర్లకు వెళ్లాల్సిన పరిస్థితి గతంలో ఉండేది. కానీ ఇప్పుడు ఇంట్లో కూర్చొని ఓటీటీలో కొత్త సినిమాలు చూసేయొచ్చు. థియేటర్లో విడుదలైన నెల రోజులకే సినిమాలు ఓటీటీకి వచ్చేస్తున్నాయి. దీంతో థియేటర్లకు వెళ్లే వారి సంఖ్య కూడా బాగా తగ్గిపోయింది. కొన్ని సినిమాలు డైరెక్ట్‌గా ఓటీటీలోనే విడుదల చేస్తున్నారు.

Also Read: గ్రాఫిక్స్ కే 250 కోట్లు, అల్లు అర్జున్, అట్లీ మూవీ కోసం కళ్ళు తిరిగే బడ్జెట్, ఎంతో తెలుసా?

24
థియేటర్

దాంతో థియేటర్లు ఒక్కొక్కటిగా మూతపడే దుస్థితి వస్తోంది. మల్టీప్లెక్స్‌లు రావడంతో సింగిల్ స్క్రీన్ థియేటర్లు క్రమంగా కనుమరుగవుతున్నాయి. ప్రస్తుత కాలంలో ప్రజలు మల్టీప్లెక్స్ థియేటర్లలోనే సినిమాలు చూస్తున్నారు. ఆడియన్స్ ను  పెంచేందుకు మల్టీప్లెక్స్ సంస్థలు రకరకాల చర్యలు తీసుకుంటున్నాయి. ఆఈక్రమంలోనే  పీవీఆర్ ఐనాక్స్ సంస్థ తాజాగా ప్రభుత్వానికి పెట్టిన  ఓ పిటీషన్ హాట్ టాపిక్ అయ్యింది. వివాదానికి దారి తీసింది. 

Also Read: బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 లోకి అలేఖ్య చిట్టి, ముగ్గురు సిస్టర్స్ లో ఎవరికి అవకాశం?

 

34
పీవీఆర్ ఐనాక్స్

అదేమిటంటే బెంగళూరు, గుర్గావ్‌లోని పీవీఆర్ ఐనాక్స్ థియేటర్లలో మద్యం అమ్మేందుకు అనుమతి కావాలని ప్రభుత్వాన్ని వారు కోరారు. ఆదాయం పెంచేందుకూ, అభిమానులకు అద్భుతమైన  ప్రీమియర్ అనుభూతిని అందించేందుకూ ఇలాంటి పథకాలు కావాలని, అందుకే ఇలాంటి కొత్త ఐడియాలు ప్రవేశపెట్టేందుకు ముందుకొచ్చామని ఆ సంస్థ తెలిపింది. మొదట్లో కొన్ని థియేటర్లలో మాత్రమే దీన్ని అమలు చేయడానికి అనుమతి కోరారు. ఇది సోషల్ మీడియాలో పెద్ద దుమారాన్ని రేపింది. 

Also Read: ఎన్టీఆర్ దెబ్బకు జ్వరం తో మంచం ఎక్కిన హీరోయిన్? 3రోజులు ఒళ్ళు నొప్పులతో ఇబ్బంది పడ్డ నటి ఎవరు?

44
సినిమా థియేటర్

ఇప్పటివరకు మద్యం తాగిన వాళ్లకు థియేటర్లలోకి అనుమతి లేదు. కానీ ఈ పథకం అమలైతే థియేటర్లు మద్యం దుకాణాలుగా మారిపోతాయని నెటిజన్లు విమర్శిస్తున్నారు. ఇలా థియేటర్లలోనే మద్యం అమ్మితే థియేటర్లలో మహిళలకు రక్షణ ఎలా ఉంటుంది. అని కొందరు అంటున్నారు. దీనికి అనుమతి ఇవ్వకూడదని వ్యతిరేక గళాలు వినిపిస్తున్నాయి. మరి ఈ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి. 

Also Read: కమల్ హాసన్ లేడీ వాయిస్‌తో పాడిన పాటలు ఎన్ని ఉన్నాయో తెలుసా? అందులో హిట్ సాంగ్స్ ఇవే?

Also Read:సినిమాలతో పాటు కోట్లలో వ్యాపారం, అల్లు అర్జున్ ఆస్తి ఎన్ని కోట్లు, ఏం బిజినెస్ లు చేస్తున్నారు?

Read more Photos on
click me!

Recommended Stories