ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ మంగళవారం రోజు సింగపూర్ లో అగ్ని ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. మార్క్ శంకర్ చదువుకుంటున్న స్కూల్ లో అగ్నిప్రమాదం జరిగింది. మార్క్ శంకర్ తీవ్రంగా గాయపడడంతో అతడి క్షేమం, హెల్త్ అప్డేట్ కోసం ఫ్యాన్స్ అంతా ఎదురుచూస్తున్నారు.
14
Chiranjeevi, Mark Shankar
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ మంగళవారం రోజు సింగపూర్ లో అగ్ని ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. మార్క్ శంకర్ చదువుకుంటున్న స్కూల్ లో అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఒక చిన్న మరణించడం తో పాటు 15 మంది గాయపడ్డారు. గాయపడ్డ వారిలో మార్క్ శంకర్ కూడా ఉన్నాడు. మార్క్ శంకర్ కాళ్ళు చేతులకు బాగా గాయాలైనట్లు తెలుస్తోంది.
24
పక్కనే ఉన్న భవన నిర్మాణ కార్మికులు వెంటనే స్పందించి చిన్నారులకి రక్షించడంతో ప్రమాద తీవ్రత తగ్గింది అని పవన్ ప్రెస్ మీట్ లో తెలిపారు. అల్లూరి సీతారామరాజు జిల్లా గిరిజన ప్రాంతాల్లో పర్యటన ముగించుకుని పవన్ సింగపూర్ వెళ్లారు. ప్రస్తుతం మార్క్ శంకర్ ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఊపిరి తిత్తుల్లోకి పొగ వెళ్లడం వల్ల దీర్ఘకాలంలో ఎలాంటి సమస్యలు ఉంటాయి అనేది తెలియాల్సి ఉంది.
మార్క్ శంకర్ హెల్త్ విషయంలో సింగపూర్ నుంచి తాజా అప్డేట్ అందింది. హైదరాబాద్ నుంచి సింగపూర్ వెళ్ళిన శ్రీ పవన్ కల్యాణ్ గారు నేరుగా ఆసుపత్రికి చేరుకున్నారు. మార్క్ ను చూశారు. చేతులు, కాళ్ళకు కాలిన గాయాలు కావడంతోపాటు ఊపిరితిత్తులకు పొగ చూరడంతో అత్యవసర వార్డులో చికిత్స అందిస్తున్నారు. అక్కడి వైద్యులు, అధికారులతో మాట్లాడారు. మార్క్ కోలుకొంటున్నాడని, ఊపిరితిత్తుల దగ్గర పొగ పట్టేయడం మూలంగా తలెత్తే ఆరోగ్యపరమైన ఇబ్బందులపై పరీక్షలు చేస్తున్నామని తెలియచేశారు.
భారత కాలమాన ప్రకారం బుధవారం ఉదయం అత్యవసర వార్డు నుంచి గదికి తీసుకువచ్చారు. మరో మూడు రోజులపాటు వైద్యుల పర్యవేక్షణలో పరీక్షలు చేయాల్సి ఉంటుందని ఆసుపత్రి వైద్యులు తెలియచేశారు.
34
మార్క్ శంకర్ ని చూసేందుకు మెగా కుటుంబ సభ్యులు సింగపూర్ బయలు దేరారు. ముందుగా మెగాస్టార్ చిరంజీవి, సురేఖ దంపతులు సింగపూర్ వెళ్లారు. నాగబాబు గురించి తెలియాల్సి ఉంది. ఇతర కుటుంబ సభ్యులు ఎవరెవరు వెళుతారు అనేది త్వరలో తెలియనుంది. చిరంజీవి, సురేఖ లతో పవన్ కళ్యాణ్ ఎంతో ఆత్మీయంగా ఉంటారు. వీరిద్దరినీ తాను తల్లిదండ్రులుగా భావిస్తానని పవన్ పలుమార్లు చెప్పిన సంగతి తెలిసిందే. ఈ కష్ట సమయంలో తమ్ముడికి అండగా ఉండేందుకు చిరంజీవి సురేఖ తో కలసి సింగపూర్ వెళ్లారు.
Related Articles
44
పవన్ కళ్యాణ్, అన్నా లెజినోవా దంపతులు 2013లో వివాహం చేసుకున్నారు. వీరికి కుమార్తె పోలేనా అంజనా, కొడుకు మార్క్ శంకర్ జన్మించారు. అన్నా లెజినోవా సింగపూర్ లో పిల్లలని చదివిస్తూ అక్కడ వ్యాపారాలు చూసుకుంటున్నారు.