దమ్ముంటే పట్టుకోరా షెకావత్, బన్నీకి తెలియకుండానే పుండుమీద కారం చల్లారా.. దేవిశ్రీ రియాక్షన్ ఇదే  

First Published | Dec 26, 2024, 10:12 AM IST

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప 2 చిత్రంతో ఇండియన్ సినిమా రికార్డులని బ్రేక్ చేస్తున్నాడు. పుష్ప 2 దేశం మొత్తం ఆశ్చర్యపోయే గ్రాండ్ సక్సెస్ అయింది. కానీ ఇదంతా మరుగున పడిపోయింది.

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప 2 చిత్రంతో ఇండియన్ సినిమా రికార్డులని బ్రేక్ చేస్తున్నాడు. పుష్ప 2 దేశం మొత్తం ఆశ్చర్యపోయే గ్రాండ్ సక్సెస్ అయింది. కానీ ఇదంతా మరుగున పడిపోయింది. సంధ్య థియేటర్ సంఘటనతో అల్లు అర్జున్ తీవ్ర ఇబ్బందుల్లో చిక్కుకున్న సంగతి తెలిసిందే. అరెస్ట్ అయి బెయిల్ పై విడుదలయ్యారు. రీసెంట్ గా అల్లు అర్జున్ పోలీసుల విచారణకి కూడా హాజరయ్యారు. 

సంధ్య థియేటర్ తొక్కిసలాట సంఘటనలో రేవతి అనే మహిళ మరణించింది. ఆమె కుమారుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. దీనితో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహా తెలంగాణ ప్రభుత్వం ఈ సంఘటనని సీరియస్ గా తీసుకుంది. అసెంబ్లీలో సైతం చర్చ జరిగింది. రేవతి కుటుంబాన్ని ఆదుకునేందుకు చిత్ర పరిశ్రమ ముందుకు వస్తోంది. 


అల్లు అర్జున్ పోలీసు కేసులు, కోర్టు నిబంధనలు, మరోవైపు ప్రభుత్వం నుంచి వస్తున్న విమర్శలతో ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. అల్లు అర్జున్ తన కెరీర్ లో చాలా టఫ్ టైం ఫేస్ చేస్తున్నాడు. ఇలాంటి తరుణంలో పుష్ప 2 చిత్రం నుంచి ఊహించని సాంగ్ రిలీజ్ కావడం అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఆ సాంగ్ హీరోయిన్ డ్యూయెట్ సాంగ్ అయితే ఇంత చర్చ జరిగేది కాదు. పుష్ప 2 చిత్రంలో పోలీస్ అధికారి షెకావత్ కి వార్నింగ్ ఇచ్చే పాట అది. 

దమ్ముంటే పట్టుకోరా షెకావత్.. పట్టుకుంటే వదిలేస్తా సిండికేట్ అంటూ హీరో పోలీస్ కి వార్నింగ్ ఇచ్చే పాటని యూట్యూబ్ లో రిలీజ్ చేశారు. ప్రస్తుతం అల్లు అర్జున్ ఉన్న పరిస్థితి కాస్త సింక్ అయ్యే పాట అది. దీనితో నెటిజన్లు ఈ పాట గురించి ఎవరికి తోచినట్లు వారు ఊహించుకుంటూ పోస్ట్ లు పెట్టేస్తున్నారు. ప్రస్తుత వివాదానికి ఈ పాట పుండుమీద కారం చల్లినట్లుగా ఉంది అంటూ పోస్ట్ లు పెడుతున్నారు. పాట రిలీజ్ వెనుక ఎలాంటి ఉద్దేశం లేకపోవచ్చు.. కానీ నెటిజన్లు ఊహించుకునేలా అవకాశం ఇచ్చింది మాత్రం పుష్ప 2 చిత్ర యూనిట్ అనే చెప్పాలి. 

సోషల్ మీడియాలో ఒక్కసారిగా ఈ సాంగ్ గురించి చర్చ పెరిగింది. పోలీసులకు, ప్రభుత్వానికి కౌంటర్ గా ఈ పాటని తీసుకువచ్చారు అంటూ నెగిటివ్ ప్రచారం జరిగింది. డ్యామేజ్ ని గ్రహించారో ఏమో కానీ వెంటనే సాంగ్ ని యూట్యూబ్ నుంచి తొలగించారు. ఈ సాంగ్ పై సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ స్పందించారు. అల్లు అర్జున్ కి తెలియకుండానే ఈ సాంగ్ కి రికార్డ్ చేసినట్లు దేవిశ్రీ ప్రసాద్ తెలిపారు. 

Also Read: వాళ్లిద్దరూ రాంచరణ్ హీరోయిన్లే, పెళ్ళైన వారితో అందరి ముందు అసభ్యంగా.. క్రేజీ హీరో బిహేవియర్ పై రచ్చ

షెకావత్ కి వార్నింగ్ ఇచ్చే సన్నివేశాన్ని సుకుమార్ నాకు వివరించినప్పుడు దీనిని పాటగా మార్చాలని అనుకున్నా. అల్లు అర్జున్ తో ఈ పాటని రికార్డ్ చేయాలని అనుకున్నా. సుకుమార్ కి ఐడియా చెబితే ఓకె అన్నారు. సుకుమార్ బన్నీని స్టూడియోకి తీసుకువచ్చారు. బన్నీ చేత వార్నింగ్ ఇచ్చే డైలాగులు చెప్పించాం. దానికి మ్యూజిక్ యాడ్ చేసి సాంగ్ లాగా మార్చినట్లు దేవిశ్రీ తెలిపారు. ఇదంతా అల్లు అర్జున్ కి తెలియకుండా జరిగింది అని అన్నారు. 

Latest Videos

click me!