క్రిస్టొఫర్ నొలన్ ఫ్యాన్స్ పండగ చేసుకునే న్యూస్, కొత్త చిత్రం ప్రకటన

First Published | Dec 26, 2024, 9:02 AM IST

క్రిస్టోఫర్ నోలన్ తన తదుపరి చిత్రం 'ది ఒడిస్సీ'ని 2026లో విడుదల చేయనున్నారు. ఈ చిత్రం హోమర్ యొక్క పురాతన గ్రీకు పురాణ కవిత ఆధారంగా రూపొందుతోంది.

Christopher Nolan, Homer, The Odyssey


తన కాన్సెప్ట్ లతో ప్రపంచాన్ని ఉలిక్కిపడేలా చేసిన  స్టార్ డైరక్టర్స్ లో ఒకరు  క్రిస్టోఫర్ నోలన్. నోలన్ సినిమాలన్నీ బాక్సాఫీస్ దగ్గర సెన్సేషన్ సక్సెస్ ని అందుకుంటున్నాయి. రీసెంట్ గా ఆయన తెరకెక్కించిన ‘ఓపెన్ హైమర్’ని బోర్ కొడుతోంది అంటూనే పెద్ద హిట్ చేసారు. 2023లో విడుదలైన ‘ఓపెన్ హైమర్’ సినిమా ‘బార్బీ’ సినిమాతో బాక్సాఫీస్ దగ్గర పోటీ పడింది.

అయితే, ‘బార్బీ’ సినిమా నోలన్ మూవీ ముందు నిలబడలేకపోయింది.  ప్రతిష్టాత్మక ఆస్కార్‌ అవార్డుల్లో   'ఓపెన్ హైమర్' సినిమా మెరిసింది. ఉత్తమ నటుడు, దర్శకుడు, చిత్రం, సహాయ నటుడు, ఒరిజినల్ స్కోర్, ఫిల్మ్ ఎడిటింగ్, సినిమాటోగ్రఫీ.. ఇలా ప్రధాన విభాగాల్లో పురస్కారాలు కైవసం చేసుకుంది. ఆ స్దాయి డైరక్టర్ ...నెక్ట్స్ ఏ ప్రాజెక్టు చేయబోతున్నారు, టైటిల్ ఏమిటనేది ఆసక్తికరమైన విషయం.

Christopher Nolan


ప్రపంచ వ్యాప్తంగా అంతులేని అభిమానులు ను సొంతం చేసుకున్న  అరుదైన సినిమా డైరక్టర్స్ లో ఒకరు క్రిస్టోఫర్ నోలన్ (Christopher Nolan). నోలన్ కు మన దేశంలో కూడా  చాలా మంది అభిమానులు ఉన్నారు. ఆయన తీసిన 'బ్యాట్ మ్యాన్ బిగిన్స్', 'ది డార్క్ నైట్', 'ది డార్క్ నైట్ రైజెస్', 'డంకర్క్' చిత్రాలకు ఇక్కడ మంచి ఓపినింగ్స్ వచ్చాయి. అదిరిపోయే రివ్యూలు వచ్చాయి. ఇక్కడ  కూడా బ్లాక్ బస్టర్స్ అయ్యాయి.  


Best Director: Christopher Nolan for 'Oppenheimer'.


ఇప్పుడు   'ఓపెన్ హైమర్' చిత్రం తర్వాత  క్రిస్టోఫర్ నోలన్ చేయబోయే చిత్రం టైటిల్ బయిటకు వచ్చింది. కొంత కాలంగా నోలన్ తదుపరి చిత్రంపై ర‌క‌ర‌కాల వార్తలు, ఊహాగానాలు సాగుతున్నాయి. ఆఖరికి యూనివర్సల్ పిక్చర్స్ X ఖాతాలో అధికారిక ప్రకటన చేసింది.

నోలన్ నెక్ట్స్  'ది ఒడిస్సీ' అనే చిత్రాన్ని తెర‌కెక్కిస్తారని ప్రకటించింది.  ఈ చిత్రం సరికొత్త IMAX ఫిల్మ్ టెక్నాలజీని ఉపయోగించి ప్రపంచవ్యాప్తంగా ప‌లు దేశాల్లో షూట్ చేస్తారు. ఈ చిత్రంలో టామ్ హాలండ్ , మాట్ డామన్ నటించనున్నారు. అన్నే హాత్వే, జెండయా, లుపిటా న్యోంగో, రాబర్ట్ ప్యాటిన్సన్ , చార్లిజ్ థెరాన్ కూడా కీలక పాత్రల్లో నటిస్తార‌ని స‌మాచారం.

christopher Nolan


 క్రిస్టోఫర్ నోలన్ ,  అతని భార్య ఎమ్మా థామస్‌ల  కలిసి స్క్రిప్టు రాసి నిర్మించనున్నారు.  2025 ప్రథమార్థంలో ఈ చిత్రం నిర్మాణం ప్రారంభమవుతుంది. టైటిల్ లో  సూచించినట్లుగా, ది ఒడిస్సీ అనేది హోమర్ యొక్క పురాతన గ్రీకు పురాణ కవిత ది ఒడిస్సీపై ఆధారపడి తయారు చేసిన కథ ఇది.   ఇది గ్రీకు వీరుడు ఒడిస్సియస్ ట్రోజన్ యుద్ధం తరువాత ఇంటికి వెళ్ళే సమయంలో అతని కథను వివరిస్తుంది.
 


ది ఒడిస్సీని ఇలా వెండి  తెరకు ఎక్కించటం  ఇదే మొదటిసారి కాదు . ఇది గతంలో కూడా తీసారు. 1911లో మొదటిసారిగా  సైలెంట్ సినిమాగా తీసాకరు. ఆ తర్వాత, 1954లో కిర్క్ డగ్లస్ నటించిన యులిసెస్ వచ్చింది . 2000 వ్యంగ్య హాస్య చిత్రం ఓ బ్రదర్, వేర్ ఆర్ట్ యు? తీసారు.  ఇప్పుడు మరోసారి ఈ కవిత ఆధారంగా ఈ చిత్రం కథ నోలన్ స్టైల్ లో తయారు అవుతోంది.

Christopher Nolan

 రొటీన్ చిత్రాలు తీయటానికి నోలన్ ఎప్పుడూ ఇష్టపడరు. అలాగే హాలీవుడ్‌ చిత్రాలంటే సాధారణంగా ముందుగా గుర్తొచ్చేవి.. సూపర్‌ హీరోలు, యాక్షన్‌ సన్నివేశాలే. కానీ కాలంతో ప్రయోగ చిత్రాలు చేస్తూ హాలీవుడ్‌లో, అంతర్జాతీయంగా తనదైన ముద్ర వేశారు దర్శకుడు క్రిస్టోఫర్‌ నోలన్. ఆయన చిత్రాలకు ప్రత్యేక అభిమానులు అందుకే ఉంటారు.

ఇప్పుడు ఒడస్సీతో మరోసారి ప్రయోగం చేస్తారనడంలో సందేహం లేదు . అలాగే ఈ ఒడస్సీ చిత్రంలో హీరోయిజానికి కొద‌వేమీ ఉండ‌దంటున్నారు. విధేయత, మోసం, దైవ సంకల్పానికి వ్యతిరేకంగా పోరాటం వంటి అంశాల‌తో సినిమా ఆద్యంతం ర‌క్తి క‌ట్టిస్తుందని హాలీవుడ్ మీడియా అంటోంది. యూనివర్సల్ బ్యాన‌ర్ లో క్రిస్టోఫర్ నోలన్ కి ఇది రెండో చిత్రం. 17 జూలై 2026న థియేట‌ర్ల‌లో రిలీజ్ ప్లాన్ చేసి ఎనౌన్స్ చేసారు.

Latest Videos

click me!