కమల్ హాసన్
భారతీయ సినిమాలో కమల్ హాసన్ ఒక దిగ్గజ నటుడు. నటుడిగానే కాకుండా నృత్య దర్శకుడు, గాయకుడు, గీత రచయిత, దర్శకుడు ఇలా బహుముఖ ప్రజ్ఞాశాలి. 1960 లో బాల నటుడిగా ఆయన సినీ ప్రస్థానం మొదలైంది.
భారతీయ సినిమా రాబర్ట్ డి నీరో అని పిలువబడే కమల్ 4 జాతీయ అవార్డులు అందుకున్నారు. అనేక ఇతర ప్రతిష్టాత్మక అవార్డులు కూడా సొంతం చేసుకున్నారు. ఆస్కార్ కు అత్యధిక చిత్రాలను పంపిన ఏకైక నటుడు అనే గౌరవం కమల్ హాసన్ కు దక్కింది.
కమల్ హాసన్
60 ఏళ్లకు పైగా సినీ రంగంలో రాజ్యమేలుతున్న కమల్ హాసన్ ప్రస్తుతం యువ నటులకు పోటీ ఇస్తున్నారు. మధ్యలో కొంత కాలం డౌన్ అయినా, `విక్రమ్` సినిమాతో పుంజుకున్నారు. కమల్ ఈజ్ బ్యాక్‌అనిపించాడు.`కల్కి 2898 ఏడీ`లో ఓ మెరుపుమెరిసి వాహ్ అనిపించారు. ఇటీవల `భారతీయుడు 2`తో ఆయన డిజప్పాయింట్ చేశారు. ఇప్పుడు భారీ సినిమాల లైనప్‌తో బిజీ గా ఉన్నాడు.
వాణి గణపతి గురించి కమల్
సినీ రంగంలో విజయవంతమైన నటుడిగా ఉన్నప్పటికీ, ఆయన ఫ్యామిలీ లైఫ్‌లో ఎప్పుడూ వివాదాస్పదంగానే ఉంది. 1978లో నటి, క్లాసికల్ నృత్యకారిణి అయిన వాణి గణపతిని కమల్ హాసన్ వివాహం చేసుకున్నారు. అయితే, వాణికి విడాకులు ఇచ్చే ముందే కమల్ సరికతో డేటింగ్ చేస్తున్నట్లు వార్తలు వచ్చాయి. 1988లో కమల్, వాణి విడిపోయారు. వాణి గణపతికి విడాకులిచ్చిన తర్వాత పెళ్లి మీద నమ్మకం పోయిందని కమల్ ఒక ఇంటర్వ్యూలో చెప్పారు.
వాణి గణపతి గురించి కమల్
“ఆ పెళ్లి నాకు సంతోషాన్ని ఇవ్వలేదు. నేను అబద్ధం చెప్పను. అది చాలా బాధాకరం. నేను సంతోషంగా ఉండాలనుకున్నాను. అప్పటికి నాకు పెళ్లి అనే వ్యవస్థ మీద నమ్మకం పోయింది. నేను ఎప్పుడూ ధైర్యంగా మాట్లాడాను. మొదటి రోజే నాకు సెట్ కాలేదని చెప్పాను” అని అన్నారు.
వాణి గణపతి, కమల్
కమల్ వాణిని పెళ్లి చేసుకున్న సమయంలోనే సరికతో డేటింగ్ మొదలుపెట్టారని, ఇద్దరూ కలిసి జీవిస్తున్నారని ప్రచారం జరిగింది. 1988లో కమల్ సరికను వివాహం చేసుకున్నారు. వీరికి శృతి హాసన్, అక్షర హాసన్ అనే ఇద్దరు కుమార్తెలు జన్మించారు. అయితే, సరికతో కూడా కమల్ కు పెళ్లి ఎక్కువ కాలం నిలవలేదు. 2004లో వీరు కూడా విడిపోయారు.
వాణి గణపతికి విడాకులిచ్చిన తర్వాత చాలా కాలం మౌనంగా ఉన్న కమల్ 2015లో ఒక ఇంటర్వ్యూలో వాణికి ఇచ్చిన విడాకులు తనను దివాలా తీసేలా చేశాయని చెప్పారు.
కమల్ హాసన్, వాణి గణపతి
దీనిపై వాణి గణపతి స్పందిస్తూ, “మా విడాకులకు 28 ఏళ్లు అవుతుంది. నేను దీని గురించి ఎప్పుడూ మాట్లాడను, ఎందుకంటే ఇది చాలా వ్యక్తిగత విషయం. మేమిద్దరం ఇప్పుడు విడిపోయాం. కానీ ఆయన ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నారు?
మా ఉమ్మడి ఇంటి నుంచి వాడిన వస్తువులు కూడా నాకు ఇవ్వడానికి ఆయన నిరాకరించారు. అలాంటి వ్యక్తి నుంచి నేను ఏమి ఆశించగలను? పెళ్లి నుంచి బయటకు వచ్చినప్పుడు ఆయనకు బాధ కలిగి ఉండవచ్చు, కానీ ఆ తర్వాత చాలా జరిగింది. చాలా కాలం అయ్యింది. ఇప్పుడు ఎవరి లైఫ్‌లో వాళ్లు బిజీగా ఉన్నాం” అని అన్నారు. గతంలో కమల్ చెప్పిన విషయాలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ఆసక్తిని క్రియేట్ చేస్తున్నాయి.