పుష్ప2 సినిమాకు వచ్చినంత విచిత్రమైన పరిస్థితి గతంలో ఏ సినిమాకు వచ్చి ఉండదు. అల్లు అర్జున్ కు ఎదురైన ఈ అనుభవం కూడా ఇంకే హీరో ఫేస్ చేసి ఉండకపోవచ్చు. ఎందుకుంటే సినిమా బ్లాక్ బస్టర్ హిట్. కేవంల తెలుగు, హిందీ బెల్ట్ లోనే భారీగా కలెక్షన్లు రాబట్టింది. 2000 కోట్ల క్లబ్ లో చేరడానికి తహతహలాడుతోంది పుష్ప2 సినిమా. ఇక కేరళ, తమిళనాడు, కన్నడలో కూడా భారీగా కలెక్షన్లు వచ్చి ఉంటే.. ఇప్పటికే 2000 కోట్ల మార్క్ దాటిపోయేది.
Also Read: గేమ్ ఛేంజర్ నుంచి ట్రైలర్ రిలీజ్, డ్యూయల్ రోల్ లో రామ్ చరణ్ మాస్ ట్రీట్..
allu arjun
అయితే అల్లు అర్జున్ అన్ లక్క్.. లేక అనుకోకుండా జరిగిందా తెలియదు కాని.. సినిమా రిలీజ్ మొదటి రోజే.. సంధ్య థియేటర్ తొక్కిసలాట జరిగి రేవతి అనే మహిళ మరణించడం.. చిన్నారి తేజ కోమా స్టేజ్ కు వెళ్ళడం.. ఈ కేసు బన్నీ మెడకు చుట్టుకుంది. అది కాస్త పెద్ద వివాదంగా మారింది. ఇక అప్పటి నుంచి జరిగిన పరిణామాలు అందరికి తెలిసినవే. పుష్ప2 మాత్రం భారీ స్థాయిలో పాన్ ఇండియా లెవల్లో కలెక్షన్లు వసూలు చేస్తుంది.
Also Read: గేమ్ ఛేంజర్ కోసం డైరెక్టర్ శంకర్ తీసుకున్న రెమ్యునరేషన్ ఎంతో తెలుసా..?
కాని ఆ రేంజ్ లో సంబరాలు కూడా చేసుకోలేని పరిస్థితి అల్లుఅర్జున్ ది. ఈ క్రమంలోనే మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ ఈ సినిమా గురించి తెలుస్తోంది. అదేంటంటే.. ఇంత వివాదానికి కారణం అయిన.. ఫేమస్ థియేటర్ హీరోలందరికి సెంటిమెంట్ థియేటర్ సంధ్య 70 ఎమ్ ఎమ్ లో పుష్ప2 సినిమా ఎంత కలెక్షన్లు రాబట్టిందో తెలుసా. దేశ వ్యాప్తంగా ప్రభంజనం సృష్టించిన పుష్ప2 సంధ్యం థియేటర్ లో ఆడినంత కాలం ఎంత వసూళ్ళు రాబట్టి ఉంటుందో ఒక్క సారి ఆలోచించారా..?
Also Read: సాయి పల్లవి రెమ్యునరేషన్ పూర్తిగా తిరిగి ఇచ్చేసిన సినిమా ఏదో తెలుసా..?
ఇప్పటి వరకూ ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా 1800 కోట్లకు పైన కలెక్షన్లను రాబడితే.. సంధ్య థియేటర్ ఒక్క దాంట్లోనే పుష్ప2 రెండు కోట్ల వరకూ వసూలు చేసిందంట. ఈ థియేటర్ చరిత్రలోనే ఇది రికార్డ్ అని చెప్పవచ్చు. అయితే ఇవి అఫీషియల్ గా ప్రకటించిన లెక్కలు కానప్పటికీ.. ఇండస్ట్రీలో ఈ విషయం వైరల్ అవుతోంది. అంత వివాదం నడిచినసంధ్య థియేటర్ లో కూడా రికార్డ్ కలెక్షన్లను ఈసినిమా రాబట్టింది.
Also Read: జబర్ధస్త్ సన్నీ నవ్వుల వెనుక ఇంత విషాదం ఉందా..?
ఇక యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో పెను సంచలనంగా మారింది పుష్ప2. ప్రస్తుతం బన్నీ ఈ సినిమా సక్సెస్ ను ఎంజాయ్ చేయలేని పరిస్థితుల్లో ఉన్నారు. ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఊర్రూతలూగుతుంటే.. అల్లు అర్జున్ మాత్రం ఇంటికే పరిమితం అవ్వాల్సిన పరిస్థితి. ఇక ఈ సినిమాకు మరో సీక్వెల్ ఉన్నట్టు ప్రకటించారు టీమ్. పుష్ప3 ద రాంపేజ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందో చూడాలి.