జబర్ధస్త్ సన్నీ నవ్వుల వెనుక ఇంత విషాదం ఉందా..? కోట్లు ఉన్నా కమెడియన్ ఇలా ఎలా మారిపోయాడు..?
జబర్ధస్త్ లో అందరిని నవిస్తూ..నవ్వుతూ.. స్పెషల్ గా కనిపిస్తుంటాడు సెక్సీ సన్నీ. తాగుబోతు పాత్రలకు బ్రాండ్ గా.. సుధీర్ టీమ్ లో సందడి చేస్తూ వస్తున్న సన్నీ వెనుక ఉన్న పెను విషాదం మీకు తెలుసా..?
మరీ ముఖ్యంగా జబర్ధస్త్ లో ఇలాంటి జీవితాలు చాలా కనిపిస్తుంటాయి. వారిలో సన్నీ కూడా ఒకడు. అయితే జబర్ధస్త్ లో ఒక్కొక్కరిది ఒక్కొక్క కథ. చాలామంది కడుబుబ్బా నవ్వించిన కమెడియన్ల వెనుక విషాద కథలు ఉన్నాయి. మరీ ముఖ్యంగా జబర్ధస్త్ నుంచి స్టార్ గా ఎదిగిన ఆది అయితే ఎంతలా నవ్విస్తాడో మనందరికి తెలిసిందే. అయితే ఒక సారి మాత్రం గతంలో తన ఆర్ధిక పరిస్థితి గురించి చెప్పి కన్నీళ్ళు పెట్టించాడు.
నలుగురిని నవ్విస్తున్నారు కాబట్టి.. కమెడియన్స్ జీవితంలో నవ్వులే ఉంటాయి అనుకోవడం పెద్ద పొరపాటు. ఏ కళాకారుడైనా.. స్ట్రగుల్డ్ లైఫ్ నుంచే ఎదుగుతాడు. జీవితం విలువ తెలిసిన వాడు..కమెడియన్ గా స్థిరపడినా కూడా.. లోపల ఎంత బాధ ఉన్నా..పైకి నవ్వుతూ నవ్విస్తూ.. తన పాత్ర తాను అద్భుతంగా పోషిస్తాడు. అలాంటిజీవితాలు చాలా ఉన్నాయి తెలుగు సినిమా పరిశ్రమలో.
Also Read: సాయి పల్లవి రెమ్యునరేషన్ పూర్తిగా తిరిగి ఇచ్చేసిన సినిమా ఏదో తెలుసా..? నిర్మాతను కాపాడిన హీరోయిన్.
ఇలా చాలామందికి ఆర్ధిక, ఆరోగ్య పరిస్థితులు బాగోలేకపోవడం ఉంటుంది. కాని కమెడియన్ సన్నీది మాత్రం డిఫరెంట్ స్టోరీ. దాదాపు జబర్ధస్త్ స్టార్టింగ్ నుంచి ఉన్న సన్నీ.. మొదటి నుంచి.. సుడిగాలి సుధీర్ టీమ్ లోనే నటిస్తున్నాడు. సుధీర్, శ్రీను, రామ్ ప్రసాద్ తరువాత వీరితో కనిపించేవ్యక్తి సన్నీ. చాలా క్వాజువల్ గా కనిపిస్తాడు. తాగుబోతు పాత్రలు ఎక్కువగా చేస్తుంటాడు, సింపుల్ గా అలా వచ్చి ఇలా చేసి వెళ్తుంటాడు.
కాని ఎప్పుడు సన్నీ గురించి ఎక్కువగాఎక్కడా ఎవరు మాట్లాడలేదు. జబర్ధస్త్ స్టేజ్ మీద అక్కడివాదందరి గురించి అందరు చెప్పుకున్నారు కాని.. సన్నీ బ్యాక్ గ్రౌండ్ ఏంటీ అనేది మాత్రం చాలామందకి తెలియదు.. ఎప్పుడు చెప్పుకోలేదు కూడా. ఇక రీసెంట్ గా సన్నీ గురించి ఓ సందర్భంలో చెప్పాల్సి వచ్చింది. సన్నీ నవ్వుల వెనకు ఎంత విషాదం ఉందో తాజాగా తెలిసింది.
రామ్ ప్రసాద్ కూడా సన్నీ గురించి చెప్పి కంటతడి పెట్టించాడు. రీసెంట్ గా ఓ స్కిట్ అయిపోయిన తరువాత రష్మి అడిగింది. సన్నీ ఇన్నాళ్ళ నుంచి జబర్ధస్త్ లో నవ్విస్తున్నారు కదా..? మీ గురించి మీరు సరదాగా చెపుతుంటారు కదా.. మీ లవ్ స్టోరీ గురించి చెప్పండి, ఇంతవరకు ఎందుకు పెళ్లి చేసుకోలేదు అని అడిగింది.
అప్పుడు సన్నీ మాట్లాడుతూ.. ఓ అమ్మాయిని ప్రేమించా.. ఎనిమిదేళ్లు ఇద్దరం ప్రేమించుకున్నాం. కానీ ఆ అమ్మాయి నన్ను వదిలేసి వేరేవాడిని పెళ్లి చేసుకుని వెళ్ళిపోయింది. గవర్నమెంట్ జాబ్ ఉందని అతన్ని పెళ్లి చేసుకుంది.
అప్పటి నుంచి పెళ్ళి మీద ఇంట్రెస్ట్ పోయింది అన్నాడు. ఇక ఆటో రామ్ ప్రసాద్ మాట్లాడుతూ.. సన్నీ పెద్ద కోటీశ్వరుడు. ఇంత వరకూ ఎవరికీ తెలియదు.. అతనికి బోలెడన్ని డబ్బులు ఉన్నాయి.. చాలా ఆస్తులు ఉన్నాయి.
కానీ సన్నీ లవ్ ఫెయిల్ అవ్వడంతో పెళ్లి చేసుకోకుండా లైఫ్ ను ఇలా వదిలేసుకున్నాడు. సన్నీ అన్న, వదిన ఇద్దరూ గవర్నమెంట్ డాక్టర్స్.. సన్నీ వదిన గైనకాలజిస్ట్.. అన్న రేడియాలజిస్ట్. .. అంత డబ్బున్నా వాడు ఎక్కువగా వాళ్ళ ఇంట్లో ఉండడు.. మా రూమ్స్ కు వచ్చి తాగి పడుకుంటాడు. ఇంట్లో వాళ్లు కూడా బ్రతిమలాడారు, మేము కూడా పెళ్ళి చేసకోవచ్చు కదా అని చాలా సార్లు చెప్పి చూశాం.. కాని అమ్మాయి కోసం వాడు లైఫ్ నే వదిలేశాడు.
ఆ అమ్మాయి అలా చేయడంతో.. ప్రేమ, పెళ్ళిపై వాడికి విరక్తి వచ్చేసింది అన్నారు రామ్ ప్రసాద్. ఇక ఈ వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. నెటిజన్లు రకరకాల కామెంట్లు పెడుతున్నారు. చాలా మంది నెటిజన్స్ ఎమోషనల్ గా కామెంట్స్ చేస్తున్నారు. ఇన్ని రోజులు వయసు అయిపోయి తాగుతున్నాడు అనుకున్నాం.. కానీ ఇంత బాధ ఉందా అన్న అని.. నిజంగా ప్రేమించే వాళ్ళు మాత్రం ఇలా సింగల్ గా ఉండిపోతారు అని కామెంట్స్ చేస్తున్నారు.