టాలీవుడ్ చరిత్రను తిరగరాసింది పుష్ప-2. ఎప్పుడో బాహుబలి2 క్రియేట్ చేసిన రికార్డ్స్ ను ఇంత వరకూ ఎవరూ బ్రేక్ చేయలేకపోయారు. కాని అల్లు అర్జున్ మాత్రం పుష్ప2 తో ఆ రికార్డ్స్ ను బ్రేక్ చేసేశారు. పుష్ప సినిమారిలీజ్అయ్యి నెలరోజులు దాటింది. అయితే ఇంకా బాలీవుడ్ లో కలెక్షన్లు కంటీన్యూ అవుతూనే ఉన్నాయి. తెలుగు రాష్ట్రాలతో పాటు ఉత్తరాది రాష్ట్రాల్లో కూడా ఇంకా వసూళ్ళు కొనసాగుతూనే ఉన్నాయి.
Also Read: హీరోలకంటే హ్యాండ్సమ్ గా టాలీవుడ్ యంగ్ డైరెక్టర్స్, అనిల్ రావిపూడి నుంచి వశిష్ట వరకూ...
గేమ్ ఛేంజర్ రావడంతో థియేటర్లు అటు వెళ్ళిపోయాయి కాని.. ఇదే ఊపు ఇంకో పదిరోజులు కొనసాగితే.. 2000 కోట్లు సంపాధించడంపెద్ద కష్టం ఏమీ కాదు. అయితే ఇప్పటికే పుష్ప సినిమా ప్రపంచ వ్యాప్తంగా 1831 కోట్లు వసూలు చేసి ఇండియన్ సినిమాల్లో అత్యధిక కలెక్షన్స్ వసూలు చేసిన సినిమాల్లో టాప్ 2 గా నిలిచిన బాహుబలి 2 రికార్డ్ కూడా బద్దలు కొట్టేసాడు అల్లు అర్జున్.
Also Read: వారసుడిని రంగంలోకి దింపబోతున్న పవన్ కళ్యాణ్, అకీరా నందన్ టాలీవుడ్ ఎంట్రీ ఎప్పుడంటే..?
అయితే 2000 కోట్లు దాటి కలెక్షన్లు సంపాదించడానికి మరో అవకాశం ఉంది పుష్ప2 టీమ్ కు. ఈసినిమాను ఎలాగైనా 2000 కోట్ల మైలు రాయి దాటించాలని గట్టి ప్రయత్నంలో ఉన్నారు టీమ్. అందుకే జనవరి సెకండ్ వీక్ లో ఈసినిమాకు మరికాస్త అంటే 20 నిమిషాల వరకూ సినిమాను యాడ్ చేసి.. విదేశాల్లో రిలీజ్ చేయని ప్లేస్ ల్లో ఈసినిమాను పంపించాలని చూస్తున్నారు. ఇప్పటి వరకూ 2000 కోట్లతో ఆమిర్ ఖాన్ దంగల్ రికార్డ్ అలాగే ఉంది. సో దాన్ని క్రాస్ చేయాలనేది ఐడియా.
అక్కడ ఈ మూవీ అక్కడ ఏకంగా 1100 కోట్ల కలెక్షన్లు రాబట్టి రికార్డ్ క్రియేట్ చేసింది. ఓవరాల్ గా దంగల్ 2000 కోట్లు వసూలు చేసింది. దశాబ్ధకాలంగా దంగల్ రికార్డ్ పదిలంగా ఉంది. ఇప్పుడు ఆ రికార్డ్ అందుకునే ఛాన్స్ పుష్పగాడికి మాత్రమే ఉంది. పుష్ప-2 మూవీని కూడా చైనాలో రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. రేపో మాపో అఫీషియల్ అనౌన్స్‌మెంట్ కూడా రానుంది.ఇక చైనాలో పుష్ప2 కి చైనాలో ప్రస్ పాయింట్స్ ఎక్కువగా ఉన్నాయి.
ఈసినిమా లో ఎర్రచందనంకాన్సెప్ట్ ఉండటంతో..అక్కడి వారికి ఎర్రచందనం అంటే చాలా ఇష్టం. సెంటిమెంట్ కూడా. దాంతో ఈకాన్సెప్ట్ అంతా ఎర్రచందనం మీదనే ఉండటంతో పక్కాగా ఈసినిమాను ఆదరిస్తారని అనుకుంటున్నారు. అంతే కాదు చైనా మార్కెట్ లో ఈసినిమా 150 కోట్లు సంపాదించిపెడితే చాలు.. దంగల్ రికార్డ్ బ్రేక్ అయినట్టే.. మొదటి సినిమాగా పుష్ప2 రికార్డ్స్ బ్లాస్ట్ అవుతాయి. చూడాలి మరి అల్లు అర్జున్ సరికొత్త రికార్డ్ సెట్ చేస్తాడా లేదా అని. చైనాతో పాటు జపాన్ లో కూడా ఈసినిమా రిలీజ్ చేసే అవకాశం ఉంది.