Puri Jagannadh: ఎంతో మంది స్టార్ హీరో, హీరోయిన్లను ఇండస్ట్రీకి పరిచయం చేశాడు డైరెక్టర్ పూరి జగన్నాథ్. ఎంత మంది హీరోయిన్లను ఇండస్ట్రీకి అందించినా.. ఓ హీరోయిన్ మాత్రం ఆయన కు చాలా ప్రత్యేకం. ఆమె ఇచ్చిన షాక్ ను పూరీ జీవితంలో మర్చిపోలేకపోతున్నాడు.
టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ మార్క్ గురించి అందరికి తెలిసిందే. హీరోలలో కూడా నెగెటీవ్ కోణం బయటపడెతుంటాడు దర్శకుడు. తన సినిమాల విజయాలతో పాటు తనదైన శైలిలో చెప్పే ఆసక్తికరమైన విషయాలతో ఎప్పుడూ వార్తల్లో నిలుస్తుంటారు. రామ్ చరణ్ లాంటి స్టార్ హీరోలతో పాటు ఎంతో మంది స్టార్ హీరోయిన్లను పరిశ్రమకు పరిచయం చేసింది పూరీనే. ఆయన ద్వారా పరిచయం అయిన ఓ హీరోయిన్ గురించి చెపుతూ.. షాకింగ్ విషయాలు బయటపెట్టాడు స్టార్ డైరెక్టర్. ఆ హీరోయిన్ ఎవరో కాదు అనుష్క శెట్టి.
24
'సూపర్' సినిమా కోసం ముంబై ప్రయాణం
స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి (స్వీటీ) సినీ పరిశ్రమలోకి ఎలా ప్రవేశించారు, ఆమెను తాను ముంబైలో మొదటిసారి ఎలా కలిసింది అనే విషయాలను పూరీ జగన్నాథ్ ఓ సందర్భంలో చాలా సరదాగా పంచుకున్నారు. టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున హీరోగా నటించిన 'సపర్' సినిమా కోసం పూరీ జగన్నాథ్ నూతన హీరోయిన్ ను వెతికే క్రమంలో ముంబై వెళ్లారు. ఆ సమయంలో ముంబైలోని సీ ప్రిన్సెస్ హోటల్ లాబీలో ఆయన కూర్చుని ఎదురుచూస్తుండగా, ఒక యంగ్ లేడీ వచ్చింది. ఆమె ఎత్తు, రూపం, చూడగానే అందరిని ఆకట్టుకునేలా ఉన్నాయి. ఆమెను పేరు అడగ్గా "స్వీటీ" అని ఆన్సర్ చేసి అక్కడ కూర్చుంది. ఆమె మరెవరో కాదు మన అందరి అందాల తార అనుష్క శెట్టి.
34
ఆథార్ కార్డు సైజు చిన్న ఫోటోతో షాక్..
పూరీ జగన్నాథ్ ఆమెను ఆడిషన్ కోసం ఫోటోలు ఏమైనా ఉంటే ఇవ్వమని అడగ్గా, ఆమె తన పర్సులో వెతికారు. స్టాంప్ సైజు కంటే చిన్నగా, ఆధార్ కార్డు కోసం దాచుకున్న ఒక చిన్న ఫోటోను తీసి చూపించారు. అది చూసిన పూరీ జగన్నాథ్ ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. సినిమా ఇండస్ట్రీకి వచ్చే హీరోయిన్ల వద్ద పెద్ద ఫోటోషూట్లు, పోర్ట్ ఫోలియోలు ఉంటాయి, కానీ అనుష్క మాత్రం ఎలాంటి హంగులు లేకుండా అత్యంత సాధారణంగా ఉండటం ఆయనకు బాగా నచ్చింది.
అనుభవం లేదు.. అయినా నమ్మకం
అనుష్కను సినిమా కోసం పూరీ జగన్నాథ్ కొన్ని ప్రశ్నలు అడగ్గా ఆమె చాలా నిజాయితీగా సమాధానం చెప్పారు. ఇంతకు ముందు నటించావా.. ఇప్పుడు నటించగలుగుతావా అని అడగ్గా.. నటన గురించి తనకు పెద్దగా తెలియదని, ఎప్పుడూ ప్రయత్నించలేదని చెప్పారు. డాన్స్ వచ్చా అని అడిగితే.. డాన్స్ కూడా రాదని, ఒకవేళ వేస్తే వేయవచ్చు లేదా లేకపోవచ్చు అని అమాయకంగా సమాధానం ఇచ్చారు. అనుష్క ఇచ్చిన ఈ అమాయకమైన సమాధానాలు విన్న పూరీ జగన్నాథ్, ఈ అమ్మాయి ఎలాంటి ఫిల్టర్స్ లేకుండా చాలా సహజంగా ఉందని భావించారు.
ఆ సమయంలో పూరీ జగన్నాథ్ భార్య హోటల్ పై గదిలో ఉన్నారు. ఆయన వెంటనే ఆమెకు ఫోన్ చేసి, కింద లాబీలో ఒక అద్భుతమైన అమ్మాయి ఉందని, వచ్చి చూడమని చెప్పారు. కిందకి వచ్చిన ఆయన భార్య స్వీటీని చూడగానే ఎత్తు, వొడ్డు పొడుగు చాలా బాగున్నాయని, ఈ అమ్మాయిని కచ్చితంగా సినిమాలో పెట్టాలని మెచ్చుకున్నారు. అనుష్కను తాను ఏం చేస్తున్నావని అడగ్గా, ఆమె యోగా టీచర్‌గా పనిచేస్తున్నానని చెప్పారు. అప్పుడు పూరీ జగన్నాథ్ ఆమెతో, "సరే అయితే ఒక ఆరు నెలలు నాతో హైదరాబాద్ వచ్చి ప్రయత్నిద్దాం, ఏదైనా పని అయితే అవుతుంది లేదా నీ యోగా జాబ్ నీకు ఎలాగో ఉంది" అని చెప్పి ఆమెను హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోకి తీసుకొచ్చారు. అక్కడ నాగార్జున గారు చూడగానే... అమ్మాయి బాగుంది.. ఎలాంటి ఆడిషన్స్ లేకుండానే ఆమెను 'సపర్' సినిమా కోసం లాక్ చేశామని పూరీ జగన్నాథ్ గుర్తు చేసుకున్నారు.