Chandra Mohan: అప్పట్లోనే అపరిచితుడిని మించేలా రెచ్చిపోయిన చంద్రమోహన్.. నెంబర్ 1 కాలేకపోవడానికి కారణాలు ఇవే

Published : Nov 13, 2026, 10:44 AM IST

చంద్రమోహన్ తన కెరీర్ లో వందలాది సినిమాల్లో నటించారు. విలక్షణ నటనతో మెప్పించారు. హీరోగా ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించినప్పటికీ చివరికి క్యారెక్టర్ ఆర్టిస్ట్ గానే కెరీర్ కొనసాగించాల్సి వచ్చింది.

PREV
15
Chandra Mohan

దివంగత నటుడు చంద్రమోహన్ గురించి పరిచయం అవసరం లేదు. హీరోగా, విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, కమెడియన్ గా వందల చిత్రాల్లో నటించారు. దశాబ్దాల పాటు తెలుగు ప్రేక్షకులని తన నటనతో అలరించారు. చంద్రమోహన్ ప్రస్తుతం టాలీవుడ్ లో ఉన్న సీనియర్ నటుల కంటే చాలా సీనియర్. కృష్ణ, కృష్ణం రాజు, శోభన్ బాబులకు సమకాలీకుడు. వాళ్లకు పోటీగా హీరోగా నటించి ఎన్నో సూపర్ హిట్స్ అందుకున్నారు.

25
మాస్ ఇమేజ్ లేదు

అయితే వాళ్ళలా చంద్రమోహన్ కి మాస్ ఇమేజ్ లేదు. క్లాస్ సినిమాలతోనే అదరగొట్టారు. జయసుధ, శ్రీదేవి లాంటి అగ్ర హీరోయిన్లతో నటించారు. కానీ క్రమంగా కృష్ణ, శోభన్ బాబు ల క్రేజ్ పెరుగుతూ వచ్చింది. చంద్రమోహన్ కి మాస్ ఇమేజ్ లేకపోవడంతో క్లాస్ సినిమాతో ఎక్కువ కాలం హీరోగా కొనసాగలేకపోయారు. కానీ నటనలో ఆయన పలికించే హావ భావాలు అద్భుతం అనే చెప్పాలి. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించినా, నెగిటివ్ రోల్ ప్లే చేసినా చంద్రమోహన్ నటన అద్భుతంగా ఉండేది.

35
పాపే నా ప్రాణంలో చంద్రమోహన్ నటన

చంద్రమోహన్ నటన గురించి చెప్పాలి అంటే 1998లో విడుదలైన పాపే నా ప్రాణం సినిమాని గుర్తు చేసుకోవాలి. ఈ మూవీలో జేడీ చక్రవర్తి, జయసుధ, చంద్రమోహన్, ఆశిష్ విద్యార్థి ప్రధాన పాత్రల్లో నటించారు. చంద్రమోహన్ ది నెగిటివ్ రోల్. జయసుధకు భర్తగా నటించారు. జయసుధ ఈ మూవీలో గవర్నర్ గా నటించారు. రాజకీయ కుట్రలో భాగంగా ఆమెని అంతం చేయాలని కొందరు భావిస్తారు. ఆ కుట్రలో ఆమె భర్త అయిన చంద్రమోహన్ కూడా భాగం అవుతాడు. పైకి మంచి వ్యక్తిగా, భర్తగా నటిస్తూ తన భార్యనే అంతం చేయాలని భావిస్తాడు.

45
అప్పట్లోనే అపరిచితుడిలా రెచ్చిపోయిన చంద్రమోహన్

క్లైమాక్స్ లో తన ప్లాన్ అనుకున్నట్లు జరిగింది అని, తన భార్య చనిపోయింది అని భ్రమ పడిన చంద్రమోహన్ జయసుధ బాడీ వద్దకు వెళ్లి పైకి దుఃఖం ప్రదర్శిస్తూ ఏడుస్తూ మరోవైపు తన కుట్ర ఫలించింది అనే సంతోషంతో నవ్వుతూ.. ఇలా మల్టీ షేడ్స్ లో ఆయన నటన అద్భుతంగా ఉంటుంది. అపరిచితుడు క్లైమాక్స్ లో విక్రమ్ ప్రకాష్ రాజ్ కొట్టేటప్పుడు ఎలా మల్టీ షేడ్స్ లో నటించాడో దానిని చాలా ఏళ్ళ క్రితమే చంద్రమోహన్ చేసి చూపించారు. కానీ జేడీ చక్రవర్తి, జయసుధ ప్లాన్ చేసి చంద్రమోహన్ ని బురిడీ కొట్టిస్తారు.

55
చంద్రమోహన్ నెంబర్ 1 కాలేకపోవడానికి కారణాలు

అంతటి అద్భుతమైన ప్రతిభ ఉన్న చంద్రమోహన్ చివరికి క్యారెక్టర్ ఆర్టిస్ట్ గానే ఎక్కువ సినిమాలు చేయాల్సి వచ్చింది. హీరోగా ఎక్కువ కాలం కొనసాగలేకపోయారు. కృష్ణ, కృష్ణం రాజు, శోభన్ బాబు లాంటి అగ్ర హీరోలకు అయన పోటీ ఇవ్వలేకపోవడానికి చాలా కారణాలు ఉన్నాయి. ఆయన హైట్ కొంత వరకు కారణం అయింది. అదే విధంగా చంద్రమోహన్ దూకుడు స్వభావం, వివాదాలు కూడా ఆయన కెరీర్ పై ప్రభావం చూపినట్లు ప్రచారం ఉంది.

Read more Photos on
click me!

Recommended Stories