ఛార్మికి పెళ్లి కాకపోవడం వల్లే ఇన్ని సమస్యలు.. పూరీ జగన్నాథ్‌ ఆవేదన.. ఇప్పటికైనా మారండి!

Published : Nov 04, 2025, 01:31 PM IST

దర్శకుడు పూరీ జగన్నాథ్‌ ఛార్మితో కలిసి ఉంటున్నారని, ఇద్దరు సహజీవనం చేస్తున్నారనే కామెంట్స్ ప్రతి సారి వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో పూరీ ఈ వార్తలు అసలు కారణం ఏంటో తెలిపారు. 

PREV
15
స్టార్‌ హీరోలకు బ్లాక్‌ బస్టర్స్ ఇచ్చిన పూరీ జగన్నాథ్‌

పూరీ జగన్నాథ్‌ టాలీవుడ్‌లో సంచలనాలు క్రియేట్‌ చేసిన దర్శకుడు. ఆర్జీవీ వారసుడిగా దర్శకుడిగా మారి క్రేజీ సినిమాలతో మెప్పించారు. బ్లాక్‌ బస్టర్స్ అందుకున్నారు. హీరో పాత్రలను చాలా క్రేజీగా చూపించడంలో ఆయన దిట్ట. ప్రతి స్టార్‌ హీరో పూరీతో ఒక్క మూవీ అయినా చేయాలనుకుంటారు. పూరీ సైతం దాదాపు అందరు హీరోలతో పనిచేశారు. హిట్‌ కొట్టారు. కానీ ఇప్పుడు కాస్త డౌన్‌ అయ్యారు. ఇటీవల కాలంలో ఆయన మూవీస్‌ ఆడియెన్స్ కి అంతగా కనెక్ట్ కావడం లేదు. దీంతో కొంత గ్యాప్‌ తీసుకుని ఇప్పుడు విజయ్‌ సేతుపతితో ఓ సినిమా చేస్తున్నారు. ప్రస్తుతం ఇది చిత్రీకరణ దశలో ఉంది.

25
ఛార్మితో రిలేషన్‌ తరచూ హాట్‌ టాపిక్‌

ఇదిలా ఉంటే పూరీ జగన్నాథ్‌కి సంబంధించి ఓ విషయం ఎప్పుడూ చర్చనీయాంశం అవుతోంది. అదే ఛార్మి మ్యాటర్‌. ఆమె హీరోయిన్‌గా టాలీవుడ్‌లోకి వచ్చింది. స్టార్‌ హీరోయిన్‌గా ఎదిగింది. కెరీర్‌ డౌన్‌ అవుతున్న సమయంలో పూరీ కాంపౌండ్‌లో చేరింది. నిర్మాతగా మారింది. వీరిద్దరు కలిసి సినిమాలు నిర్మిస్తున్నారు. చాలా కాలంగా కలిసే వర్క్ చేస్తున్నారు. దీంతోపాటు ఈ ఇద్దరు సహజీవనం చేస్తున్నారనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. అప్పట్లో ఇది పెద్ద రచ్చ అయ్యింది. బండ్ల గణేష్‌ లాంటి వాళ్లు కూడా పరోక్షంగా సెటైర్లు వేశారు. పూరీ ఫ్యామిలీలోనూ గొడవలు జరిగాయని టాక్‌.

35
20ఏళ్లుగా మేం ఫ్రెండ్స్ః పూరీ జగన్నాథ్‌

ఈ వార్తలు తరచూ సోషల్‌ మీడియాలో, మీడియాలో చర్చనీయాంశం అవుతున్నాయి. దీనిపై పూరీ జగన్నాథ్‌ స్పందించారు. రూమర్లు రావడానికి అసలు కారణం ఏంటో బయటపెట్టారు. ఛార్మికి పెళ్లి కాకపోవడం వల్లే అసలు సమస్య అని తెలిపారు. ఆమె మ్యారేజ్‌ చేసుకుని ఉంటే ఇంత జరిగేది కాదన్నారు. ఛార్మి తాను 20ఏళ్లుగా మంచి స్నేహితులమని, ఛార్మి 13 ఏళ్లు ఉన్నప్పట్నుంచి పరిచయం అన్నారు. అయితే తాను 50ఏళ్ల వయసున్న మహిళతో, లేదంటే లావుగా ఉన్న మహిళతో కనిపిస్తే ఎవరికీ ఎలాంటి బాధ ఉండేది కాదని, అప్పుడు ఎలాంటి డౌట్స్ రావని చెప్పారు. పెళ్లైన మహిళతో ఉన్నా కూడా ఎవరికీ సమస్య ఉండేది కాదని, ఛార్మి పెళ్లి చేసుకోకపోవడం వల్లే ఇదంతా అని వెల్లడించారు.

45
ఇప్పటికైనా మారండిః పూరీ

ఛార్మి చాలా యంగ్‌, ఇంకా మ్యారేజ్‌ కాలేదు, దీంతో తమ మధ్య ఏదో ఉందని అనుకుంటున్నారని, కానీ తమ మధ్య మీరనుకుంటున్నది ఏదీ లేదని, తాము మంచి స్నేహితులం మాత్రమే అని వెల్లడించారు పూరీ. ఈ విషయంలో ఇప్పటికైనా మారాలని ఆయన వెల్లడించారు. మూడేళ్ల క్రితం పూరీ చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌ కావడం గమనార్హం. మొత్తంగా తాము జస్ట్ ఫ్రెండ్స్ అని పూరీ క్లారిటీ ఇచ్చారు.

55
విజయ్‌ సేతుపతితో మూవీ చేస్తున్న పూరీ, ఛార్మి

ఇదిలా ఉంటే పూరీ జగన్నాథ్‌, ఛార్మి కలిసే సినిమాలు చేస్తున్నారు. గతంలో తన పూరీ జగన్నాథ్‌ టూరింగ్‌ టాకీస్‌ పతాకంపై సినిమాలు నిర్మించిన పూరీ.. ఇప్పుడు ఛార్మితో కలిసి పూరీ కనెక్ట్స్ బ్యానర్‌పై సినిమాలు నిర్మిస్తున్నారు. `మెహబూబా` నుంచి ఈ ఇద్దరు కలిసి నిర్మాణంలో ఉన్నారు. `ఇస్మార్ట్ శంకర్‌`, `రొమాంటిక్‌`, `లైగర్‌`, `డబుల్‌ ఇస్మార్ట్` చిత్రాలను నిర్మించారు. ఇప్పుడు విజయ్‌ సేతుపతితో సినిమాని కూడా కలిసే నిర్మిస్తున్నారు. ఇందులో టబు కీలక పాత్ర పోషిస్తోంది. సంయుక్త మీనన్‌ హీరోయిన్‌గా నటిస్తుంది. త్వరలో ఈ మూవీ అప్‌ డేట్‌ రాబోతుంది.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories