భరణితో నన్ను లింక్ చేసిన వాడు అమ్మకే పుట్టలేదు.. దివ్వెల మాధురి ఫైర్.. నాగబాబుని ఇరికించిందిగా

Published : Nov 04, 2025, 09:22 AM IST

Divvala Madhuri: దివ్వెల మాధురి తాజాగా భరణి, నాగబాబులపై, బిగ్‌ బాస్‌ షోపై హాట్ కామెంట్ చేసింది. భరణితో తనని లింక్‌ చేసి ట్రోల్‌ చేసిన వారికి వార్నింగ్‌ ఇచ్చింది.   

PREV
15
ఎనిమిదో వారం ఎలిమినేట్‌ అయిన మాధురి

ఏపీ వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ భార్య, బిగ్ బాస్ కంటస్టెంట్ దివ్వెల మాధురి తాజాగా తన విశ్వరూపం చూపించింది. ఆమె ఇటీవల బిగ్ బాస్ తెలుగు 9కి వెళ్లొచ్చిన విషయం తెలిసిందే. ఈ ఆదివారమే ఎలిమినేట్ అయ్యింది. ఐదో వారంలో వైల్డ్ కార్డ్ ద్వారా మాధురి హౌజ్లోకి వెళ్లిన ఆమె అందులో మూడు వారాలే ఉంది. ప్రారంభంలో రెండు మూడు రోజులు రచ్చ చేసిన మాధురి ఆ తర్వాత కామ్ అయిపోయింది. కేవలం సెటైర్లు, కౌంటర్లకే పరిమితమయ్యింది. దీంతో ఆమె తీరు ఆడియెన్స్ కి నచ్చలేదు. దీంతో ఈ వారం ఎలిమినేట్ కావాల్సి వచ్చింది.

25
భరణితో డాన్సు చేయడంపై ట్రోల్స్.. మాధురి ఫైర్‌

ఇక బిగ్ బాస్ షో నుంచి బయటకు వచ్చిన దివ్వెల మాధురి పలు మీడియా సంస్థలు, యూట్యూబ్ ఛానెల్స్ తో మాట్లాడింది. అందులో భాగంగా ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. జర్నలిస్ట్ జాఫర్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె ఫైర్ అయ్యింది. హౌజ్లో భరణితో కలిసి డాన్సు చేయడం అశ్లీలంగా ఉందని సోషల్ మీడియాలో ట్రోల్స్ అయన నేపథ్యంలో ఇదే విషయాన్ని ప్రశ్నించారు జాఫర్. దీంతో ఆమె మండి పడింది. భరణితో డాన్స్ చేయడంలో అశ్లీలం ఏముందంటూ ప్రశ్నించింది. తాను ఆయన్ని పట్టుకుని, హగ్ చేసుకొని డాన్సు చేయలేదని, నాగార్జున చెప్పినందువల్లే డాన్స్ వేయాల్సి వచ్చిందని తెలిపింది. దాన్ని ఎవరూ కాదనరని, అది దీపావళి పండగ సందర్భంగా చేసిందని వెల్లడించింది. అందులో తప్పేముందని ఆమె ప్రశ్నించింది.

35
వాడు అమ్మకే పుట్టలేదుః మాధురి

ఇలా తనని ట్రోల్ చేసిన వాడు అమ్మకే పుట్టలేదు. వాడు ఎవడో నాకు తెలియదు, వాడైతే అమ్మకే పుట్టలేదు. ఎవడికి పుట్టాడో కూడా తెలియదు, అంతటి నీచాతి నీచంగా చేసిన వాడు నా దృష్టిలో మనిషే కాదంటూ మండిపడింది. భరణితో డాన్స్ చేయడాన్ని ఎందుకు రిజెక్ట్ చేయలేదని ప్రశ్నించగా, ఎందుకు రిజెక్ట్ చేస్తాను, నాగార్జున చెప్పాక అలా కుదరదని, అయినా చేయి చేయి పట్టుకుని డాన్సు చేయమంటే, హగ్ చేసుకుని డాన్సు చేయమంటే రిజెక్ట్ చేసేదాన్ని అని తెలిపింది మాధురి. దీనిపై దువ్వాడ శ్రీనివాస్ కూడా స్పందించారు. మాధురి ఏంటో నాకు తెలుసు, నేనేంటో ఆమెకి తెలుసు, మధ్యలో ఎవరో ఒకడు తొక్కలో కామెంట్ చేశాడని, ట్రోల్ చేస్తే పట్టించుకోనని తెలిపారు.

45
నాగబాబు వల్లే భరణి రీఎంట్రీ

ఈ సందర్భంగా భరణి రీఎంట్రీపై హాట్ కామెంట్ చేసింది మాధురి. నాగబాబు వల్లే ఆయన హౌజ్లోకి వచ్చినట్టు తెలిపింది. వెనకాల డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఉన్నారు, వారి సపోర్ట్ తోనే, వారి ఒత్తిడితోనే ఆయన్ని మళ్లీ హౌజ్లోకి తీసుకొచ్చారని వెల్లడించింది. ఒక్కసారి ఆడియెన్స్ ఓట్ల ద్వారా ఎలిమినేట్ అయినవాడు, మళ్లీ ఆడియెన్స్ ఓట్లతో ఎలా హౌజ్లోకి వస్తారని మాధురి ప్రశ్నించింది. ఈ సందర్భంగా తనూజ, భరణిని నాన్న అని పిలవడంపై స్పందిస్తూ, ప్రపంచంలో నాన్న అని కూతురు, కొడుకు మాత్రమే పిలుస్తారని స్పష్టం చేసింది. కానీ ఎవరు పడితే వాళ్లు నాన్న అని పిలవరని తెలిపింది. అమ్మ అని కామన్ గా పిలుస్తారని, కానీ నాన్న విషయంలో అలా పిలవడం కరెక్ట్ కాదని, అది తనకు తప్పు అనిపించింది, అందుకే తనూజకి చెప్పినట్టు వెల్లడించింది మాధురి. తాను చెప్పాలనుకున్నది చెప్పాను, కానీ వాళ్లు ఇప్పటికీ అలానే ఉంటున్నారు. అది వాళ్ల ఇష్టమని చెప్పింది మాధురి.

55
రీతూ, పవన్‌ రిలేషన్‌ ఫేక్‌

బిగ్‌ బాస్‌ అనుభవాలను, బయటకు రావడానికి సంబంధించిన మాధురి స్పందిస్తూ, ఫుడ్‌ సరిగా అందలేదని, బయట నా మనుషులు ఎలా ఉన్నారనే టెన్షన్‌ ఉందని, ఇవన్నీ క్యారీ చేస్తూ హౌజ్‌లో ఉండటం చాలా టఫ్‌ అనిపించిందని తెలిపింది. రీతూ, డీమాన్‌ పవన్‌ల రిలేషన్‌ కూడా ఫేక్‌ అని, వాళ్లు ఓటింగ్‌ కోసం గేమ్‌ ఆడుతున్నారని తెలిపింది. అలాగే భరణి, దివ్యలది కూడా ఫేక్‌ రిలేషన్‌ అని తెలిపింది. మిగిలిన వారు ఎవరి గేమ్‌ వాళ్లు ఆడుతున్నారని తెలిపింది మాధురి. అంతేకాదు బిగ్‌ బాస్‌ పై సంచలన కామెంట్‌ చేసింది. ఓటింగ్‌ ప్రకారం అయితే ఎలిమినేషన్‌ జరగడం లేదని, వాళ్లకి నచ్చిన వాళ్లని ఉంచుతున్నారు, నచ్చని వాళ్లని పంపిస్తున్నారని ఆరోపించింది. ఇప్పుడు ఆమె కామెంట్స్ వైరల్‌ అవుతున్నాయి. 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories