Puneeth rajkumar death:అప్పు నుండి రాజకుమార్ వరకు పునీత్ రాజ్ కుమార్ నటించిన 8బెస్ట్ మూవీస్

First Published Oct 29, 2021, 6:04 PM IST

1985లో చైల్డ్ ఆర్టిస్ట్ గా ఆయన ప్రధాన పాత్రలో తెరకెక్కిన బెట్టాడ హోవు చిత్రానికి ఉత్తమ బాలనటుడిగా జాతీయ అవార్డు అందుకున్నారు. 1989లో విడుదలైన పరశురామ్ చైల్డ్ ఆర్టిస్ట్ గా Puneeth rajkumar కి చివరి చిత్రం.

పునీత్ కుమార్ ని హీరోగా లాంఛ్ చేసే బాధ్యత దర్శకుడు పూరి జగన్నాధ్ చేతిలో పెట్టారు తండ్రి రాజ్ కుమార్. ఆయన నమ్మకాన్ని నిజం చేస్తూ... పునీత్ రాజ్ కుమార్ కు బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ఇచ్చాడు పూరి. తెలుగులో రవితేజ హీరోగా వచ్చిన ఇడియట్ చిత్రానికి అప్పు అధికారిక రీమేక్. వసూళ్ల వర్షం కురిపించిన Appu,థియేటర్స్ లో 200 రోజుల రన్ పూర్తి చేసుకొని, అనేక కొత్త రికార్డ్స్ నెలకొల్పింది.
 

అభి ఆ ఏడాది విడుదలైన చిత్రాలలో అతిపెద్ద కమర్షియల్ హిట్స్‌లో ఒకటి, బాక్సాఫీస్ వద్ద రూ. 16 కోట్లు వసూలు చేసింది Abhi. ఒక హిందూ అబ్బాయి ముస్లిం అమ్మాయితో ప్రేమలో పడటం, వారి ప్రేమను పెద్దలు వ్యతిరేకించడం నేపథ్యంలో ఈ మూవీ తెరకెక్కింది. 

పునీత్ రాజ్ కుమార్ హీరోగా,  మహేష్ బాబు దర్శకత్వం వహించిన అరసు చిత్రంలో రమ్య, మీరా జాస్మిన్ హీరోయిన్స్ గా నటించారు. Arasu పునీత్ రాజ్ కుమార్ కెరీర్ లో అతిపెద్ద హిట్స్ లో ఒకటిగా ఉంది. 


ప్రకాష్ దర్శకత్వం వహించిన రొమాంటిక్ డ్రామా చిత్రం ‘మిలనా’లో పార్వతి మీనన్, పూజా గాంధీ హీరోయిన్స్ గా నటించారు. మిలానా కూడా పునీత్ కెరీర్‌లో అత్యంత విజయవంతమైన చిత్రాలలో ఒకటిగా పరిగణించబడుతుంది. Milana దాదాపు 50  థియేటర్లలో 100 రోజులకు పైగా ప్రదర్శించబడింది.


దర్శకుడు మెహర్ రమేష్ డైరెక్షన్ లో తెరకెక్కిన యాక్షన్ ఎంటర్టైనర్ అజయ్.  ఈ చిత్రంలో పునీత్ సరసన హీరోయిన్ గా అనురాధ మెహతా నటించింది. మంచి విజయాన్ని దక్కించుకున్న అజయ్,Mahesh babu ఒక్కడు చిత్రానికి అధికారిక రీమేక్. 


2010లో విడుదలైన జాకీ చిత్రంలో  పునీత్, భావన హీరో హీరోయిన్స్ గా నటించారు. దునియా సూరి దర్శకత్వం వహించిన ఈ చిత్రం సౌత్ ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్‌లో ఉత్తమ చిత్రంగా ఎంపికైంది.

పునీత్, శ్రీనగర్ కిట్టి, యోగేష్, రాధిక పండిట్ ప్రధాన పాత్రల్లో నటించిన మల్టీ-స్టారర్ హుడుగారు. కె మాదేష్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం 2010లో విడుదలైన తమిళ చిత్రం ‘నాడోడిగల్’ రీమేక్, ఈ చిత్రానికి పునీత్ రెండు అవార్డులను గెలుచుకున్నారు - ఫిల్మ్‌ఫేర్ అవార్డుతో పాటు కన్నడ SIIMA ఉత్తమ నటుడు అవార్డు దక్కించుకున్నారు. 


పునీత్ నటించిన మరొక యాక్షన్ఎంటర్టైనర్ రాజకుమార్. ఈ చిత్రంలో పునీత్ కి జంటగా ప్రియా ఆనంద్‌ నటించారు. rajakumar చిత్రానికి సంతోష్ ఆనంద్ రామ్ దర్శకత్వం వహించారు. ఆరు వారాల్లో మల్టీప్లెక్స్‌లో 6000 షోలు పూర్తి చేసిన తొలి చిత్రంగా రాజకుమార్ నిలిచింది. 

Also read Puneeth rajkumar death:పునీత్ రాజ్ కుమార్ గురించి మీకు తెలియని అరుదైన విషయాలు!

Also read Puneeth rajkumar death:గుండె బద్దలైందన్న ఎన్టీఆర్... పునీత్ రాజ్ కుమార్ కోసం పాడిన పాట ఏంటంటే?

click me!