Puneeth rajkumar death:పునీత్ రాజ్ కుమార్ గురించి మీకు తెలియని అరుదైన విషయాలు!

Published : Oct 29, 2021, 05:22 PM ISTUpdated : Oct 29, 2021, 05:29 PM IST

పునీత్ రాజ్ కుమార్ నేడు హఠాన్మరణం పొందారు. ఈ మల్టీ టాలెంటెడ్ నటుడు 46 ఏళ్ల అతి తక్కువ ప్రాయంలో మరణించడం విధి వైపరీత్యం.  

PREV
16
Puneeth rajkumar death:పునీత్ రాజ్ కుమార్ గురించి మీకు తెలియని అరుదైన విషయాలు!
puneeth rajkumar

ఫిట్నెస్ అంటే శ్రద్ధ కలిగిన పునీత్ రాజ్ కుమార్ నేడు ఉదయం జిమ్‌లో వర్కౌట్స్ చేస్తుండగా గుండెపోటుకు గురయ్యారు. దీంతో హుటాహుటిన బెంగుళూరులో విక్రమ్‌ ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన తుదిశ్వాస విడిచారు. ఈ విషయాన్ని ఆసుపత్రి వర్గాలు ధృవీకరించాయి. Puneeth rajkumar మరణవార్త దేశవ్యాప్తంగా ఉన్న ఆయన అభిమానులను, చిత్ర ప్రముఖులను దిగ్బ్రాంతికి గురిచేసింది. 


 

26


పునీత్ రాజ్‌కుమార్ అసలు పేరు లోహిత్, 1976లో విడుదలైన 'ప్రేమద కనికే' చిత్రంతో చైల్డ్ ఆర్టిస్ట్‌గా అరంగేట్రం చేసాడు.తండ్రి Rajkumar చిత్రాలతో పాటు అనేక చిత్రాలలో బాలనటుడిగా నటించాడు.


 

36


పునీత్ 2002లో అప్పు మూవీతో హీరోగా పరిచయం అయ్యాడు. దర్శకుడు పూరి జగన్నాధ్ తెరకెక్కించిన Appu చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది.   KGF మేకర్స్ తో చేసిన 'యువరత్న' ఆయన వెండితెరపై కనిపించిన చివరి చిత్రం. ఈ మూవీ సైతం మంచి విజయాన్ని నమోదు చేసుకుంది. 


 

46

పునీత్ రాజ్‌కుమార్ హీరోగా మారక ముందు మాస్టర్ లోహిత్‌గా 16 చిత్రాలకు పైగా పనిచేశారు. చైల్డ్ ఆర్టిస్ట్ గా 1985లో  బెట్టాడ హూవు చిత్రానికి ఉత్తమ బాల నటుడిగా ప్రతిష్టాత్మక జాతీయ అవార్డును కూడా గెలుచుకున్నాడు. 

56

పునీత్ రాజ్ కుమార్ తన కజిన్ పూర్ణిమ మరియు నటుడు హొన్నవల్లి నుండి నటన నేర్చుకున్నాడు. అతను ప్రాథమిక విద్యకోసం కూడా స్కూల్ కి వెళ్ళలేదు. పునీత్ ప్రొఫెషనల్ సింగర్, అలాగే మంచి డాన్సర్. 


 

66


పవర్ స్టార్ పునీత్ కుమార్ బిరుదు. ముద్దుగా ఫ్యాన్స్ అప్పు అని పిలుచుకుంటారు. పునీత్ కి ఇష్టమైన పాట మిథూన్ చక్రవర్తి 'ఐ యామ్ ఎ డిస్కో డ్యాన్సర్'.  భార్య అశ్వినిని కామన్ ఫ్రెండ్ ద్వారా కలుసుకున్న పునీత్ ప్రేమలో పడ్డారు. వీరిద్దరూ 1999లో వివాహం చేసుకున్నారు. ఆయనకు ఇద్దరు కుమార్తెలు.  పునీత్ రాజ్‌కుమార్ టెలివిజన్ వ్యాఖ్యాతగా మారాక ఫ్యామిలీ ఆడియన్స్ లో పాపులారిటీ తెచ్చుకున్నారు.

Also read Puneeth rajkumar death:గుండె బద్దలైందన్న ఎన్టీఆర్... పునీత్ రాజ్ కుమార్ కోసం పాడిన పాట ఏంటంటే?

Also read Puneeth rajkumar death:పునీత్ రాజ్ కుమార్ కి బాగా నచ్చిన తెలుగు పాట..ఆర్జీవీ సినిమా అని గుర్తుపట్టేశాడు

click me!

Recommended Stories