puneeth rajkumar death; రియల్‌ పవర్‌స్టార్‌గా పునీత్‌ ఎదగడానికి కారణాలివే.. తెలిస్తే ఫ్యాన్‌ అయిపోతారు..

First Published Oct 29, 2021, 5:50 PM IST

కన్నడ పవర్‌ స్టార్‌ పునీత్‌ రాజ్‌కుమార్‌ మరణం యావత్‌ ఇండియన్‌ సినిమాని షాక్‌కి గురి చేసింది. 46ఏళ్ల వయసున్న పునీత్‌ గుండెపోటుకి గురికావడం ఇప్పుడు అందరిని దిగ్ర్భాంతికి గురి చేస్తుంది. అయితే పునీత్‌ పవర్‌స్టార్‌గా ఎదగడానికి గల కారణాలు ఇప్పుడు హైలైట్‌గా నిలుస్తున్నాయి. 
 

పునీత్‌ రాజ్‌కుమార్‌(Puneeth Rajkumar).. కన్నడ కంఠీరవ రాజ్‌కుమార్‌(Raj Kumar) మూడో కుమారుడు. తెలుగులో ఎన్టీఆర్‌ తరహాలోనే కన్నడలో రాజ్‌కుమార్‌ తిరుగులేని ఇమేజ్‌ని,పాపులారిటీని సొంతం చేసుకున్నారు. ఓ సూపర్‌ స్టార్‌ కొడుకు హీరో అంటే కామన్‌గానే ఇమేజ్‌, పాపులారటీ వస్తుంది. తండ్రి లెగసీని అన్న శివరాజ్‌కుమార్‌తో కలిసి మోస్తున్నాడు పునీత్‌. అయితే కన్నడ నాట అగ్ర నటుడిగా వెలుగొందుతున్నా పునీత్‌. ఇప్పుడు అక్కడ ఆయన్ని మించిన స్టార్‌ లేడంటే అది అతిశయోక్తి కాదు. 

రాజ్‌కుమార్‌ కి తగ్గ తనయుడిగా నిలిచాడు Puneeth Rajkumar. ఇమేజ్‌కి తగ్గట్టే ఆయన మొదటి నుంచి చాలా సెలక్టీవ్‌గా సినిమాలు చేశారు. పునీత్‌ చేసిన సినిమాలన్నీ బ్లాకబస్టర్‌గా నిలవడం విశేషం. కన్నడనాట అత్యధిక సక్సెస్‌ రేట్‌ ఉన్న నటుడిగానూ పునీత్‌ నిలిచారు. ఆయన హీరోగా ఎంట్రీ ఇచ్చిన `అప్పు` అక్కడ బ్లాక్‌ బస్టర్‌గా నిలిచింది. తొలి చిత్రంతోనే అందరి దృష్టిని ఆకర్షించి, తండ్రికి తగ్గ తనయుడని నిరూపించుకున్నారు. ఆ తర్వాత కూడా ఆయన శక్తివంతమైన సినిమాలు చేస్తూ వస్తున్నారు. 
 

పునీత్‌ బాలనటుడిగానే రికార్డులు సృష్టించారు. ఆయన దాదాపు 13 సినిమాల్లో బాలనటుడిగా నటిస్తే అందులో `బెట్టడహువా` చిత్రానికిగానూ ఏకంగా జాతీయ అవార్డుని సొంతం చేసుకున్నాడు. దీంతోపాటు `చలిసువా మొదగలు` అనే చిత్రంతో కన్నడ స్టేట్‌ అవార్డుని అందుకున్నారు. ఇలా చాలా వరకు తన తండ్రి రాజ్‌కుమార్ సినిమాల్లో భాగమయ్యాడు బాలనటుడిగానే సూపర్‌ స్టార్‌ ఇమేజ్‌ని సొంతం చేసుకున్నాడు పునీత్‌. బాలనటుడికి ఈ స్థాయిలో ఇమేజ్‌ రావడం, దాన్ని సొంతం చేసుకోవడం పునీత్‌కే సాధ్యమైంది. మరోవైపు ఆయన బాలనటుడిగానే అత్యధిక పారితోషికం అందుకున్న నటుడిగా నిలవడం మరో విశేషం. 
 

దీనికితోడు పునీత్‌ హీరోగా 29 సినిమాల్లో హీరోగా నటిస్తే, అందులో తొమ్మిది సినిమాలకు ఉత్తమ నటుడిగా అవార్డులు అందుకున్నారు. ఇక ఓ సూపర్‌ స్టార్‌ అయి ఉండి టీవీ షోస్‌ చేయడం చాలా తక్కువ.కానీ పునీత్ ఇమేజ్‌కి అతీతంగా టీవీ షోస్‌ చేశారు. మూడో షోలకు గెస్ట్ గా, ఓ షోకి జడ్జ్ గా, ఆరు షోలకు గెస్ట్ గా పాల్గొన్నారు. `నేట్రావతి` అనే షోని ప్రొడ్యూస్‌ కూడా చేశారు. దీంతోపాటు నాలుగు సినిమాలకు నరేటర్‌గా వ్యవహరించారు. నిర్మాతగా నాలుగు సినిమాలు నిర్మించారు.

పునీత్‌ స్టయిల్‌కి ఐకాన్‌గా నిలుస్తుంటారు. కన్నడ నాట స్టయిలీష్‌ స్టార్‌గానూ పేరుతెచ్చుకున్నారు. ఆయన్ని అభిమానులు ఫాలో అయ్యేవారంటే అతిశయోక్తి కాదు. మరోవైపు అద్భుతమైన యాక్టింగ్‌తో మెప్పించడం ఆయన ప్రత్యేకంగా. తన సినిమాల్లో అన్ని ఎలిమెంట్స్ ఉండేలా చూసుకోవడం ఆయన ప్రత్యేకత. అన్ని వర్గాల ఆడియెన్స్ తన సినిమాలు చూడాలనేది ఆయన అభిమతం. అందుకే పునీత్‌కి కేవలం యూత్‌లో మాత్రమేకాదు సాధారణ ఆడియెన్స్ లోనూ ఫ్యాన్స్ ఉన్నారు. అమ్మాయిల ఫాలోయింగ్‌ కూడా పెద్దదే. 

పునీత్‌ సూపర్‌స్టార్‌ అయినా డౌ టూ ఎర్త్ పర్సన్. ఇమేజ్‌కి అతీతంగా వ్యవహరించడం, బిహేవ్‌ చేయడం ఆయన గొప్పతనానికి నిదర్శనం. చిన్నా, పెద్ద ఎవరికైనా తనని కలిస్తే ఎంతో ఆప్యాయంగా తనో స్టార్‌ అనే విషయాన్ని మర్చిపోయి రెస్పెక్ట్ ఇస్తారని మన తెలుగు మేకర్స్ చెప్పడం విశేషం. అందుకే ఆయన పవర్‌స్టార్‌ అయ్యారని అంటున్నారు. మంచి మనసున్న వ్యక్తి అని ఆయన మరణం తీరని లోటని అంటున్నారు. ఆయన్ని powr star చేయడంలో ఆయన గొప్ప హృదయం కూడా ఓ కారణమంటున్నారు అభిమానులు. 
 

ఇవన్నీ ఓ ఎత్తైతే, పునీత్‌ రాజ్‌కుమార్‌ సేవా కార్యక్రమాలు మరో ఎత్తు. ఆయన ప్రజల గుండెల్లో స్టార్‌గా నిలవడానికి ఆయన చేసిన సేవా కార్యక్రమాలే కారణమంటున్నారు కన్నడ ప్రజలు. పునీత్‌ రాజ్‌ కుమార్‌ సినిమాలకు అతీతంగా సేవా కార్యక్రమాలు నిర్వహించేవారట. అనాథశ్రమాలు, స్కూల్స్ నిర్వహిస్తున్నారట. పేద విద్యార్థులకు ఉచితంగా విద్యని అందిస్తున్నారట. పునీత్‌ 26 అనాథాశ్రమాలను నిర్వహిస్తున్నారట. 25 స్కూల్స్ నడిపిస్తున్నాట. 15 వృద్ధాశ్రమాలు రన్‌ చేస్తున్నారని కన్నడ మీడియా నుంచి తెలుస్తుంది. 
 

వీటితోపాటు 19 గోశాలలను నిర్వహిస్తున్నారట. దాదాపు 1800 మంది పేద విద్యార్థులకు విద్యనందిస్తున్నారట. మైసూర్‌లో బాలికా విద్యార్థినుల సంరక్షణ చూసుకుంటున్నారట. అందుకోసం `శక్తిధామ` పేరుతో ఓ సంస్థని నడిపిస్తున్నారట పునీత్‌ రాజ్‌కుమార్‌. వీటితోపాటు కర్నాటకలో 32 గ్రామాలను దత్తత అందుకే ఆయన రియల్‌ పవర్ స్టార్‌ అయ్యారని అంటున్నారు ఆయన అభిమానులు. ఇవన్నీ తెలిస్తే చేతులెత్తి మొక్కుతారని అంటున్నారు. 

హీరోగా దాదాపు 29 సినిమాల్లో నటించారు. `అభి`, `వీర కన్నడిగ`, `మౌర్య`, `ఆకాష్‌`, `నమ్మ బసవ`, `అజయ్‌`, `అరసు`, `మిలన`, `బిందాస్‌`, `రాజ్‌`, `పృథ్వీ`, `జాకీ`, `హంగామా`, `అన్న బాండ్‌`, `పవర్‌`, `రానా విక్రమ`, `చక్రవ్యూహ`,`దొడ్మనె హగ్డ్`, `రాజకుమార`, `అంజని పుత్ర` చిత్రాలతో పవర్‌ స్టార్‌గా ఎదిగారు. `చివరిగా ఆయన `యువరత్న` చిత్రంలో నటించారు. ఇది మంచి విజయం సాధించింది. ప్రస్తుతం `జేమ్స్`, `ద్విత్వ` చిత్రాల్లో నటిస్తున్నారు.

related news: Puneeth rajkumar death:పునీత్ రాజ్ కుమార్ గురించి మీకు తెలియని అరుదైన విషయాలు!

also read: Puneeth rajkumar death:పునీత్ రాజ్ కుమార్ కి బాగా నచ్చిన తెలుగు పాట..ఆర్జీవీ సినిమా అని గుర్తుపట్టేశాడు

click me!