Puneeth rajkumar death:పునీత్ రాజ్ కుమార్ కి బాగా నచ్చిన తెలుగు పాట..ఆర్జీవీ సినిమా అని గుర్తుపట్టేశాడు

First Published Oct 29, 2021, 4:14 PM IST

ఎంతో ఆరోగ్యంగా, ఎనెర్జిటిక్ గా కనిపించే పునీత్ గుండెపోటుతో మరణించాడు అంటే ఊహించని పరిణామం అంటున్నారు. గురువారం 9:45 గంటలకు పునీత్ గుండె పోటుకు గురికావడంతో కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించారు.

అత్యంత దిగ్భ్రాంతికర వార్తతో కన్నడ సినీ అభిమానులు శోకసంద్రంలో మునిగిపోయారు. యావత్ సినీ లోకం ఈ షాక్ నుంచి ఇంకా తేరుకోలేదు. ఎంతో ఎనెర్జిటిక్ గా తన చిత్రాలతో అలరిస్తున్న కన్నడ సూపర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ నేడు ఆకస్మిక మరణం చెందడం ఏమాత్రం జీర్ణించుకోలేని విషయం. పునీత్ మరణ వార్తతో ఆయన అభిమానులు కన్నీటి పర్యంతం అవుతున్నారు. 

సెలెబ్రిటీలు సోషల్ మీడియా వేదికగా సంతాపం తెలియజేస్తున్నారు. కానీ అందరూ నమ్మశక్యం కానీ వార్తే అని అంటున్నారు. ఎంతో ఆరోగ్యంగా, ఎనెర్జిటిక్ గా కనిపించే పునీత్ గుండెపోటుతో మరణించాడు అంటే ఊహించని పరిణామం అంటున్నారు. గురువారం 9:45 గంటలకు పునీత్ గుండె పోటుకు గురికావడంతో కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించారు. విషమ పరిస్థితుల్లో ఆసుపత్రిలో చేరిన మరణించినట్లు వైద్యులు తెలిపారు. 

తన తండ్రి నట వారసత్వాన్ని పునీత్ దిగ్విజయంగా కొనసాగిస్తూ శాండల్ వుడ్ లో స్టార్ గా ఎదిగాడు. పునీత్ కు టాలీవుడ్ లో మంచి స్నేహితులు ఉన్నారు. తెలుగు సినిమాలని కూడా పునీత్ ఎక్కువగా ఫాలో అవుతుంటారు. రాంచరణ్, అల్లు అర్జున్, ఎన్టీఆర్ లతో పునీత్ కు మంచి సాన్నిహిత్యం ఉంది. పునీత్ రాజ్ కుమార్ నటుడు మాత్రమే కాదు.. ఆయనలో మంచి గాయకుడు కూడా ఉన్నాడు. 

యువరత్న చిత్ర ప్రమోషన్స్ లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పునీత్ తనకు బాగా నచ్చిన తెలుగు పాటని గుర్తు చేసుకున్నాడు. యాంకర్ రిక్వస్ట్ మేరకు అద్భుతంగా పాడాడు కూడా. పునీత్ కి బాగా నచ్చిన తెలుగు సాంగ్ క్షణక్షణం చిత్రంలోని 'జామురాతిరి జాబిలమ్మ'. అది ఆల్ టైం క్లాసిక్ సాంగ్స్ లో ఒకటి. చాలా మందికి ఫేవరిట్ సాంగ్ కూడా. ఆ పాటని పాడిన తర్వాత తెలుగులో ఇంకా మంచి సాంగ్స్ ఉన్నాయని పునీత్ కామెంట్ చేశాడు. 

ఆ సాంగ్ వివరాలని కూడా పునీత్ గుర్తుపట్టాడు. ఈ సాంగ్ ఆర్జీవీ సర్ తెరకెక్కించిన క్షణక్షణం చిత్రంలోనిది కదా.. వెంకటేష్ సర్, శ్రీదేవి మేడమ్ నటించారు కదా అంటూ ఆ సినీ వివరాలు తెలిపాడు. తెలుగులో ఎవరైనా ఛాన్స్ ఇస్తే సాంగ్ పాడాలని ఉన్నట్లు కూడా పునీత్ పేర్కొన్నాడు. 

తెలుగుతో పునీత్ కు విడదీయరాని సంబంధం ఉంది. తెలుగు దర్శకుడు వీర శంకర్ పునీత్ తో తెరక్కించిన 'నమ్మ బసవ' చిత్రం కన్నడనాట అఖండ విజయం సాధించింది ఆ చిత్రం 175 రోజులు దిగ్విజయంగా ప్రదర్శించబడి పునీత్ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్స్ లో ఒకటిగా నిలిచింది. 

click me!