ఈ విషయాన్ని ఓ సందర్భంలో అక్కినేని వారు చెప్పుకొచ్చారు. నాకు ఇష్టం లేదు కానీ డైరెక్టర్‌గారు కల్యాణ్ కేరెక్టర్ గురించి చెప్పి, ఆ పాట ఉంటే బాగుంటుందన్నారు. తీసిన తర్వాత బాగాలేకపోతే.. సినిమాలో ఆ పాట పెట్టకుండా పక్కన పెడదాం అని హామీ ఇచ్చారు. దర్శకుడు చెప్పింది వినాలి కనుక.. కాదనలేకపోయాను.. కాని వారు చెప్పినట్టు ఆపాట అంత అద్భుతం చేసింది. అదొక్కటే కాదు.. ఈసినిమాలో పాటలన్నీ సూపర్ హిట్ అయ్యాయి అన్నారు ఏఎన్నార్.