Nagavamsi: సినిమా కలెక్షన్లపై నిర్మాత నాగవంశీ బోల్డ్ కామెంట్ చేశారు. సినిమా కలెక్షన్లకి సంబంధించి పోస్టర్ పై ప్రకటించే లెక్కలు నిజం కావని, అవన్నీ ఎక్కువ చేసి వేసినవే అని ఆయన చెప్పారు.
నిర్మాత నాగవంశీ.. సంచలనాలకు, వివాదాలకు కేరాఫ్. మోస్ట్ వైరల్ ప్రొడ్యూసర్ అంటే ఆయనే అని చెప్పొచ్చు. ఆయన మీడియా ముందుకు వచ్చాడంటే వైరల్ అయిపోవాల్సిందే. బోల్డ్ గా కామెంట్లు చేస్తూ వైరల్ అవుతుంటాడు. అదే సమయంలో ట్రోల్స్ కి గురవుతుంటాడు. ఈ క్రమంలో ఇప్పుడు మరోసారి ఆయన బోల్డ్ స్టేట్‌మెంట్స్ ఇచ్చాడు. సినిమా కలెక్షన్ల గుట్టు రట్టు చేశాడు. అదే సమయంలో సినిమాకి సంబంధించిన కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ గురించి ఓపెన్ అయ్యాడు. తప్పు ఎవరిదో బయటపెట్టాడు. తమ తప్పు లేదనే విషయాన్ని ఆయన చెప్పడం గమనార్హం.
24
కలెక్షన్లన్నీ ఫేకే
పోస్టర్‌పై వేసే కలెక్షన్లు నిజం కాదని చెప్పేశాడు. అవి కచ్చితంగా ఇన్‌ఫ్లూయెన్స్ అయినవే అని, ప్రతి ఒక్కరు అలానే చేస్తారని, ఒరిజినల్ నెంబర్స్ ఎవరూ వేయరని చెప్పారు. అభిమానుల కోసం, వారి ఆనందం కోసం ఇలా పోస్టర్ పై ఎక్కువ కలెక్షన్లు వేస్తారని వెల్లడించాడు. హీరోల అభిమానులను హ్యాపీ చేయడానికి ఇలాంటివి తప్పదని వెల్లడించాడు నాగవంశీ. అదే సమయంలో ఇన్‌కమ్ ట్యాక్స్ ప్రాబ్లమ్ రాదా అనే ప్రశ్నకి ఆయన స్పందిస్తూ, తాము వేసే పోస్టర్ లెక్కలు ఫేక్ అని, అవి నిజం కాదని వాళ్లకి కూడా తెలుసు అని ఓపెన్ స్టేట్‌మెంట్ ఇచ్చారు. అందుకే ఐటీ వాళ్లు కూడా ఈ లెక్కలను నమ్మరు అని చెప్పడం విశేషం. ఫేక్ కలెక్షన్లని కరెక్ట్ చేయాల్సిన అవసరం లేదని, దాన్ని ఎవరూ పట్టించుకోరని చెప్పారు.
34
ట్రోల్స్ పై నాగవంశీ కామెంట్
అయితే తాను సినిమా రిలీజ్‌కి ముందు మీడియాతో మాట్లాడినప్పుడు సినిమాపై హైప్ కోసం కొన్ని మాట్లాడాల్సి వస్తుందని, జర్నలిస్ట్ లు గిల్లే ప్రశ్నలు అడగడంతో వాళ్లకి అదే స్థాయిలో సెటైరికల్ గా సమాధానం చెబుతానని, దాన్ని వాళ్లు వైరల్ చేస్తున్నారని, ట్రోల్ చేస్తున్నారని చెప్పాడు. అదేసమయంలో తాను మాట్లాడే మాట తీరుని బట్టే సినిమా ఆడుతుందా లేదా అనేది తెలిసిపోతుందని, అభిమానులు, ఆడియెన్స్ ఫిక్స్ అవుతారని వెల్లడించారు.
సినిమా కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ పెరగడంపై నాగవంశీ క్రేజీ రియాక్షన్స్
సినిమా ఖర్చులు(కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్) పెరిగే దాని గురించి చెబుతూ, ఒకప్పుడు సినిమాకి డబ్బింగ్ మార్కెట్, ఓటీటీ మార్కెట్ బాగా పెరిగింది. వాటి ద్వారా డబ్బులు రావడంతో హీరోలు పారితోషికాలు పెంచారు. దీంతో కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ పెరిగింది. కానీ ఇప్పుడు ఆ మార్కెట్ లేదు. బాగా తగ్గిపోయింది. ఓటీటీ వాళ్లు రూల్స్ పెడుతున్నారు. అదే సమయలో డబ్బింగ్ మార్కెట్ కూడా లేదు. నిర్మాతకి ఇన్‌కమ్ తగ్గింది, కానీ పారితోషికం, ప్రొడక్షన్ కాస్ట్ తగ్గలేదు. దీనికితోడు థియేటర్‌కి వచ్చే ఆడియెన్స్ కూడా తగ్గిపోయారు. దీంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. దీంతో సినిమాలు ఆడినా కూడా నిర్మాతకు డబ్బులు రావడం లేదని చెప్పాడు. అయితే ఫెడరేషన్ రూల్స్ బాగా ఇబ్బందికరంగా ఉన్నాయని, హీరోలు కూడా పారితోషికాల విషయంలో రాజీపడుతున్నారని, కానీ ఫెడరేషన్ వాళ్లు మాత్రం తగ్గడం లేదని చెప్పాడు. ఇది కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ పెరగడానికి కారణవుతుందని చెప్పాడు నాగవంశీ. ఆయన రా టాక్స్ వంశీతో మాట్లాడుతూ ఈ విషయాలను పంచుకున్నాడు నాగవంశీ. ఆయన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.