డైరెక్టర్‌గా అందరికీ తెలిసిన లోకేష్, హీరోగా ఎలా ఉంటాడో అనే డౌట్ సినిమాకు ముందు అందరిలోనూ ఉండేది. కానీ, సినిమా చూశాక ఆయన నటన అందరినీ ఆశ్చర్యపరిచింది. ముఖ్యంగా, అనుభవం ఉన్న నటులతో కలిసి నటించిన సీన్లలో కూడా లోకేష్ తన పాత్రను అద్భుతంగా పోషించాడని అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు. దీంతో, భవిష్యత్తులో లోకేష్ నటనపై కూడా ఫోకస్ పెడతాడేమో అనే ఆసక్తి మొదలైంది. సినిమా మేకింగ్, యాక్టింగ్, మ్యూజిక్ ఇలా అన్నింటికీ పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది.