తన కూతురి కంటే చిరంజీవిని ఎక్కువగా ప్రేమించిన నిర్మాత.. ఒక్క సినిమాతో కోలుకోలేని దెబ్బ, చివరి రోజుల్లో..

Published : Nov 26, 2025, 04:41 PM IST

ఎన్ని విజయాలు సాధించినా ఒక సినిమా పరాజయం చెందితే చాలు నిర్మాత పరిస్థి తలకిందులు అవుతుంది. చిరంజీవితో ఎన్నో సూపర్ హిట్ చిత్రాలని నిర్మించిన ప్రముఖ నిర్మాత చివరి రోజుల్లో తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొన్నారు. 

PREV
15
చిరంజీవి అంటే అభిమానం 

మెగాస్టార్ చిరంజీవితో సినిమా నిర్మించడానికి నిర్మాతలు ఎగబడేవారు. అప్పటి చిరంజీవి హీరోగా నటిస్తే సినిమా హిట్, లాభాలు గ్యారెంటీ అన్నట్లుగా పరిస్థితి ఉండేది. చిరంజీవితో ఎక్కువ చిత్రాలు నిర్మించిన నిర్మాతల్లో దేవి వరప్రసాద్ ఒకరు. ఆయనకి చిరంజీవి అంటే ఎంతో అభిమానం అట. 

25
చిరంజీవి, దేవి వరప్రసాద్ సినిమాలు 

చిరంజీవి, దేవి వరప్రసాద్ కాంబినేషన్ లో  చట్టంతో పోరాటం నుంచి అల్లుడా మజాకా వరకు అనేక సూపర్ హిట్ చిత్రాలు వచ్చాయి. చట్టంతో పోరాటం, కొండవీటి రాజా, మంచి దొంగ, ఘరానా మొగుడు, అల్లుడా మజాకా, మృగరాజు లాంటి చిత్రాలు వీరి కాంబినేషన్ లో తెరకెక్కాయి. ఇంతటి భారీ చిత్రాలు తీసిన దేవి వరప్రసాద్ చివరి రోజుల్లో ఆర్థిక సమస్యలతో దుర్భర జీవితం గడుపుతూ మరణించారు. 

35
కూతురి కంటే చిరంజీవిపైనే ఎక్కువ ప్రేమ 

దేవి వరప్రసాద్ గురించి ప్రముఖ నిర్మాత కాట్రగడ్డ ప్రసాద్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తన కూతురు కంటే చిరంజీవిని ఎక్కువగా ప్రేమించిన నిర్మాత దేవి వరప్రసాద్. కానీ చివరి రోజుల్లో ఆయన సమస్యల్లో ఉన్నప్పుడు ఎవరూ పట్టించుకోలేదు. ఆయన అమెరికా వెళితే తన కూతురి కోసం ఏం తీసుకుని వెళదాం అనే దానికంటే.. చిరంజీవి కోసం ఏం తీసుకువెళదాం అని ఎక్కువగా ఆలోచించేవారు. 

45
చిరంజీవిపై విమర్శలు 

అలాంటి వ్యక్తికి చివరి రోజుల్లో కష్టం వస్తే ఎవరూ పట్టించుకోలేదు అంటూ పరోక్షంగా చిరంజీవిపై విమర్శలు చేశారు. దేవి వరప్రసాద్ నిర్మించిన ఘరానా మొగుడు చిత్రం సౌత్ లోనే 10 కోట్ల షేర్ వసూలు చేసిన తొలి చిత్రంగా రికార్డు సృష్టించింది. ఆ తర్వాత వచ్చిన అల్లుడా మజాకా కూడా కమర్షియల్ హిట్. అలాంటి నిర్మాతకు ఆర్థిక సమస్యలు ఎందుకు వచ్చాయి అనే సందేహం కలగవచ్చు. 

55
ఇప్పుడున్న హీరోలంతా అలాగే ఉన్నారు 

చిరంజీవితో 2001లో ఆయన నిర్మించిన మృగరాజు చిత్రం దారుణంగా డిజాస్టర్ అయింది. దేవి వరప్రసాద్ కి ఆ చిత్రం తీవ్ర నష్టాలు మిగిల్చింది. ఆ తర్వాత నిర్మించిన భజంత్రీలు చిత్రాలు కూడా ఫెయిల్ అయింది. దీనితో దేవి వరప్రసాద్ సమస్యలు ఎక్కువయ్యాయి. ఫిలిం ఛాంబర్ ద్వారా అప్పట్లో తాము ఆయన్ని ఆదుకున్నాం అని కాట్రగడ్డ ప్రసాద్ తెలిపారు. నిర్మాతలు ఆస్తులు అమ్ముతారు, హీరోలు ఆస్తులు కొంటారు ఇప్పుడు ఇండస్ట్రీలో జరుగుతున్నది ఇదే. నేను ఎవరినీ విమర్శించడం లేదు.. ఇప్పుడు హీరోలంతా అదే విధంగా ఉన్నారు. అప్పట్లో ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణ లాగా నిర్మాత బావున్నాడా లేదా అని ఆలోచించే వారు లేరు అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. 

Read more Photos on
click me!

Recommended Stories