బిగ్ బాస్ తెలుగు 9 విన్నర్‌కి సంబంధించిన చర్చ జరుగుతుంది. ఆన్ లైన్ పోలింగ్ ప్రకారం ఈ సీజన్ విజేత ఎవరో తేలిపోయింది. బిగ్ బాస్ చరిత్రలో మొదటిసారి అరుదైన సంఘటన చోటు చేసుకోబోతుందట.
బిగ్ బాస్ తెలుగు 9 పదకొండు వారాలు పూర్తి చేసుకుంది. డిసెంబర్ మూడో వారం ఈ షో ఫైనల్ జరగబోతుంది. ప్రస్తుతం బిగ్ బాస్ హౌజ్‌లో తనూజ, కళ్యాణ్, సుమన్ శెట్టి, ఇమ్మాన్యుయెల్, భరణి, సంజనా, రీతూ చౌదరీ, డీమాన్ పవన్, దివ్య ఉన్నారు. గత వారం ఎలిమినేషన్ ని నాగార్జున క్యాన్సిల్ చేశారు. దీంతో ఎలిమినేట్ కావాల్సిన దివ్య సేవ్ అయ్యింది. దీంతో బిగ్ బాస్ హౌజ్‌లో ఇప్పుడు తొమ్మిది మంది ఉన్నారు. ఈ వారంలోగానీ, వచ్చే వారంలోగానీ డబుల్ ఎలిమినేషన్ ఉండే అవకాశం ఉంది. కానీ ఇటీవల బిగ్ బాస్ షో మాత్రం ఆసక్తికరంగా సాగుతోంది.
25
ఈ సీజన్ బిగ్ బాస్ తెలుగు 9 విన్నర్ ఎవరు?
ఇదిలా ఉంటే బిగ్ బాస్ తెలుగు 9 గ్రాండ్ ఫినాలే ఇంకా మూడు వారాలే ఉండటంతో ఇప్పుడు విన్నర్‌కి సంబంధించి, టాప్ 5 కంటెస్టెంట్లకి సంబంధించిన చర్చ జరుగుతుంది. ఎవరు టాప్ 5లో ఉంటారు, ఎవరికి విన్ అయ్యే ఛాన్స్ ఉందనేది ఆసక్తికరంగా మారింది. దీనిపై సోషల్ మీడియాలో గట్టిగానే డిస్కషన్ స్టార్ట్ అయ్యింది. పలువురు సోషల్ మీడియాలో పోలింగ్ నిర్వహిస్తున్నారు. ఎవరు విన్ అయ్యే అవకాశం ఉందని, ఎవరు విన్ కావాలని కోరుకుంటున్నారనే పోలింగ్ నిర్వహించగా, ఆశ్చర్యపరిచే ఫలితం కనిపిస్తోంది.
35
తనూజ విన్నర్ ?
సోషల్ మీడియా పోలింగ్ ప్రకారం విన్నర్ ఎవరో తేలిపోయింది. ఆన్‌లైన్ పోలింగ్ ప్రకారం ఈ సీజన్‌లో బిగ్ బాస్ తెలుగు చరిత్రలో మొదటిసారిగా లేడీ కంటెస్టెంట్ విన్నర్ అయ్యే అవకాశం ఉందంటున్నారు. తనూజ ఈ సారి బిగ్ బాస్ విన్నర్ కావాలని చాలా మంది కోరుకుంటున్నారు. ఆ తర్వాత కళ్యాణ్‌కి బిగ్ బాస్ విన్నర్ అయ్యే ఛాన్స్ ఉందని చెబుతున్నారు. వీరిద్దరిలో ఒకరు ఈ సారి విన్నర్ కన్పమ్ అనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఇద్దరు నామినేషన్‌లో ఉన్నప్పుడు కూడా టాప్‌లో ఉన్నారు. అత్యధిక ఓటింగ్‌తో టాప్‌లో దూసుకుపోతున్నారు. ఆడియెన్స్ ఓటింగ్ ప్రకారం ఈ సారి తనూజగానీ, లేదంటే కళ్యాణ్‌గానీ విజేతగా నిలిచే ఛాన్స్ ఉందని టాక్. రెగ్యూలర్ బిగ్ బాస్ షోస్‌లో లేడీ ఇప్పటి వరకు విన్నర్ కాలేదు. కానీ ఓటీటీ షోలో మాత్రం బింధుమాధివి వినజేతగా నిలవడం విశేం. ఈ లెక్కన తనూజ విన్నర్ అయితే ఆమె చరిత్ర సృష్టించబోతుందని చెప్పొచ్చు.
ఇక ఈ సీజన్ టాప్ 5లో నిలిచే కంటెస్టెంట్లు ఎవరనేది కూడా ఆసక్తికరంగా మారిన నేపథ్యంలో సోషల్ మీడియాలో చర్చ ప్రకారం ఈ సారి టాప్ 5 లో నిలిచే కంటెస్టెంట్లు కళ్యాణ్, తనూజ, ఇమ్మాన్యుయెల్, రీతూ చౌదరీ, సంజనా అని అంటున్నారు. అయితే వీరిలో రీతూ, సంజనా స్థానాల్లో సుమన్ శెట్టి, డీమాన్ పవన్‌లు యాడ్ అయ్యే అవకాశం ఉంది. కింది రెండు స్థానాల్లో కన్‌ఫ్యూజన్ ఉన్నా, టాప్ 3 మాత్రం కన్ఫమ్ అంటున్నారు. తనూజ, కళ్యాణ్, ఇమ్మాన్యుయెల్ మధ్యనే టైటిల్ కోసం పోటీ ఉంటుందని మరికొందరు అభిప్రాయపడుతున్నారు. ఇమ్మాన్యుయెల్‌ని విన్నర్‌ని చేసినా ఆశ్చర్యం లేదంటున్నారు. ఏం జరుగుతుందో చూడాలి.
55
రేసులో లేని భరణి
అయితే భరణి టాప్ 5లో నిలుస్తారా? అనే ఆసక్తికర చర్చ కూడా జరుగుతుంది. కానీ రేసులోనే లేరు. భరణి ఈ వారంగానీ, వచ్చే వారం గానీ ఎలిమినేషన్‌కి అవకాశం ఉందంటున్నారు. డబుల్ ఎలిమినేషన్ ఉంటే ఈ వారమే ఆయన హౌజ్‌ని వీడే అవకాశం ఉందని టాక్. మొత్తంగా బిగ్ బాస్ తెలుగు 9 విజేత కామన్ మ్యాన్ అవుతాడా? సెలబ్రిటీ అవుతాడా అనేది చూడాలి. కానీ ఈ సారి సెలబ్రిటీకే ఎక్కువగా ఛాన్స్ ఉందని సమాచారం. నాగార్జున హోస్ట్ గా ఈ షో రన్ అవుతున్న విషయం తెలిసిందే.