మహేష్ బాబు ను టెన్షన్ పెట్టిన వెంకటేష్, సూపర్ స్టార్ ఏమని రిక్వెస్ట్ చేశాడంటే?

Published : Nov 26, 2025, 03:10 PM IST

Mahesh Babu : సూపర్ స్టార్ మహేష్ బాబును.. విక్టరీ హీరో వెంకటేష్ టెన్షన్ పెట్టిన సందర్భం గురించి మీకు తెలుసా? వెంకటేష్ కు మహేష్ చేసుకున్న రిక్వెస్ట్ ఏంటి?

PREV
15
మహేష్ బాబు ‌- వెంకటేష్ మల్టీ స్టారర్ మూవీ

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు, విక్టరీ వెంకటేష్ కాంబినేషన్ లో దాదాపు 12 ఏళ్ల క్రితం వచ్చింది సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమా. డబ్బుకు విలువియ్యని కుటుంబంలో అనుబంధాలు, ఆప్యాయతలు, కోపతాపాలు ఎలా ఉంటాయి అనేది, కళ్లకు కట్టినట్టు చూపించిన సినిమా ఇది. ఈమూవీలో అన్నదమ్ములుగా వెంకటేష్, మహేష్ నటన అద్భుతం. ఈసినిమాను ఇప్పటికీ వదలకుండా చూస్తుంటారు అభిమానులు. ఫ్యామిలీ ఆడియన్స్ కు పిచ్చి పిచ్చిగా నచ్చిన ఈసినిమా.. అప్పుడు సంక్రాంతి రిలీజ్ లో సూపర్ డూపర్ హిట్ అయ్యింది. మహేష్,వెంకీని అయితే నిజంగా అన్నదమ్ముల్లా ఉన్నారని ఎన్నో కామెంట్స్ కూడా వచ్చాయి.

25
వెంకటేష్ టైమ్ అంటే టైమ్..

ఇక ఈక్రమంలో వెంకటేష్ తో ఎక్కువగా సినిమాలు చేసిన డైరెక్టర్ అనిల్ రావిపూడి.. ఆతరువాతి కాలంలో మహేష్ బాబుతో సరిలేరు నీకెవ్వరు సినిమాను తెరకెక్కించారు. అయితే వెంకటేష్ తో షూటింగ్ అనుభవాల గురించి అనిల్ రావిపూడి, మహేష్ బాబు చర్చించుకున్న వీడియో ఒకటి వైరల్ అయ్యింది. వెంకటేష్ టైమ్ సెన్స్ గురించి మాట్లాడుతూ.. అనిల్ రావిపూడి తెగ పొగిడేశాడు. నిజంగా.. ఆయన టైమ్ అంటే టైమ్.. మనం ఫలానా టైమ్ అని చెపితే చాలు.. గడియారం ముల్లు కంటే ముందు ఆయన అక్కడ ఉంటాడు. అంత పంక్చువాలిటీ మెయింటేన్ చేసే హీరో వెంకటేష్ అని అనిల్ రావిపూడి అన్నారు.

35
మహేష్ ను టెన్షన్ పెట్టిన వెంకటేష్..

ఇక వెంకటేష్ గురించి మహేష్ బాబు మాట్లాడుతూ.. '' నాకెందుకు తెలియదు.. ఆయన టైమ్ గురించి నాకు తెలుసు..సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమా షూటింగ్ టైమ్ లో చూశాను కదా..? నన్ను చాలా టెక్షన్ పెట్టేశారు. అందరి కంటే ముందు షూటింగ్ లో ఆయన ఉంటారు. ఆయన వెళ్లిన చాలాసేపటికి నేను హడావిడిగా రెడీ అయ్యి.. సెట్ కు వెళ్లేవాడిని. అయితే అవుడ్ డోర్ వెళ్లినప్పుడు మా రూమ్స్ కూడా పక్క పక్కనే ఉండేవి. అప్పుడు నేను ఆయన్ను రిక్వెస్ట్ చేశాను.. సర్ కొంచె నేను వెళ్లిన తరువాత రండి.. లేదంటే నిదానంగా వెళ్దాం అనేవాడిని'' అనిమహేష్ బాబు సరదాగా వెంకటేష్ టైమింగ్ గురించి వెల్లడించారు.

45
మహేష్ బాబు పాన్ వరల్డ్ మూవీ

ఇక ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబు పాన్ వరల్డ్ మూవీ షూటింగ్ బిజీలో ఉన్నారు. రాజమౌళి డైరెక్షన్ లో ఆయన నటిస్తోన్న వారణాసి సినిమా పై భారీ అంచనాలు ఉన్నాయి. రీసెంట్ గా టైటిల్ టీజర్ ఈవెంట్ తరువాత అవి మరింతగా పెరిగిపోయాయి. గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా హీరోయిన్ గా నటిస్తోన్న ఈసినిమాలో మలయాళ స్టార్ హీరో పృథ్విరాజ్ కుంభ పాత్రలో కనిపించబోతున్నాడు. భారీ అంచనాల మధ్య రూపొందుతున్న ఈసినిమా 2027 సమ్మర్ లో రిలీజ్ కాబోతోంది. దాదాపు 1200 నుంచి 1500 కోట్ల బడ్జెట్ అవుతుందని అంచనా.. ఈమూవీ కలెక్షన్స్ టాలీవుడ్ లోనే కాదు.. ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలోనే సరికొత్త చరిత్రను సృష్టిచే అవకాశం కనిపిస్తోంది.

55
వెంకటేష్ సినిమాలు ..

సీనియర్ హీరోగా విక్టరీ వెంకటేష్ వరుస సక్సెస్ లు చూస్తున్నారు. తనకు తగ్గ సబ్జెక్ట్స్ ను మాత్రమే ఎంచుకుంటూ సినిమాలు చేస్తున్నాడు వెంకీ.. ఈ ఏడాది సంక్రాంతి కానుకగా రిలీజ్ అయిన సంక్రాంతికి వస్తున్నాం సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. 300 కోట్లకు పైగా వసూళ్లు కూడా సాధించింది. ఇక ప్రస్తుతం వెంకటేష్ చేతిలో త్రివిక్రమ్ సినిమాతో పాటు..దృశ్యం 3 కూడా ఉన్నట్టు సమాచారం.

Read more Photos on
click me!

Recommended Stories