ఎన్టీఆర్ తర్వాత బాలకృష్ణ అనుకుంటున్న రోజుల్లో .. చిరంజీవే నా హీరో అని ఓపెన్ గా ప్రకటించిన నిర్మాత

Published : Apr 03, 2026, 04:57 PM IST

ఎన్టీఆర్ తర్వాత టాలీవుడ్ లో దర్శక నిర్మాతలు బాలకృష్ణతో సినిమాలు చేస్తారని అనుకున్నారు. కానీ ఓ నిర్మాత తన బ్యానర్ హీరో చిరంజీవి అని ఓపెన్ గా ప్రకటించారు. ఆ వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. 

PREV
15
Chiranjeevi

నందమూరి తారక రామారావు సినిమాల్లో నటిస్తున్నప్పుడు అగ్ర స్థానంలో ఉన్నారు. పౌరాణిక పాత్రల్లో తనకు తిరుగులేదు అన్నట్లుగా నటించారు. ఎన్టీఆర్ తో పాటు ఏఎన్నార్, సూపర్ స్టార్ కృష్ణ కూడా క్రేజీ హీరోలుగా వెలుగొందారు. ప్రముఖ రచయిత చిల్లగట్టు శ్రీకాంత్ ఓ ఇంటర్వ్యూలో బాలకృష్ణ, చిరంజీవి గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

25
బాలకృష్ణ వైపే వెళతారని..

చిల్లగట్టు శ్రీకాంత్ మాట్లాడుతూ.. ఎన్టీఆర్ హయాం తర్వాత ఆయన వారసుడు అయిన బాలకృష్ణ వైపే ఇండస్ట్రీలోని నిర్మాతలు దర్శకులు వెళతారని అంతా భావించారు. కానీ అలా జరగలేదు అని చిల్లగట్టు శ్రీకాంత్ అన్నారు. ప్రముఖ నిర్మాత దేవి వరప్రసాద్ ఎన్టీఆర్ తో కథానాయకుని కథ, కేడి నంబర్ 1 తిరుగులేని మనిషి, నా దేశం లాంటి చిత్రాలని నిర్మించారు.

35
ఎన్టీఆర్ రాజకీయాల్లోకి

ఎక్కువగా అయన అప్పట్లో ఎన్టీఆర్ తోనే సినిమాలు నిర్మించారు. ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వెళ్ళిపోయిన తర్వాత దేవి వరప్రసాద్ ఆయన వారసుడు బాలకృష్ణతో సినిమాలు చేస్తారని అంతా అనుకున్నారు. కానీ దేవి వరప్రసాద్ అలా చేయలేదు. తన దేవి ఫిలిమ్స్ ప్రొడక్షన్స్ హీరో చిరంజీవి అని ఓపెన్ గా ప్రకటించారు.

45
హసోపేతమైన ప్రకటన

అప్పట్లో అది సాహసోపేతమైన ప్రకటన. చిరంజీవి గారి డ్యాన్సింగ్ స్కిల్స్, నటన, కష్టపడే తత్త్వం ఇవన్నీ చూసి ఆయన ఆ నిర్ణయం తీసుకున్నారు అని చిల్లగట్టు శ్రీకాంత్ తెలిపారు. చిరంజీవితో చట్టంతో పోరాటం అనే సినిమాని తొలిసారి దేవి వరప్రసాద్ నిర్మించాయారు.

55
మృగరాజు వరకు వీరి ప్రయాణం

ఆ తర్వాత వీరి కాంబినేషన్ లో కొండవీటి రాజా, ఘరానా మొగుడు, మంచి దొంగ ఇలా అనేక చిత్రాలు వచ్చాయి. మృగరాజు వరకు వీరి ప్రయాణం కొనసాగింది.

Read more Photos on
click me!

Recommended Stories