Bigg Boss Telugu7: అమర్ దీప్ కాకుండా ప్రియాంకపై ఇంకొకరు అటాక్ చేసి ఉంటే.. లాజిక్ పట్టుకున్న శివాజీ..

First Published | Nov 29, 2023, 5:49 PM IST

అమర్ దీప్ తన బెస్ట్ ఫ్రెండ్ పైగా కోస్టార్ కావడంతో ప్రియాంక కక్కలేక మింగలేక మౌనంగా కూర్చుండి పోయింది. దీనితో సోషల్ మీడియాలో పెద్ద చర్చే జరుగుతోంది.

కింగ్ నాగార్జున హోస్ట్ గా చేస్తున్న బిగ్ బాస్ సీజన్ 7 చివరి దశకు చేరుకుంది. ప్రస్తుతం హౌస్ లో ఉన్న 8 మంది సభ్యులు ఫైనల్ వీక్ కి చేరుకునేందుకు సర్వశక్తులు ఒడ్డి ప్రయత్నిస్తున్నారు. ఈ వారం నామినేషన్స్ లో అమర్ దీప్ మినహా మిగిలిన వాళ్లంతా నామినేట్ అయ్యారు. 

అయితే నిన్న మంగళవారం ఎపిసోడ్ లో హౌస్ లో ఆసక్తికర పరిణామం మొదలైంది. టికెట్ ఫినాలే పోటీని బిగ్ బాస్ ప్రారంభించారు. దశలవారీగా జరిగే ఈ పోటీలో చివరకు అత్యధిక పాయింట్స్ కలిగిన వారు డైరెక్ట్ గా ఫినాలే వీక్ కి చేరుకుంటారు. 


ఈ పోటీలో బుల్లితెర ఆన్ స్క్రీన్ కపుల్ అయిన అమర్ దీప్, ప్రియాంక జైన్ మధ్య ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. గాలం వెయ్ బుట్టలో పడేయ్ అనే టాస్క్ లో ప్రియాంక, అమర్ దీప్ మధ్య ఫిజికల్ గా మాన్ హ్యాండ్లింగ్ జరిగింది. ప్రియాంక ముందుగా రింగ్ లో ఉన్న బంతిని లాక్కుంది. దీనితో అమర్ దీప్ ఆమెపై ఫిజికల్ గా వెళ్లి మీద పడుతూ బలం మొత్తం ఉపయోగించి బంతిని లాగేసుకున్నాడు. 

ఈ క్రమంలో ఇద్దరూ కిందా మీదా పడ్డారు. ప్రియాంక చాలా ఇబ్బంది పడింది. ఈ టాస్క్ కి శివాజీ సంచాలక్ గా వ్యవహరించాడు. తనని విడిచిపెట్టాలని ప్రియాంక బతిమాలుకున్నప్పటికీ అమర్ దీప్ వదల్లేదు. బంతిని లాగే వరకు ఆమెని ఇబ్బంది పెడుతూనే ఉన్నాడు. చివరికి పైచేయి సాధించి బంతిని బుట్టలో వేశాడు. 

దీనితో ప్రియాంక టాస్క్ ఓడిపోయింది. మౌనంగా ఎమోషనల్ గా వెళ్లి కూర్చుంది.కన్నీరు కూడా పెట్టుకుంది కానీ అమర్ దీప్ ని ఒక్క మాట కూడా అనలేదు. అమర్ దీప్ తన బెస్ట్ ఫ్రెండ్ పైగా కోస్టార్ కావడంతో ప్రియాంక కక్కలేక మింగలేక మౌనంగా కూర్చుండి పోయింది. దీనితో సోషల్ మీడియాలో పెద్ద చర్చే జరుగుతోంది. అమర్ దీప్ తప్పు చేశాడా.. లేదా గేమ్ పరంగా అతడు చేసినది సరైనదేనా అనే చర్చ జరుగుతోంది.  

హౌస్ లో కూడా అమర్ దీప్ ఆ రకంగా అటాక్ చేయడం చూసి అంతా ఆశ్చర్యపోయారు. అయితే ఈ విషయంలో శివాజీ లాజిక్ పట్టుకుని ప్రశాంత్ కి చెప్పాడు. అంతకు ముందే అమర్, యావర్ బంతిని లాక్కునేందుకు ఫిజికల్ గా పోటీ పడుతున్న సమయంలో ప్రియాంక వెళ్లి బంతిని లాక్కునే ప్రయత్నం చేసింది. కానీ యావర్ ఆమెకి ఆ ఛాన్స్ ఇవ్వలేదు. ప్రియాంక కూడా ఫిజికల్ గానే ప్రయత్నించింది.

 Also Read: పాన్ ఇండియా హిట్ కొట్టి అంత గర్వం ఎందుకో..

ఇదే విషయాన్ని శివాజీ.. ప్రశాంత్ తో ప్రస్తావించాడు. ఇప్పుడు అమర్ దీప్ చేసింది తప్పు అయితే.. ప్రియాంక చేసింది కూడా తప్పే అన్నట్లుగా తెలిపాడు. ఇక నెటిజన్ల మధ్య ఈ సంఘటనపై వేరే చర్చ సాగుతోంది. అమర్ దీప్.. ప్రియాంకపై ఎలా అటాక్ చేశాడో.. అదే విధంగా ఆమెపై మరొకరు అటాక్ చేసి ఉంటే పరిస్థితి ఎలా ఉండేది అని ప్రశ్నిస్తున్నారు. అమర్ దీప్ తన ఫ్రెండ్ కాబట్టి సైలెంట్ గా ఉండిపోయింది. అదే మరొకరు అయి ఉంటే వాళ్ళని ప్రియాంక మాటలతో టార్గెట్ చేసి గోల గోల చేసేది అని అంటున్నారు. 

Also Read: టాలీవుడ్ క్రేజీ హీరో తండ్రి నాపై మోజు పడ్డాడు.. పేరుతో సహా బయటపెట్టిన షకీలా

Latest Videos

click me!