అనసూయ ప్రస్తుత వయసు 38 ఏళ్ళు. పాతికేళ్ల లోపే పెళ్లి చేసుకుంది. పెళ్లి, పిల్లలు కారణంగా శరీరంలో మార్పులు రావడం సహజం. మునుపటిలా నాజూగ్గా కనిపించాలంటే కష్టం. అనసూయ శరీర రీత్యా అది సాధ్యం కాదు.
అనసూయను ఆమె హేటర్స్ ఆంటీ అని ట్రోల్ చేస్తుంటారు. ఆంటీ అంటే అనసూయకు మండిపోతుంది. ట్రోల్ చేసిన వాళ్ల దిమ్మ తిరిగేలా ఇచ్చిపడేస్తుంది. యాంకరింగ్ మానేసిన అనసూయ నటిగా బిజీ అయ్యారు. ఆమె విలక్షణ పాత్రలు చేస్తుంది. విమానం మూవీలో వేశ్యగా నటించి షాక్ ఇచ్చింది.
Anasuya Bharadwaj
నటులకు ఫిట్నెస్, గ్లామర్ చాలా ముఖ్యం. అందులోనూ అనసూయ కొన్ని సినిమాల్లో లీడింగ్ రోల్స్ కూడా చేస్తుంది. అందుకే వీలైనంత గ్లామర్ గా కనిపించాలనేది అనసూయ కోరిక. అనసూయ కొంచెం బొద్దుగానే ఉంటారు. ఆమె హాట్ గా కనిపించే అంశాల్లో అది కూడా ఒకటి. అయితే ఇంకా బరువు పెరిగితే ప్రమాదమే.
Anasuya Bharadwaj
అందుకే డైలీ వ్యాయామం ఆమె దిన చర్యలో భాగంగా ఉంటుంది. యోగ కూడా చేస్తుంది. అనసూయ ఫిట్నెస్ గోల్స్ నెక్స్ట్ లెవెల్ కి చేరాయి. ఆమె ఏరియల్ యోగ కూడా స్టార్ట్ చేసింది. బరువు తగ్గించి, అందం పెంచడంలో ఏరియల్ యోగ బాగా పని చేస్తుంది. అందుకే ఆమె ఏరియల్ యోగ స్టార్ట్ చేశారు.
Anasuya Bharadwaj
ఏరియల్ యోగలో కఠినమైన ఓ పోజ్ ని అనసూయ ఇంస్టాగ్రామ్ లో షేర్ చేయగా వైరల్ అవుతుంది. అనసూయ ఫీట్లు చూసి నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఏరియల్ యోగ చేయడంతో పాటు లేత కొబ్బరి కూడా తింటుందట. మొత్తంగా అనసూయ ఇంస్టాగ్రామ్ పోస్ట్ చర్చకు దారి తీసింది.
ఇక నటిగా అనసూయ ఫుల్ బిజీగా ఉన్నారు. ఈ ఏడాది ఆమె అరడజను చిత్రాల వరకు నటించారు. మైఖేల్, రంగమార్తాండ, విమానం, పెదకాపు 1, ప్రేమ విమానం చిత్రాల్లో కీలక రోల్స్ చేశారు.