కన్నడపై ప్రాంతీయ అభిమానం చాటుకునే క్రమంలో రిషబ్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాశం అయ్యాయి. ఒక్క హిట్ వచ్చింది కదా అని నేను ఇతర ఇండస్ట్రీల వైపు చూసే రకం కాదు అంటూ రిషబ్ కామెంట్స్ చేశాడు. రిషబ్ చేసిన ఈ వ్యాఖ్యలు కన్నడ నుంచి ఇతర ఇండస్ట్రీలకు వెళ్లి పాన్ ఇండియా చిత్రాలు చేస్తున్న ప్రశాంత్ నీల్, రష్మిక లాంటి వారిపై సెటైర్ అంటూ నెటిజన్లు చర్చించుకుంటున్నారు.