Priyanka Chopra: చాలా గ్యాప్ తర్వాత భారతీయ సినిమా, అది కూడా ఫస్ట్ తెలుగు సినిమా చేస్తున్న ప్రియాంక చోప్రా.. హార్పర్ బజార్ మ్యాగజైన్ ఇంటర్వ్యూలో నిక్ జోనాస్‌ని ఎందుకు పెళ్లి చేసుకుందో చెప్పింది. కుటుంబం అంటే ఇష్టపడే వ్యక్తి కావాలని కోరుకుందట. ఆ విశేషాలను వెల్లడించింది.
28
ప్రియాంక, నిక్ జోనాస్ పెళ్లి ఫోటో
గతంలో కొన్ని సంబంధాల్లో మోసపోయానని, నిజాయితీ ముఖ్యమని ప్రియాంక చెప్పింది. బాలీవుడ్‌లో ఆమె పలువురు హీరోలతో డేటింగ్ నడిపింది. ఆ తర్వాత బ్రేకప్స్ అయ్యాయి. ఈ క్రమంలో తాజాగా ఈ విషయాలను వెల్లడించింది ప్రియాంక చోప్రా.
38
ప్రియాంక, నిక్ జోనాస్ పెళ్లి ఫోటో
కుటుంబం విలువ తెలిసిన వ్యక్తి కావాలని ప్రియాంక అనుకుంది. నిక్ జోనాస్ ఫ్యామిలీకి ఇంపార్టెన్స్ ఇచ్చారట. అందుకే ఆయన్ని మ్యారేజ్ చేసుకున్నట్టు చెప్పింది ప్రియాంక చోప్రా.
48
ప్రియాంక, నిక్ జోనాస్ పెళ్లి ఫోటో
తన వృత్తిని గౌరవించే వ్యక్తి కావాలని ప్రియాంక కోరుకుంది. నిక్ జోనాస్ ప్రియాంక చోప్రాకి ఫ్రీడమ్ ఇచ్చారు. ఆమె పనికి ప్రయారిటీ ఇచ్చారు. పైగా ఆయన కూడా ఇదే రంగంలో ఉండటంతో ఆమెని అర్థం చేసుకోగలిగాడు.
58
ప్రియాంక, నిక్ జోనాస్ పెళ్లి ఫోటో
క్రియేటివ్‌గా ఉండి, పెద్ద కలలు కనే వ్యక్తి కావాలని ప్రియాంక అనుకుంది. నిక్ జోనాస్ మ్యూజిక్ రంగంలో ఉన్నారు. ఆయన బ్రాడ్ మైండ్ సెట్‌తో ఉన్నారు.
68
ప్రియాంక, నిక్ జోనాస్ పెళ్లి ఫోటో
తనలాగే దృఢ సంకల్పం, ఆశయం ఉన్న వ్యక్తి కావాలని ప్రియాంక కోరుకుంది. తన భర్తలో ఆ లక్షణాలు చూసిందట. ఆ లక్షణాలు తనని ఆకర్షించినట్టు చెప్పింది ప్రియాంక చోప్రా.
78
ప్రియాంక, నిక్ జోనాస్ పెళ్లి ఫోటో
నిక్‌లో ఈ లక్షణాలు లేకపోతే పెళ్లి చేసుకునేదాన్ని కాదని ప్రియాంక అంది. మొత్తంగా నిక్ జోనాస్‌ని చాలా సెలక్టీవ్‌గానే ఎంపిక చేసుకుంది ప్రియాంక.
88
ప్రియాంక, నిక్ జోనాస్ పెళ్లి ఫోటో
ప్రియాంక, నిక్ జోనాస్ పెళ్లి 2018 డిసెంబర్ 1, 2 తేదీల్లో జరిగింది. రెండు సాంప్రదాయాల ప్రకారం వీరి పెళ్లి జరిగింది. నిక్ పెళ్లి తర్వాత హాలీవుడ్ సినిమాలకే ప్రయారిటీ ఇచ్చింది. చాలా కాలం తర్వాత ఇప్పుడు తెలుగులో మహేష్ బాబు, రాజమౌళి సినిమాలో కీలక పాత్రలో ప్రియాంక చోప్రా కలిసి నటిస్తుంది. ఇది త్వరలోనే రెగ్యూలర్ షూటింగ్ ప్రారంభం కాబోతుంది.