Mokshagna-prasanth varma:నందమూరి బాలకృష్ణ నట వారసుడు మోక్షజ్ఞ తేజ హీరోగా పరిచయం చేయబోతున్నట్టు ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. `హనుమాన్` దర్శకుడు ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహించబోతున్నట్టు వెల్లడించారు.
ఇటీవల ఈ మూవీ ఆగిపోయిందనే వార్తలు ఊపందుకున్నాయి. ఆ మధ్య సినిమా ప్రారంభించాల్సి ఉండగా, మోక్షజ్ఞ ఆరోగ్యం బాగా లేదని, వాయిదా వేసినట్టు తెలిపారు. ఇది జరిగి చాలా రోజులవుతున్నా, ఇంకా ప్రారంభం కాలేదు.