`వారణాసి` కోసం ప్రియాంక చోప్రా తీసుకుంటున్న పారితోషికం ఎంతో తెలుసా? ఇండియాలోనే హైయ్యెస్ట్

Published : Nov 18, 2025, 04:37 PM IST

గ్లోబల్‌ బ్యూటీగా రాణిస్తోన్న ప్రియాంక చోప్రా `వారణాసి`లో మందాకిని పాత్రలో నటిస్తోంది. అయితే ఈ చిత్రంలో నటిస్తున్నందుకు ఆమె తీసుకుంటున్న పారితోషికం ఎంతో తెలిస్తే మాత్రం ఆశ్చర్యపోవాల్సిందే. 

PREV
15
`వారణాసి`లో కీలక పాత్రలో ప్రియాంక చోప్రా

ప్రియాంక చోప్రా ప్రస్తుతం గ్లోబల్‌ బ్యూటీగా రాణిస్తోంది. ఆమె ఇండియన్‌ సినిమాలు చేసి చాలా రోజులవుతుంది. ఇప్పుడు హాలీవుడ్‌లోనే మూవీస్‌ చేస్తోంది. హాలీవుడ్‌ పాప్‌ సింగర్‌ నిక్‌ జోనాస్‌ని ఆమె వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. అప్పట్నుంచి తన మకాం కూడా అమెరికాకి మార్చేసింది. అక్కడి సినిమాలే చేస్తోంది. ఈ క్రమంలో చాలా ఏళ్ల తర్వాత ఇప్పుడు మళ్లీ ఇండియన్‌ మూవీ చేస్తోంది. అది కూడా తెలుగు సినిమా కావడం విశేషం. మహేష్‌ బాబు హీరోగా రాజమౌళి రూపొందిస్తోన్న `వారణాసి` చిత్రంలో ప్రియాంక చోప్రా కీలక పాత్ర పోషిస్తోన్న విషయం తెలిసిందే. ఇందులో ఆమె మందాకిని పాత్రలో కనిపించబోతుంది.

25
మహేష్‌ బాబుకి సపోర్ట్ చేసే పాత్రలో ప్రియాంక

ఇటీవల హైదరాబాద్‌లో `వారణాసి` టైటిల్‌ రివీల్‌ ఈవెంట్‌ నిర్వహించగా, ఇందులో ప్రియాంక సందడి చేసింది. మహేష్‌ బాబు అభిమానుల మనసు దోచుకుంది. చాలా బాగా మాట్లాడింది. తెలుగు ఆడియెన్స్ నాడి పట్టేసిందని చెప్పొచ్చు. ఇక సినిమాలో ఆమె పాత్ర చాలా స్ట్రాంగ్‌గా ఉండబోతుందట. మహేష్‌ బాబుకి దీటుగా ఉంటుందని, ఆయనకు సపోర్ట్ చేసే పాత్రలో ప్రియాంక కనిపిస్తారని సమాచారం. ప్రారంభంలో ఆమె రోల్‌ కాస్త నెగటివ్‌ షేడ్స్ లో ఉంటుందని, ఆ తర్వాత పాజిటివ్‌గా మారుతుందని తెలుస్తోంది.

35
`వారణాసి` కోసం ప్రియాంక చోప్రా పారితోషికం

ఇదిలా ఉంటే ఈ సినిమా కోసం ప్రియాంక చోప్రా తీసుకునే పారితోషికం ఎంతనేది ఆసక్తికరంగా మారింది. దాదాపు వెయ్యి కోట్లతో ఈ మూవీని రూపొందిస్తున్నారు. మహేష్‌ బాబు, రాజమౌళి భారీగా పారితోషికం తీసుకుంటున్నారట. అయితే వాళ్లు నిర్మాణంలోనూ భాగమవుతున్నట్టు సమాచారం. దీంతో ప్రియాంక చోప్రా తీసుకునే పారితోషికం వివరాలు లీక్‌ అయ్యాయి. సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. `వారణాసి` మూవీ కోసం ప్రియాంక చోప్రాకి రూ.30కోట్లు పారితోషికం ఇస్తున్నారట. ఇది ఇండియన్‌ సినిమాలోనే హైయ్యెస్ట్ కావడం విశేషం.

45
ఇండియాలోనే అత్యధిక పారితోషికం

ప్రస్తుతం ఇండియాలో హీరోయిన్లలో నయనతార, దీపికా పదుకొనె, రష్మిక మందన్నా, త్రిష, సమంత వంటి కథానాయికలు టాప్‌ హీరోయిన్లుగా ఉన్నారు. వీరి పారితోషికం ఐదు కోట్ల నుంచి రూ.10కోట్ల వరకు ఉంటుంది. కానీ ప్రియాంక చోప్రాకి ఏకంగా ముప్పై కోట్లు అంటే ముగ్గురు హీరోయిన్ల పారితోషికమని చెప్పొచ్చు. అంతేకాదు ఇది యంగ్‌ హీరోల రెమ్యూనరేషన్‌గానూ చెప్పొచ్చు. మొత్తంగా గ్లోబల్ బ్యూటీ `వారణాసి` కోసం సాలిడ్‌గానే రెమ్యూనరేషన్‌ తీసుకుంటున్నట్టు సమాచారం.

55
12ఏళ్ల క్రితమే తెలుగులోకి ప్రియాంక చోప్రా ఎంట్రీ

ప్రియంక చోప్రా ఫస్ట్ 2002లో తమిళంలో `తమిజన్‌` మూవీలో విజయ్‌ సరసన హీరోయిన్‌గా నటించింది. ఈ చిత్రంతోనే ఆమె హీరోయిన్‌గా వెండితెరకు పరిచయం అయ్యింది. ఈ చిత్రానికి ఆమె పారితోషికం ఐదు లక్షలు. ఇప్పుడు ఆమె రెమ్యూనరేషన్‌ రూ.30కోట్లు కావడం విశేషం. 23 ఏళ్లలో ఆమె రేంజ్‌ తమిళం నుంచి హాలీవుడ్‌ వరకు చేరిందని చెప్పొచ్చు. ప్రస్తుతం ప్రియాంక చోప్రా హాలీవుడ్‌లో `ది బ్లఫ్‌`, `జడ్జ్ మెంట్‌ డే` చిత్రాల్లో నటిస్తోంది. ప్రియాంక గతంలోనే తెలుగులో ఓ మూవీ చేసింది. 2013లో రామ్‌ చరణ్‌తో `జంజీర్‌`లో నటించిన విషయం తెలిసిందే. దాదాపు 12ఏళ్ల తర్వాత మళ్లీ తెలుగు మూవీ, అది కూడా ఇంటర్నేషనల్‌ రేంజ్‌ ప్రాజెక్ట్ కావడం విశేషం.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories