100 కోట్ల ఇల్లు, సొంత విమానం, నయనతార ఆస్తి ఎన్ని కోట్లు ఉంటుందో తెలుసా?

Published : Nov 18, 2025, 02:45 PM IST

లేడీ సూపర్ స్టార్  నయనతార  41వ సంవత్సరంలోకి అడుగు పెట్టింది. సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో స్టార్ గా వెలుగుతున్న నయనతార ఆస్తి ఎన్ని కోట్లు ఉంటుందో తెలుసా? ఒక్క సినిమాకు ఆమె తీసుకునే రెమ్యునరేషన్ ఎంత? 

PREV
15
నయనతార ఆస్తి విలువ

కోలీవుడ్ లేడీ సూపర్ స్టార్ నయనతార వయసు పెరిగే కొద్దీ మరింత గ్లామరస్‌గా మారుతోంది. సినిమాలు, వ్యాపారాలు, బ్రాండ్ ఎండార్స్‌మెంట్లతో చేతినిండా సంపాదిస్తోంది. ఏహీరోయిన్ కూడా సంపాదించలేనంతగా ఆస్తులు కూడబెడుతూ.. ఆమె అందరినీ ఆశ్చర్యపరుస్తోంది.

25
లేడీ సూపర్ స్టార్ రెమ్యునరేషన్

నయనతార ఒక్కో సినిమాకు రూ.10 నుంచి 15 కోట్ల  వరకూ రెమ్యునరేషన్  తీసుకుంటుంది. అయితే కన్నడ స్టార్ యశ్ 'టాక్సిక్' సినిమా కోసం తన రెమ్యూనరేషన్‌ను రూ.20 కోట్లకు పెంచినట్లు సమాచారం. వయసు పెరిగినా ఆమె మార్కెట్ ఏమాత్రం తగ్గలేదు.

35
యాంకర్ నుంచి లేడీ సూపర్ స్టార్ వరకు

మలయాళంలో టీవీ యాంకర్‌గా కెరీర్ మొదలుపెట్టిన నయనతార, దక్షిణ భారత లేడీ సూపర్ స్టార్‌గా ఎదిగింది. 'చంద్రముఖి' సినిమా ఆమె కెరీర్‌లో పెద్ద బ్రేక్ ఇచ్చింది. ప్రమోషన్లకు దూరంగా ఉండటం ఆమె అలవాటు. ఎంత పెద్ద స్టార్ హీరో అయినా.. ఆ సినిమా ప్రమోషన్లకు రాకూడదు అన్న కండీషన్ తోనే సినిమాలకు సైన్ చస్తుంది నయన్. 

45
నయనతార లవ్ ఫెయిల్యూర్, పెళ్లి, పిల్లలు

నయనతార వ్యక్తిగత జీవితంలో ఎన్నో వివాదాలున్నాయి. శింబు, ప్రభుదేవాలతో ప్రేమాయణం విఫలమైంది. ఆ తర్వాత, దర్శకుడు విఘ్నేశ్ శివన్‌ను ప్రేమించి.. 5 ఏళ్ల తరువాత అతన్ని పెళ్లి చేసుకుంది. వీరికి సరోగసీ ద్వారా ఇద్దరు కవల  పిల్లలు పుట్టారు.

55
నయనతార ఆస్తి విలువ

నయనతార 'జవాన్' సినిమాతో బాలీవుడ్‌లో అడుగుపెట్టింది.ఈసినిమా 1000 కోట్లకు పైగా వసూలు చేసింది. ఇక నయన్ తన సంపాదనలో చాలా వరకూ వ్యాపారాల్లో పెట్టుబడులు పెడుతోంది.  దుబాయ్‌లో తన అన్న వ్యాపారాల్లో నయనతార పార్ట్నర్ గా ఉన్నట్టు సమాచారం. ఇక  సొంత విమానం కలిగి ఉన్న హీరోయిన్ కూడా నయనతార ఒక్కతే. పెద్ద పెద్ద స్టార్స్ నివాసం ఉండే కాస్ట్లీ ఏరియా  పోయెస్ గార్డెన్‌లో రూ.100 కోట్ల ఇల్లు ఉన్నాయి. ఆమె మొత్తం ఆస్తి విలువ సుమారు 300 కోట్లు ఉండవచ్చని సమాచారం. 

Read more Photos on
click me!

Recommended Stories