వారణాసి వరుస వివాదాలు, రాజమౌళి పై కేసు నమోదు, ఫిల్మ్ ఛాంబర్ లో జక్కన్న పై కంప్లైయింట్

Published : Nov 18, 2025, 01:16 PM IST

ఈసారి రాజమౌళి సినిమాకు గట్టి దెబ్బ తప్పేలా కనిపించడంలేదు.వివాదాల జోలికి వెళ్లని రాజమౌళికి ఫస్ట్ టైమ్  తిప్పలు తప్పేలా లేవు. అటు హనుమంతుని వివాదం కొనసాగుతుండగానే..మరో వైపు టైటిల్ వివాదం స్టార్ట్ అయ్యింది. జక్కన్నపై కేసు కూడా నమోదయ్యింది. 

PREV
17
వివాదరహితుడిగా రాజమౌళికి పేరు..

టాలీవుడ్ ను హాలీవుడ్ రేంజ్ కు తీసేకెళ్లిన దర్శకుడు రాజమౌళి.. ఆయన ఎంత పెద్ద సినిమాలు చేసి.. ఏస్థాయికి వెళ్లినా.. చాలా కామ్ గా, కూల్ గా, వినయంగా కనిపిస్తుంటారు. ఎప్పుడు పొరపాటున కూడా నోరు జారిన సందర్భాలు లేవు. కానీ రాజమౌళి సినిమాలపై మాత్రం కాపీ వివాదాలు చాలా వచ్చాయి. ఆయన సినిమాలు హాలీవుడ్ ను కాపీ కొడతాడని, టైటిల్స్ తో పాటు కొన్నిసన్నివేశాలు కూడా హాలీవుడ్ మూవీస్ నుంచి తీసుకుంటాడని విమర్శలు ఉన్నాయి. ఈవిషయంలో రాజమౌళి కూడా కొన్నిసార్లు క్లారిటీ ఇచ్చాడు.. తనకు నచ్చిన మంచి సీన్లను రీ క్రియేట్ చేస్తుంటానని ఆయన కూడా ఒప్పుకున్నారు. జక్కన్న సినిమాలపై ఇలాంటి వివాదాలు కామన్. కానీ అవి ఎప్పుడు సినిమా విజయంపై ప్రభావం పడలేదు. ఎందుకంటే రాజమౌళి పర్సనల్ గా ఎటువంటి వివాదాల్లో వేలు పెట్టడు. కానీ ఈసారి పరిస్థితి రివర్స్ అయ్యింది.

27
వారణాసి ఈవెంట్ లో రాజమౌళి అసహనం

మహేష్ బాబుతో తెరకెక్కిస్తున్న వారణాసి సినిమా ఈవెంట్ లో హనుమంతునిపై రాజమౌళి కాంమెంట్స్ అగ్గిని రాజేశాయి. ఎవరిమీద కోపం మరెవరిమీదనో చూపించారు జక్కన్న. ఈవెంట్ లో జరిగిన కొన్ని టెక్నికల్ ప్రాబ్లమ్స్ రాజమౌలి ఓపికకు పరిక్షగామారాయి. దాంతో జక్కన్న అసహనంతో నోరు జారాడు. అసలే వారణాసి ఈవెంట్ ప్లాప్ అయ్యింది. దానికి తోడు వరుస వివాదాలు ఈసినిమాను చుట్టుముడుతున్నాయి. రిలీజ్ కు ఇంకా ఏడాదిన్నర పైన ఉండగా..ఇప్పటినుంచే వారణాసికి వివాదాల సెగ తప్పడంలేదు.

37
రాజమౌళి ఏమన్నాడు..?

వారణాసి ఈవెంట్ లో టెక్నికల్ఇష్యూస్ టీమ్ ను బాగా ఇబ్బంది పెట్టాయి. దాంతో రాజమౌళి సహనం కోల్పోయాడు.. అక్కడి టెక్కికల్ టీమ్ ను గట్టిగా అరుసుకున్నాడు. ఈసందర్భంగా దేవుడిపై కూడా ఆయన నోరు జారాడు. రాజమౌళి మాట్లాడుతూ, “నాకు దేవుడిపై పెద్ద నమ్మకం లేదు. మా నాన్నగారు హనుమంతుడు వెనుక ఉంటాడని చెప్పగానే కోపం వచ్చింది. మా ఆవిడకి హనుమంతుడు అంటే చాలా ఇష్టం. ఆయనతో స్నేహితుడిలా మాట్లాడుతుంది. ఆమెపైన కూడా కోపం వచ్చింది. ఇదేనా చేసేది అనిపించింది. చిన్నప్పటి నుంచి రామాయణం, మహాభారతం అంటే ఎంతో ఇష్టం. మహాభారతం నా డ్రీం ప్రాజెక్ట్. ఈ సినిమా మొదలుపెట్టినప్పుడు రామాయణంలోని ఒక ముఖ్య ఘట్టాన్ని తీయాలని అసలు అనుకోలేదు,” అని వివరించాడు. దాంతో టెక్నికల్ గా ఇబ్బంది వస్తే.. హనుమంతుడు ఏం చేస్తాడని.. నెటిజన్లు మండిపడ్డాడు. దేవుడి పేరుమీద సినిమాలు చేస్తూ.. కోట్లు దండుకుంటున్నారు. మళ్లీ దేవుడినే నిందిస్తారా అని రాజమౌళిపై గట్టిగా ట్రోలింగ్ కూడా చేస్తున్నారు జనాలు.. ఈక్రమంలోనే రాజమౌళిపై హిందూ సంఘాలు మండిపడుతున్నాయి.

47
రాజమౌళిపై కేసు నమోదు..

తాజాగా రాజమౌళి హనుమంతునిపై చేసిన వాఖ్యలకు గాను.. ‘రాష్ట్రీయ వానరసేన’ అనే సంస్థ ఆయనపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. హైదరాబాద్‌లోని సరూర్‌నగర్ పోలీస్ స్టేషన్‌లో వానరసేన ప్రతినిధులు ఈ ఫిర్యాదును సమర్పించారు. ‘వారణాసి’ చిత్రం టైటిల్ లాంచ్ కార్యక్రమంలో రాజమౌళి చేసిన వ్యాఖ్యలు హిందువుల భావాలను దెబ్బతీశాయని వారు ఆరోపించారు. వానరసేన సభ్యులు ఇచ్చిన కంప్లైయింట్ లో .. ఏముందంటే..'' ఈమధ్య సినిమాల్లో హిందూ దేవతలను కించపరిచే ధోరణి పెరుగుతోంది..మత విశ్వాసాలను దెబ్బతీయడం చట్టపరంగా తప్పు కాబట్టి రాజమౌళిపై వెంటనే కేసు నమోదు చేసి, విచారణ చేపట్టాలి'' అని వారు డిమాండ్ చేశారు. సినీ పరిశ్రమలో ఈ తరహా సంఘటనలు మళ్లీ జరగకుండా కఠిన చర్యలు తీసుకోవాలని కూడా కోరారు.

57
వారణాసి టైటిల్ వివాదం షురూ...

ఇక హనుమతుని వివాదం నడుస్తుండగానే రాజమౌళిని ఉక్కిరిబిక్కిరిచేసేలా మరో సమస్య వారణాసిని చుట్టుముట్టింది. వారణాసి టైటిల్ మాది అంటూ దర్శకుడు రాజమౌళిపై ఫిలిం ఛాంబర్ లో ఫిర్యాదు నమోదయ్యింది. ఈ మేరకు Varanasi రామబ్రహ్మ హనుమ క్రియేషన్స్ సంస్థ నుంచి ఈ కంప్లైయింట్ నమోదు అయ్యింది. తాము రిజిస్టర్ చేసుకున్న టైటిల్ ను అనుమతి లేకుండా వేరే సినిమాకు ఎలా వాడతారు అంటూ ఫిర్యాదులో పేర్కొన్నారు. రామబ్రహ్మ హనుమ క్రియేషన్స్ అనే సంస్థ రీసెంట్ గా కొత్త సినిమాను ప్రకటించింది. సనాతన ధర్మ పరిరక్షణ కాన్సెప్ట్ తో ఈ మూవీని రూపొందిస్తున్నారు. రీసెంట్ గా పోస్టర్ కూడా విడుదల చేసినట్టు తెలుస్తోంది. సీహెచ్ సుబ్బారెడ్డి దర్శకత్వంలో ఈమూవీ తెరకెక్కతున్నట్టు సమాచారం. ఇక ఈ టైటిల్ గురించి వారు మాట్లాడుతూ.. “వారణాసి టైటిల్ మాది. రామబ్రహ్మ హనుమ క్రియేషన్స్ పై రిజిస్టర్ చేయించాము. మా దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయి. ఛాంబర్ నుంచి లెటర్ కూడా రిలీజ్ చేశారు. కాబట్టి, మేము రిజిస్టర్ చేసుకున్న టైటిల్ ను మా అనుమతి లేకుండా ఎలా వాడతారు” అంటూ నిర్మాత విజయ్ కే ఆరోపించారు. దీంతో వారణాసి సినిమాపై కొత్త వివాదం నెలకొంది.

67
రాజమౌళికి తప్పని తిప్పలు..

గతంలో కాపీ ఇష్యూస్ వచ్చినా.. రాజమౌళి సినిమాలకు అవి పబ్లిసిటీని తెచ్చిపెట్టాయి. కానీ ఈసారి అనసవరంగా హిందూ సంఘాల విషయంలో రాజమౌళి బ్యాడ్ అయ్యారు. దాంతో దేశ వ్యాప్తంగా రాజమౌళిపై వ్యతిరేకంగా ప్రచారం జరుగుతుంది. ఇది ఆయన వారణాసి సినిమాను ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. ఈ విషయంలో రాజమౌళి స్పందించి.. వివరణ ఇవ్వడం మంచిదని కొంత మంది అభిప్రాయపడుతున్నారు. లేదంటే.. వివాదం ముదిరి అసలుకే మోసం వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే ఇంత జరుగుతున్నా.. రాజమౌళి ఇంత వరకూ ఈ విషయంలో స్పందించలేదు. మరి ముందు ముందు ఏమైనా మాట్లాడతాడా లేదా అనేది చూడాలి.

77
వారణాసి సినిమాపై భారీ అంచనాలు

ఇదిలావుండగా, రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న ‘వారణాసి’ సినిమాపై ఇప్పటికే భారీగా అంచనాలు పెరిగిపోయాయి. టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు, గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా నటిస్తోన్న ఈసినిమాలో మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రలో కనిపించనున్నారు. వారణాసి సినిమాను 2027 సమ్మర్ లో రిలీజ్ చేయబోతున్నట్టు తెలుస్తోంది. ఇక ఈమూవీకి రాజమౌళి ఆస్థాన సంగీత దర్శకుడు.. ఆస్కార్ అవార్డు గ్రహిత.. కీరవాణి మ్యూజిక్ అందిస్తున్నారు.

Read more Photos on
click me!

Recommended Stories