Priyanka Chopra: ప్రియాంక చోప్రాకి సైడ్ క్యారెక్టర్స్ ఇస్తే ఏం చేసిందో తెలుసా..దెబ్బకు స్టార్ గా మారిపోయింది

Published : Jun 26, 2026, 02:19 PM IST

హాలీవుడ్ స్టూడియోలు భారత నటీనటులకు చిన్న చిన్న పాత్రలే ఇచ్చేవి. కానీ ప్రియాంక చోప్రాకు సైడ్ రోల్స్ కాదు, కథను నడిపించే హీరోయిన్ పాత్రలు కావాలి. అందుకే ఆమె నిర్మాతగా మారాల్సి వచ్చింది.

PREV
17
Priyanka Chopra

బాలీవుడ్ నుంచి హాలీవుడ్ వరకు తనకంటూ ఓ సామ్రాజ్యాన్ని నిర్మించుకున్న 'దేశీ గర్ల్' ప్రియాంక చోప్రా (Priyanka Chopra) ఇప్పుడు గ్లోబల్ ఐకాన్‌గా మారింది. నటిగానే కాకుండా నిర్మాతగా, వ్యాపారవేత్తగా ఆమె ఎదిగిన తీరు అద్భుతం. ఇటీవల 'కాన్ లయన్స్' (Cannes Lions) స్టేజీపై మాట్లాడిన ప్రియాంక, హాలీవుడ్‌లో తాను ఎదుర్కొన్న సవాళ్లు, హీరోయిన్‌గా నిలదొక్కుకోవడానికి చేసిన పోరాటం గురించి మనసు విప్పి మాట్లాడారు.

27
కథను నడిపించే హీరోయిన్ పాత్ర
ప్రియాంక చోప్రా అమెరికా వెళ్లినప్పుడు, అక్కడి స్టూడియోలు భారత నటీనటులను కేవలం చిన్న లేదా సహాయక పాత్రలకే పరిమితం చేసేవి. కానీ ప్రియాంకకు కావాల్సింది సైడ్ రోల్ కాదు, కథను నడిపించే హీరోయిన్ పాత్ర. 'నేను అమెరికాకు వచ్చినప్పుడు, నాకు మరిన్ని లీడ్ రోల్స్ ఉన్న సినిమాలు కావాలనిపించింది. కానీ ఒక భారతీయ నటి అలాంటి పాత్రలు చేయగలదని హాలీవుడ్ స్టూడియోలు ఊహించలేకపోయాయి. అందుకే నేను నిర్మాతగా మారాల్సి వచ్చింది' అని ప్రియాంక అసలు విషయం చెప్పారు.
37
తిరస్కరణ అనేది సర్వసాధారణం
సినిమా రంగంలో తిరస్కరణ అనేది సర్వసాధారణం. కానీ ప్రియాంకకు అదే విజయానికి మెట్టుగా మారింది. 'నేను చాలా ఆశయం ఉన్నదాన్ని. ఎవరైనా నాకు 'ఇది సాధ్యం కాదు' లేదా 'వద్దు' అని చెబితే, దాన్ని చేసి చూపించాలనే పట్టుదల నాలో పెరుగుతుంది. వినోద రంగంలో మహిళలకు ఒక గ్లాస్ సీలింగ్ (Glass ceiling) ఉంటుంది. దాన్ని దాటాలంటే మనకు మనమే కొత్త దారులు వెతుక్కోవాలి' అని ఆమె మహిళా సాధికారత గురించి కూడా గొంతు విప్పారు.
47
నేనూ తప్పులు చేస్తాను
కెరీర్ ప్రారంభంలో తాను ఎప్పుడూ 'పర్ఫెక్ట్‌'గా ఉండాలనుకునేదాన్నని ప్రియాంక చెప్పారు. కానీ ఇప్పుడు తన ఆలోచనా విధానం మారిందంటున్నారు. 'నేను కూడా మనిషినే, నేనూ తప్పులు చేస్తాను' అని ఆమె అన్నారు.
57
ప్రేక్షకులతో భావోద్వేగ బంధం
'మనం 'పర్ఫెక్ట్‌'గా ఉన్నప్పుడు కాదు, మన తప్పులను ఒప్పుకున్నప్పుడే ప్రేక్షకులతో భావోద్వేగ బంధం ఏర్పడుతుంది. నేను నా శక్తి మేరకు ఉత్తమంగా పనిచేస్తున్నాననే నిజమే నన్ను అభిమానులతో కలుపుతుంది' అని ప్రియాంక వివరించారు.
67
సొంతంగా ప్రొడక్షన్ హౌస్

సొంతంగా ప్రొడక్షన్ హౌస్ ప్రారంభించిన ప్రియాంక, కొత్త ప్రతిభావంతులకు అవకాశం కల్పించాలనే లక్ష్యంతో ఉన్నారు. 'నేను ఈ ఇండస్ట్రీకి వచ్చినప్పుడు నాకు ఎవరూ తెలియదు. ఇప్పుడు కొత్తవాళ్లు సినిమా రంగంలోకి వస్తే, వారికి అండగా నిలబడాలన్నది నా కోరిక. నేను ఒక స్టేజీ నిర్మించాను, దాని ద్వారా ఇతరులు పైకి రావాలన్నదే నా ఆశయం' అని ఆమె తన సామాజిక బాధ్యతను తెలియజేశారు.

77
ఎస్.ఎస్. రాజమౌళి 'వారణాసి' సినిమా
ప్రస్తుతం ప్రియాంక, ఎస్.ఎస్. రాజమౌళి 'వారణాసి' సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. ఆ తర్వాత 'రీసెట్' (Reset) అనే సర్వైవల్ థ్రిల్లర్ సినిమాలో కనిపించనున్నారు. ఈ సినిమాలో ఆమె హాలీవుడ్ నటుడు ఓర్లాండో బ్లూమ్ సరసన హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఆగస్టు నుంచి ఈ మూవీ షూటింగ్ ప్రారంభం కానుంది. మొత్తానికి, ప్రియాంక ప్రయాణం ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిదాయకం.
Read more Photos on
click me!

Recommended Stories