Priyanka Chopra: వారణాసి, తుఫాన్‌కి ముందు ప్రియాంక చోప్రా నటించిన తెలుగు సినిమా ఏంటో తెలుసా? ఎంట్రీనే దానితో

Published : Sep 13, 2026, 07:15 AM IST

ప్రియాంక చోప్రా ఇప్పుడు `వారణాసి` చిత్రంతో టాలీవుడ్‌ ఎంట్రీ ఇవ్వబోతుంది. కానీ దీనికంటే ముందే ఆమె తెలుగులో ఓ సినిమా చేసింది. అది జంజీర్‌ కాదు, మరో మూవీ ఉంది. అదేంటంటే?

PREV
15
వారణాసితో టాలీవుడ్‌ ఎంట్రీ ఇవ్వబోతున్న ప్రియాంకచోప్రా

గ్లోబల్ స్టార్‌గా గుర్తింపు తెచ్చుకున్న ప్రియాంక చోప్రా ఇప్పుడు తెలుగు ప్రేక్షకుల్లోనూ భారీ క్రేజ్ సంపాదించుకుంటోంది. ఎస్‌ఎస్‌ రాజమౌళి దర్శకత్వంలో మహేష్‌బాబు హీరోగా తెరకెక్కుతున్న ‘వారణాసి’ సినిమాలో ప్రియాంక చోప్రా కథానాయికగా నటిస్తోంది. దీంతో ఆమె తెలుగు సినీ ఎంట్రీపై ఆసక్తి పెరిగింది. అయితే ‘వారణాసి’ ప్రియాంక నటించిన తొలి తెలుగు సినిమా కాదు. దీనికంటే ముందు తెలుగు, హిందీ బైలింగ్వల్‌ `తుఫాన్‌` చిత్రంలో నటించింది. కానీ ఇది కూడా ఆమె మొదటి తెలుగు సినిమా కాదు. దాదాపు 25 ఏళ్ల క్రితమే ఓ తెలుగు చిత్రంలో హీరోయిన్‌గా నటించింది.

25
అపురూపంతో ప్రియాంక టాలీవుడ్‌ ఎంట్రీ

2001లో ప్రియాంక చోప్రా హీరోయిన్‌గా ఎంపికైన ఆ తెలుగు సినిమా పేరు ‘అపురూపం’. జీఎస్‌ రవికుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో మధుకర్, ప్రసన్న ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమా కోసం ప్రియాంక చోప్రా కొన్ని సన్నివేశాల్లో కూడా నటించినట్లు సీనియర్‌ జర్నలిస్ట్ చల్లా శ్రీనివాస్‌ తాజాగా తెలిపారు. ఆ సమయంలో ఆమెతో చేసిన ఇంటర్వ్యూ ఫోటోని కూడా పంచుకున్నారు. ఈ మూవీతోనే ఆమె టాలీవుడ్‌ ఎంట్రీ ఇవ్వాల్సింది.

35
ఆర్థిక కారణాలతో ఆగిపోయిన అపురూపం

అయితే సినిమా నిర్మాణం మధ్యలోనే ఆర్థిక సమస్యలు ఎదురయ్యాయి. నిర్మాతలకు వచ్చిన ఆర్థిక ఇబ్బందుల కారణంగా షూటింగ్ ముందుకు సాగలేదు. చివరకు సినిమా నిర్మాణం పూర్తిగా నిలిచిపోయింది. పోస్ట్ ప్రొడక్షన్ కూడా కొనసాగకపోవడంతో ‘అపురూపం’ ప్రేక్షకుల ముందుకు రాలేదు. దీంతో ప్రియాంక చోప్రా తెలుగు సినిమాలో నటించినా, ఆమెను తెలుగు ప్రేక్షకులు తెరపై చూడలేకపోయారు.

45
బాలీవుడ్‌లో స్టార్‌ ఇమేజ్‌

ఇదిలా ఉంటే, ప్రియాంక చోప్రా అసలు సినీ కెరీర్ 2002లోనే తమిళ చిత్రం `తమిళన్`తో ప్రారంభమైంది. దళపతి విజయ్ హీరోగా నటించిన ఈ సినిమాలో ప్రియాంక హీరోయిన్‌గా కనిపించింది. అప్పటికి ఆమె వయసు కేవలం 18 ఏళ్లు. ఈ సినిమా షూటింగ్ సమయంలో విజయ్‌కు ఉన్న విపరీతమైన క్రేజ్‌ను చూసి తాను ఆశ్చర్యపోయానని ప్రియాంక ఇటీవల గుర్తుచేసుకుంది. షూటింగ్ లొకేషన్లకు విజయ్‌ను చూడటానికి వందలాది మంది అభిమానులు వచ్చేవారని ఆమె చెప్పింది. ఆ తర్వాత ప్రియాంక బాలీవుడ్‌లోకి వెళ్లి స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది. ‘ది హీరో’, ‘అందాజ్’, ‘ముఝ్సే షాదీ కరోగీ’, ‘క్రిష్’, ‘డాన్’, ‘ఫ్యాషన్’ వంటి సినిమాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. అనంతరం హాలీవుడ్‌లోనూ వరుస అవకాశాలు అందుకుని అంతర్జాతీయ స్థాయిలో పేరు సంపాదించింది.

55
వారణాసి వచ్చేది అప్పుడే

ఇక తెలుగులో ప్రియాంక చోప్రా రామ్‌చరణ్‌తో కలిసి నటించిన ‘జంజీర్’ ద్విభాషా చిత్రంగా రూపొందింది. తెలుగు వెర్షన్ ‘తుఫాన్’ పేరుతో విడుదలైంది. అయితే ఇది ఒరిజినల్‌గా హిందీ–తెలుగు భాషల్లో రూపొందిన ప్రాజెక్ట్ కావడంతో, ప్రియాంక తొలి తెలుగు సినిమా విషయంలో కొంత గందరగోళం కొనసాగుతోంది. ఇప్పుడు ‘వారణాసి’తో ప్రియాంక తొలిసారి తెలుగు ప్రేక్షకుల ముందుకు ఒక భారీ స్థాయి చిత్రంలో కనిపించబోతోంది. ఈ చిత్రం వచ్చే ఏడాది ఏప్రిల్‌ 7న విడుదల కాబోతుంది.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories