Bigg Boss 10: ఎంగిలి గ్లాసులు కడిగిన నాగార్జున.. రోహిత్ కి చుక్కలు, పెద్ది సాంగ్ పంచాయతీలో అతడికి శిక్ష

Published : Sep 12, 2026, 11:20 PM IST

బిగ్ బాస్ తెలుగు 10లో ఫస్ట్ వీకెండ్ వచ్చేసింది. నాగార్జున బిగ్ బాస్ స్టేజీపై సందడి చేయడం మాత్రమే కాదు కొందరు కంటెస్టెంట్స్ కి ఇచ్చి పడేశారు. వాళ్ళు చేసిన తప్పులకు శిక్ష విధించారు.

PREV
15
బిగ్ బాస్ తెలుగు 10

కింగ్ నాగార్జున హౌస్ గా చేస్తున్న బిగ్ బాస్ తెలుగు సీజన్ 10లో ఫస్ట్ వీకెండ్ వచ్చేసింది.శనివారం కావడంతో నాగార్జున స్టేజీపై సందడి చేశారు. వారం లోపే ఇద్దరు ఎలిమినేట్ అయ్యారు. దీనితో హౌస్ లో ఆల్రెడీ హీట్ పెరిగింది. ఆ హీట్ ని నాగార్జున తన ఎంట్రీతో మరింత పెంచారు. కంటెస్టెంట్స్ చేసిన మిస్టేక్స్ ఎత్తి చూపుతూ గట్టిగానే కౌంటర్ ఇచ్చారు. శిక్ష కూడా విధించారు. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం.

25
ఎంగిలి గ్లాసులు కడిగిన నాగార్జున

నాగార్జున బిగ్ బాస్ స్టేజీ పైకి రాగానే కంటెస్టెంట్స్ ని పలకరించి హౌస్ మేట్స్ గా మారిన మొదటి ముగ్గురు రోహిత్, వంశీ, రామ్ ప్రసాద్ లని అభినందించారు. హౌస్ మేట్స్ గా నిలిచిన మొదటి ముగ్గురు కాబట్టి వాళ్లకు జ్యూస్ ఇచ్చి తాగమని చెప్పారు. ఆ తర్వాత నాగార్జున అసలు ఆట మొదలు పెట్టారు. వాళ్ళు జ్యూస్ తాగి ఎంగిలి చేసిన గ్లాసులు నాగార్జున వద్దకు వెళ్లాయి. ఎంగిలి చేసిన గ్లాసులని నేను కడుగుతా అంటూ నాగార్జున కడిగి చూపించారు.

35
రోహిత్ కి చుక్కలు చూపించిన నాగ్

నాగ్ చేసిన పని ఎవరికి కౌంటర్ అనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.. అవును రోహిత్ కే. త్రిగుణ్, రోహిత్ మధ్య గొడవ జరిగినప్పుడు మీరు ఎంగిలి చేసిన గ్లాసులు నేను కడగాలా అంటూ రోహిత్ నోరు జారిన సంగతి తెలిసిందే. అతడికి కనువిప్పు కలిగించడం కోసమే నాగార్జున ఎంగిలి గ్లాసులు కడిగారు. అలా ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది అని నాగార్జున అడగగా.. రోహిత్ అందులో తన తప్పు లేదు అని.. మాట మాత్రమే అలా వచ్చింది అన్నట్లుగా కవర్ చేసుకునే ప్రయత్నం చేశాడు. నాగార్జున ఇతర సభ్యుల ఒపీనియన్ అడగగా ఎక్కువ మంది రోహిత్ దే తప్పు అని తేల్చారు. రోహిత్ కప్పులు కడగాలి అని నాగార్జున శిక్ష విధించారు. స్టెరాయిడ్ కండలు, డొల్ల అంటూ రోహిత్ విషయంలో నోరు జారిన త్రిగుణ్ ని కూడా నాగార్జున మందలించి శిక్ష విధించారు.

45
పెద్ది సాంగ్ వివాదం

ఇక రామ్ ప్రసాద్ విషయంలో వివాదం అయిన 'వారానికి వెయ్యి' సాంగ్ పై కూడా పంచాయతీ జరిగింది. ఈ పంచాయతీలో రామ్ ప్రసాద్ చేసినది తప్పు అని నాగార్జున తెలిపారు. సారీ షాలిని అని 500 సార్లు రాయమని చెప్పారు. షాలిని వారానికి వెయ్యి అని సాంగ్ పాడుతున్నప్పుడు అబ్బో చాలా ఎక్కువ అని రామ్ ప్రసాద్ కామెంట్ చేయడం వివాదం గా మారింది.

55
రోహిత్ ని రిజెక్ట్ చేసిన కంటెస్టెంట్స్

ఇక చివర్లో నాగార్జున ఒక్కొక్కరినీ పిలిచి హౌస్ లో మీ మనసుకు దగ్గరగా ఉన్న ఒక వ్యక్తి ఎవరు.. దూరంగా ఉంచాలి అని అనుకునే వ్యక్తి ఎవరు అంటూ ప్రశ్నించారు. దీనితో ఎక్కువ మంది రోహిత్ ని దూరంగా ఉంచాలి అని. అతడి యారగెన్స్ నచ్చడం లేదు అని తెలిపారు. అల్రెయ్ ముగ్గురు హౌస్ మేట్స్ గా అవకాశం దక్కించుకున్నారు. నాగార్జున మరో ముగ్గురిని హౌస్ మేట్స్ గా ప్రకటించారు. త్రిగుణ్, షాలిని, దేబ్జానీ హౌస్ మేట్స్ అయ్యారు.

Read more Photos on
click me!

Recommended Stories