ఎపిసోడ్ ప్రారంభంలో నాకు ఎందుకు ఫోన్ చేసావో చెప్పు అంటూ కోపంగా మాట్లాడుతాడు మహేంద్ర. రిషి సార్ గురించి ఏమైనా తెలిసిందేమో అడుగుదామని ఫోన్ చేశాను సార్ అంటుంది వసు. మీరిద్దరూ కలిపి వాడి మీద లేని నేరము మోపారు ఇంకెందుకు వాడు ఇక్కడికి వస్తాడు అని కోపంగా అంటాడు మహేంద్ర. సరే అని చెప్పి ఫోన్ పెట్టేస్తుంది వసు.