అవును అతనితో డేటింగ్ చేస్తున్నా... ఎట్టకేలకు ఒప్పుకున్న తమన్నా, ప్రేమ అలా మొదలైందట!

Published : Jun 13, 2023, 09:22 AM IST

తమన్నా ఎట్టకేలకు ప్రేమ గుట్టు విప్పింది. అవును నేను విజయ్ వర్మతో రిలేషన్ లో ఉన్నానంటూ క్లారిటీ ఇచ్చారు. తమన్నా లేటెస్ట్ కామెంట్స్ సంచలనం రేపుతున్నాయి.   

PREV
16
అవును అతనితో డేటింగ్ చేస్తున్నా... ఎట్టకేలకు ఒప్పుకున్న తమన్నా, ప్రేమ అలా మొదలైందట!

హీరోయిన్ తమన్నా భాటియా ప్రేమలో పడ్డారనేది మీడియా వర్గాల వాదన. కొద్దినెలలుగా నటుడు విజయ్ వర్మతో ఆమె సన్నిహితంగా ఉంటున్నారు. తరచుగా కలిసి కనిపిస్తున్నారు. 2023 న్యూ ఇయర్ వేడుకలు జంటగా సెలబ్రేట్ చేసుకున్నారని సమాచారం. అయితే ఈ వార్తలను తమన్నా ఖండించారు. నేను ఎవరితో డేటింగ్ చేయడం లేదు. నేను సింగిల్ అని సమాధానం చెబుతున్నారు. కానీ ఆమె చర్యలు అనుమానాస్పదంగా ఉన్నాయి.

26
Photo Courtesy: Instagram

ఇంత రచ్చ జరుగుతుంటే ఇటీవల మరోసారి తమన్నా-విజయ్ వర్మ కలిసి కనిపించారు. వీరిద్దరూ ఒకే కారులో డిన్నర్ నైట్ కి వెళుతూ కెమెరా కంటికి చిక్కారు. చేసేసి లేక తమన్నా నవ్వుతూ హాయ్ చెప్పారు. విజయ్ డ్రైవింగ్ చేస్తుండగా, పక్క సీట్లో తమన్నా కూర్చొని ఉంది. ఈ క్రమంలో తమన్నా, విజయ్ మధ్య సంథింగ్ సంథింగ్ అనే వార్తలు నిజమే అని పలువురు వాదిస్తున్నారు. 
 

36


ఎప్పటికైనా నిజం చెప్పాలనుకుందేమో కానీ... ఫైనల్ గా తమన్నా ఓపెన్ అయ్యింది. అవును విజయ్ వర్మతో నా రిలేషన్ నిజమే అని కుండబద్దలు కొట్టింది. లస్ట్ స్టోరీస్ 2 సెట్స్ లో తమ ప్రేమ కథ మొదలైందని ఆమె చెప్పుకొచ్చారు. 
 

46

కేవలం సహనటుడు అనే కారణంగా విజయ్ వర్మను ఇష్టపడలేదు. నేను చాలా మంది హీరోలతో పని చేశాను. విజయ్ వర్మ చాలా ప్రత్యేకం. నాకు రక్షణగా నిలబడతాడనే నమ్మకం ఉంది. మాది ఆర్గానిక్ బంధం. నన్ను దెబ్బతీయాలని చూసే వారి నుండి రక్షిస్తాడు. నా కోసం ఒక అందమైన ప్రపంచాన్ని సృష్టించుకున్నాను. అందులోకి విజయ్ వర్మ వచ్చాడు. అతనున్న ప్రదేశమే నాకు ఇష్టమైన ప్రదేశం, అని తమన్నా అన్నారు. 
 

56
vijay varma

దీంతో విజయ్ వర్మ-తమన్నా బంధంపై ముసుగు తొలిగిపోయింది. వారు డేటింగ్ చేస్తున్నారన్న క్లారిటీ వచ్చింది. లస్ట్ స్టోరీస్ సీజన్ 2 జూన్ 29 నుండి స్ట్రీమ్ కానుంది. తమన్నా, కాజోల్, మృణాల్ ఠాకూర్ ప్రధాన పాత్రలు చేశారు. ఈ సిరీస్లో విజయ్ వర్మ సైతం భాగం కాగా తమన్నాతో ఆయనకు బోల్డ్ సన్నివేశాలు కూడా ఉన్నాయి. 20 ఏళ్ల కెరీర్లో అనేక మంది హీరోలతో పని చేసిన తమన్నా విజయ్ వర్మకు ఫ్లాట్ కావడం ఊహించని పరిణామం. 
 

66
Image: Vijay Varma, Tamannaah Bhatia / Instagram


ప్రస్తుతం తమన్నా తెలుగులో భోళా శంకర్, తమిళంలో జైలర్ మూవీ చేస్తున్నారు. ఇవి రెండూ దసరా ఇండిపెండెన్స్ డే కానుకగా ఒక రోజు వ్యవధిలో విడుదల కానున్నాయి. భోళా శంకర్, జైలర్ చిత్రాలతో చిరంజీవి, రజినీకాంత్ బాక్సాఫీస్ వద్ద పోటీపడుతున్నారు. 
 

click me!

Recommended Stories